Best Web Hosting Provider In India 2024
Maniratnam ThugLife: ఒకప్పుడు మణిరత్నంతో సినిమా చేయాలని దక్షిణాదిలోని స్టార్ హీరోలందరూ కలలు కనేవారు. బాలీవుడ్ హీరోలు సైతం ఈ దిగ్గజ దర్శకుడితో పనిచేసే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూసేవారు.
మణిరత్నం సినిమాలో ఒక్క ఫ్రేమ్‌లో కనిపించిన చాలని కోరుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. సిట్యూవేషన్ మారింది. మణిరత్నం పేరు వింటనే యంగ్ హీరోలందరూ జంకుతున్నారు. మణిరత్నంతో సినిమా అనగానే భయపడుతున్నారు.
పొన్నియన్ సెల్వన్ ఎఫెక్ట్…
పొన్నియన్ సెల్వన్ రిజల్ట్ ఎఫెక్ట్ మణిరత్నంపై గట్టిగానే పడింది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మల్టీస్టారర్ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. పార్ట్ వన్ మోస్తారు వసూళ్లను రాబట్టగా పార్ట్ 2 మాత్రం పూర్తిగా డిసపాయింట్ చేసింది. సినిమా కోసం పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాబట్టలేకపోయింది.
థగ్ లైఫ్‌లో…
పొన్నియన్ సెల్వన్ తర్వాత కమల్‌హాసన్‌తో థగ్ లైఫ్ మూవీ తెరకెక్కిస్తోన్నాడు మణిరత్నం. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో కమల్‌హాసన్‌తో పాటు యంగ్ హీరోలు జయం రవి, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. డేట్స్ ఇష్యూతో పాటు ఇతర కారణాల వల్ల థగ్ లైఫ్ మూవీ నుంచి దుల్కర్ సల్మాన్, జయం రవి ఒకరి తర్వాత మరొకరు తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వీరి పాత్రలను భర్తీ చేసే యంగ్ హీరోల కోసం మణిరత్నం చాలా కాలంగా వెతుకుతున్నారు. కార్తి, శింబు, విజయ్ సేతుపతితో చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఒకరిద్దరు తెలుగు హీరోలను కూడా అనుకున్నట్లు సమాచారం. కానీ వారెవరూ మణిరత్నంతో సినిమా చేయడానికి ముందుకు రాలేదని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
దిగ్గజ దర్శకుడికి హ్యాండ్…
ఏవేవో రీజన్స్ చెప్పి ఈ దిగ్గజ దర్శకుడికి హ్యాండిచ్చినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరోలు థగ్ లైఫ్‌లో నటించడానికి తిరస్కరించడంతో జయం రవి స్థానంలో సీనియర్ నటుడు అరవింద్ స్వామిని మణిరత్నం ఎంపికచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అరవింద్ స్వామికి తగ్గట్లుగా ఈ పాత్రలో పలు మార్పులు చేసినట్లు సమాచారం. దుల్కర్ క్యారెక్టర్ తగ్గ నటుడి కోసం మణిరత్నం ఇంకా అన్వేషణ కొనసాగిస్తోన్నట్లు తెలిసింది.
35 ఏళ్ల తర్వాత…
గతంలో కమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన నాయకుడు కోలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది. గ్యాంగ్‌స్టర్ సినిమాలకు స్ఫూర్తిగా నిలిచింది నాయకుడు తర్వాత కమల్‌హాసన్‌తో మణిరత్నం సినిమాలు చేయలేకపోయారు.
దాదాపు 35 ఏళ్ల విరామం అనంతరం మళ్లీవీరిద్దరు కలిసి థగ్ లైఫ్ మూవీ చేయడం కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. థగ్‌లైఫ్‌లో కమల్‌హాసన్ క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్‌తోసాగుతుందని అంటున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో థగ్ లైఫ్ మూవీ తెరకెక్కుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది
కల్కిలో కమల్‌హాసన్ విలన్…
ప్రస్తుతం థగ్ లైఫ్‌లో పాటు మరో నాలుగు సినిమాలతో కమల్ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ కల్కి 2989 ఏడీలో కమల్‌హాసన్ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రభాస్‌కు ధీటుగా పవర్‌ఫుల్‌గా పవర్‌ఫుల్ విలన్‌గా కమల్‌హాసన్ కనిపించబోతున్నట్లు సమాచారం. మే 9న ఈ మూవీ రిలీజ్ కానుంది. కమల్‌హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఇండియన్ 2 మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయింది.
1996లో రిలీజైన ఇండియన్‌కు సీక్వెల్‌గా ఇండియన్ 2 తెరకెక్కుతోంది. వేసవిలో ఇండియన్ 2 రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. హెచ్ వినోద్‌తో కమల్ ఓ సినిమా చేయనున్నారు. అలాగే శివకార్తికేయన్ హీరోగా నటిస్తోన్న అమరన్ సినిమాలో కమల్‌హాసన్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
టాపిక్