Best Web Hosting Provider In India 2024
02 Apr 2024 11:52 AM
అన్నమయ్య జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ..జైత్రయాత్రలా సాగుతోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ బస్సు యాత్ర ఇవాళ ఉదయం అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించింది. మొలకల చెరువు వద్దకు చేరుకున్న సీఎం వైయస్ జగన్‌కు జిల్లా ప్రజలు గజమాలతో ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి వేపురికోట చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు మేమంతా సిద్ధం అంటూ మహిళలు హారతులు పడుతూ స్వాగతం పలికారు.