Best Web Hosting Provider In India 2024
02 Apr 2024 10:41 AM
అన్నమయ్య జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ఆరో రోజు చీకటిమనిపల్లె నుంచి ప్రారంభమైంది. కాసేపటి క్రితం చీకటిమనిపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర ములకలచెరువు, పెదపాలెం మీదగా వేపురికోట, బుర్రకాయలకోట క్రాస్, గొల్లపల్లి,అంగళ్ళు చేరుకుంటుంది. అంగళ్ళు దాటిన తరువాత సీఎం వైయస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 3.30 గంటలకి మదనపల్లె చేరుకుని టిప్పు సుల్తాన్ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారిపల్లె శివారులో రాత్రి బస చేసే ప్రాంతానికి చేరుకుంటారు.