Kismat OTT Streaming: సైలెంట్‌గా ఓటీటీలో రిలీజైన లేటెస్ట్ తెలుగు కామెడీ థ్రిల్ల‌ర్‌ మూవీ – స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Best Web Hosting Provider In India 2024

Kismat OTT Streaming: న‌రేష్ అగ‌స్త్య‌, అభిన‌వ్ గోమ‌టం, విశ్వ‌దేవ్ హీరోలుగా న‌టించిన తెలుగు కామెడీ మూవీ కిస్మ‌త్ ఓటీటీలోకి వ‌చ్చేసింది. ఎలాంటి ముంద‌స్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా కిస్మ‌త్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాతో శ్రీనాథ్ బాదినేని ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కిస్మ‌త్ మూవీలో అవ‌స‌రాల శ్రీనివాస్ కీల‌క పాత్ర‌ను పోషించాడు.

ఫిబ్ర‌వ‌రి 2న థియేట‌ర్ల‌లో రిలీజ్‌…

ఫిబ్ర‌వ‌రి 2న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది. అభిన‌వ్ గోమ‌టం, న‌రేష్ అగ‌స్త్య యాక్టింగ్ బాగున్నా కామెడీ ఆశించిన స్థాయిలో పండ‌క‌పోవ‌డంతో ఫెయిల్యూర్ టాక్‌ను మూట గ‌ట్టుకుంది. కిస్మ‌త్ రిలీజైన రోజు టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎనిమిది సినిమాలు పోటీగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఈ పోటీ కార‌ణంగా కిస్మ‌త్ స‌రైన ఓపెనింగ్స్‌ను రాబ‌ట్ట‌లేక‌పోయింది.

కిస్మ‌త్ స్టోరీ లైన్‌…

కార్తిక్ (న‌రేష్ అగ‌స్త్య‌) అభి (అభిన‌వ్ గోమ‌టం), కిర‌ణ్ (విశ్వ‌దేవ్‌) గొడ‌వ‌ల కార‌ణంగా సొంత ఊరును వ‌దిలిపెట్టి హైద‌రాబాద్‌కు వ‌స్తారు. బ్యాక్‌డోర్ ద్వారా సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాల‌ని డ‌బ్బు పెడ‌తారు. కానీ ఆ కంపెనీ మూత‌ప‌డ‌టంతో ముగ్గ‌రు స్నేహితుల జీవితాలు క‌ష్టాల్లో ప‌డ‌తాయి.

ఆ టైమ్‌లో వారికి ఇర‌వై కోట్ల రూపాయ‌లు దొర‌కుతాయి. జ‌నార్ధ‌న్ అనే పొలిటిక‌ల్ లీడ‌ర్‌కు చెందిన డ‌బ్బు కార్తిక్ అండ్ గ్యాంగ్‌కు ఎలా దొరికింది? పోలీస్ ఆఫీస‌ర్ వివేక్ (అవ‌స‌రాల శ్రీనివాస్‌) ఇన్వేస్టిగేష‌న్‌లో ఈ డ‌బ్బు గురించి ఏం తేలింది? చివ‌ర‌కు ఈ ముగ్గురు స్నేహితుల జీవితాలు ఏమ‌య్యాయి? అనే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు శ్రీనాథ్ కిస్మ‌త్ మూవీని తెర‌కెక్కించాడు.

రియా సుమ‌న్ హీరోయిన్‌…

కిస్మ‌త్ సినిమాలో రియా సుమ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. అజ‌య్ ఘోష్ విల‌న్ పాత్ర చేశాడు. మార్క్ కే రాబిన్ ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు.

మ‌త్తు వ‌ద‌ల‌రాతో వైవిధ్య‌త‌….

మ‌త్తు వ‌ద‌ల‌రా సినిమాతో న‌టుడిగా వైవిధ్య‌త‌ను చాటుకున్నాడు న‌రేష్ అగ‌స్త్య‌. పాజిటివ్‌గా క‌నిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో మెప్పించాడు. మెన్ టూ, సేనాప‌తి, హ్యాపీ బ‌ర్త్‌డే ప‌లు తెలుగు సినిమాల్లో హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా క‌నిపించాడు. హీరోగా క‌మ‌ర్షియ‌ల్ బ్రేక్‌ కోసం న‌రేష్ అగ‌స్త్య ఎదురుచూస్తున్నాడు.

హీరోగా ఎంట్రీ…

మ‌రోవైపు అభివ‌న్ గోమ‌టం కూడా టాలీవుడ్‌లో బిజీగా అవుతోన్నాడు. అత‌డు హీరోగా ఎంట్రీ ఇచ్చిన మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీ ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. సేవ్ ది టైగ‌ర్స్ వెబ్‌సిరీస్ సీజ‌న్ వ‌న్‌తో పాటు సీజ‌న్‌2లో త‌న కామెడీ టైమింగ్‌తో అల‌రించాడు అభిన‌వ్ గోమ‌టం. ప్ర‌స్తుతం మై డియ‌ర్ దొంగ అనే సినిమాలో హీరోగా న‌టిస్తోన్నాడు. థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ త్వ‌ర‌లో ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024