Best Web Hosting Provider In India 2024
ఆచార్య చాణక్యుడు గొప్ప గురువు. సమాజం, ఆర్థిక శాస్త్రం, రాజకీయాలకు సంబంధించిన జ్ఞానాన్ని పంచుకున్నాడు. ఆయన చెప్పిన సూత్రాలు నేటికీ పాటించేవారు ఉన్నారు. మానవ జీవితంలోని చిన్న చిన్న విషయాల గురించి కూడా చాణక్య నీతి చెబుతుంది. అవి జీవితంలో ప్రతి ఒక్కరికీ చాలా ఉపయోగపడతాయి.
చాణక్య నీతి పుస్తకంలో మానవ జీవితంలో వచ్చే అన్ని సామాజిక, కుటుంబ సంబంధాల గురించి కూడా వివరంగా రాశాడు చాణక్యుడు. ప్రేమ, వివాహ సంబంధాల గురించి కొన్ని చిట్కాలు, విధానాలను పంచుకున్నాడు. చాణక్యుడు చెప్పిన సూత్రాలు నేటికీ సమాజంలో చాలా మంది ఫాలో అవుతారు. చాణక్యుడు చెప్పిన విధానాలు ప్రతీ ఒక్కరికీ సరిపోయేలా ఉంటాయి. అవి పాటిస్తే మీరు కచ్చితంగా జీవితంలో సంతోషంగా ఉంటారు.
స్త్రీలు పురుషులలో ఎలాంటి లక్షణాలను ఇష్టపడతారో చాణక్యుడు వివరించాడు. కొంతమందిపురుషులు మాత్రమే స్త్రీలను ఆకర్షించగలుగుతారు. ఆ విషయాలు మీలో ఉంటే అదృష్టవంతులు. మీరు కూడా మహిళలను ఇష్టపడేలా చేసే ఆ ప్రత్యేక విషయాలు ఏంటో తెలుసుకోండి.
పురుషులకు సాధారణ స్వభావం ఉండాలి
మహిళలు ఇప్పటికే వారి జీవితంలో అనేక ఇబ్బందులు, సంక్లిష్ట సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటువంటి పరిస్థితిలో వారు సాధారణ స్వభావం గల, వారి జీవితంలోని కష్టాలను కొంచెం తేలికగా చేసే పురుషులను ఇష్టపడతారు. సాధారణ స్వభావం గల పురుషుల నిర్ణయాత్మక సామర్థ్యం కూడా చాలా ఆకట్టుకుంటుంది. వారు ఎటువటి ఆడంబరాలు లేకుండా ఉంటారు. జీవితం గురించి ఓ క్లారిటీ ఉంటుందని చాణక్య నీతి చెబుతుంది.
గొప్ప వ్యక్తిత్వం కావాలి
మహిళలు గొప్ప వ్యక్తిత్వం ఉన్న పురుషులను మాత్రమే ఆకర్షణీయంగా చూస్తారు. పురుషుల లక్షణాలు, వారి స్వరం, స్త్రీలతో వారి ప్రవర్తన, ఇతర చిన్న విషయాలపై కూడా శ్రద్ధ చూపుతారు. అందువల్ల పురుషులు కూడా ఈ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చాణక్యుడు సూచించాడు. నిజానికి స్త్రీలు చిన్న విషయాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పురుషులు ఆ విషయాలను లైట్ తీసుకుంటే స్త్రీలు బాధపడుతారు. అందుకే అలా చేయకూడదు.
ధైర్యంగా ఉండే పురుషులు
చాణక్య నీతి ప్రకారం, పూర్తి ధైర్యం ఉన్న పురుషులను మహిళలు ఇష్టపడతారు. అలాంటి పురుషులు తమ భాగస్వాములను ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ విడిచిపెట్టరు. వారి ప్రేమను ధైర్యంగా కాపాడుకుంటారు. స్త్రీలు తమ కవచంగా నిలిచే అలాంటి పురుషులను ఆకర్షణీయంగా చూస్తారని చాణక్యుడు చెప్పాడు. చిన్న విషయాలకే భయపడే పురుషులు అంటే స్త్రీలకు ఇష్టం ఉండదు. వారిని ఎప్పుడూ తక్కువగానే చూస్తారు.
అహంకారం ఉండకూడదు
స్త్రీలు అహంకార స్వభావాన్ని కలిగి ఉన్నవారిని ఇష్టపడరు. అహం ఒక వ్యక్తిని స్వార్థపరుడిగా, సంబంధాల పట్ల ఉదాసీనంగా చేస్తుంది. అహం లేని పురుషులు తమ భాగస్వాములను అత్యంత భక్తితో చూసుకుంటారు. వారి చిన్న చిన్న అవసరాలను చూసుకుంటారు. అందువల్ల, ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని సృష్టించుకోవడానికి, ఒక వ్యక్తి తన అహాన్ని విడిచిపెట్టాలి. స్త్రీలకు బాగుండాలి. డౌన్ టూ ఎర్త్ ఉంటే పురుషులంటే స్త్రీలకు బాగా ఇష్టమని చాణక్య నీతి చెబుతుంది.