దళితులు,పేదలు, టిప్పర్‌ డ్రైవర్లే బాబును పాతాళానికి తొక్కేస్తారు

Best Web Hosting Provider In India 2024

పెత్తందారీ పోకడలతో పేదల పొట్ట కొడుతున్న చంద్రబాబు 

నిమ్మగడ్డతో వాలంటీర్ల సేవలను ఆపించి.. ఇప్పుడు మొసలి కన్నీరా..?

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున

తాడేప‌ల్లి: పింఛన్లు ఆపించి తగుదునమ్మా అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడని, రాష్ట్రంలోని ద‌ళితులు, పేద‌లు, టిప్ప‌ర్ డ్రైవ‌ర్లే చంద్ర‌బాబును వ‌చ్చే ఎన్నిక‌ల్లో పాతాళానికి తొక్కేస్తార‌ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. చంద్రబాబునాయుడు పరిస్థితి చూస్తుంటే ఎంతటికైనా దిగజారి రాజకీయాలు చేసి, రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచాలని ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ, బాధ్యతాయుతంగా ఉండే రాజకీయ నాయకుడిలా చంద్ర‌బాబు లేనే లేడన్నారు. బంధువు నిమ్మగడ్డ రమేష్‌ అనే వ్యక్తిని పక్కన పెట్టుకుని వాలంటీర్‌ వ్యవస్థపై కుట్రలు చేశాడని మండిప‌డ్డారు. పెత్తందారీ పోక‌డ‌ల‌తో చంద్ర‌బాబు నాయుడు పేద‌ల పొట్ట కొడుతున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి మేరుగు నాగార్జున విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.

మంత్రి మేరుగు నాగార్జున ఏం మాట్లాడారంటే..
నిమ్మగడ్డ సర్వీసులో ఉన్నప్పుడు మాపై కుట్రలు కుతంత్రాలతో పనిచేశాడు. ఆయన ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు కూడా బద్ధ విరోధిలా పనిచేశారు. ఆయనే ఈ రోజు దేశంలోనే గొప్ప సంస్కరణగా నిలిచిన వాలంటీర్‌ వ్యవస్థపై కత్తి కట్టారు. పేద ప్రజలు, నిస్సహాయులను ఆదుకోడానికి, సంక్షేమ కార్యక్రమాలను సక్రమమైన పద్దతిలో చేరవేసే ఉద్ధేశంతో వాలంటీర్‌ వ్యవస్థను వైయ‌స్‌ జగన్‌ పెట్టారు. అలాంటి వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా పింఛన్లు పంచకూడదని నీ బంధువు ద్వారా కోర్టులకు, ఎన్నికల కమిషన్‌కు వెళ్లి ఆ వ్యవస్థను నిలిపేశావంటే ఎంత దిగజారావో అర్ధం అవుతోంది. వాలంటీర్లు పింఛన్లు పంచకూడదని కేసులు వేయించి, తగుదునమ్మా అంటూ మళ్లీ పింఛన్లు పంచాలంటే సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నావు. రాష్ట్రంలో వాలంటీర్లు ఎలాంటి సర్వీసులు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. 

వాలంటీర్‌ వ్యవస్థను ఆపి రాజ‌కీయంగా లబ్ధిపొందాలని బాబు ఆలోచన
ఏదో ఒక విధంగా గందరగోళం సృష్టించి లబ్ధిపొందాలనే చంద్రబాబు ఈ తప్పుడు చర్యకు పాల్పడ్డాడు. ఈ రోజు పింఛన్లు రాక అనేక ఇబ్బందులు పడటానికి కారణం చంద్రబాబే. ఎందుకు పింఛన్లు పంచలేదని ఇప్పుడు మాట్లాడుతున్నావు. అంతా నువ్వే చేసి తగుదునమ్మా అంటూ మెసేజ్‌లు పెట్టడం ఏంటి? ఎవరితో ఆపించావో నీకు తెలుసు. ఆపించిన వ్యక్తి ఎవరో నీకు తెలుసు. నువ్వు ప్రజల్ని మోసం చేయడానికి ఎక్స్‌(ట్విట్టర్‌)లో మెసేజ్‌లు పెడుతున్నారు. నువ్వొచ్చాక పింఛన్లు ఇస్తావా? నువ్వు వచ్చేది ఏంటి బోడిగుండు? నువ్వు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో హామీ ఇస్తున్నావు. నీ బతుకు చెడ. 

ఈ రాష్ట్రంలో నువ్వు ఏడవలేక, 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టుకోలేక అరువు తెచ్చుకున్నావు. నువ్వు ఒళ్లు బలిసి మాట్లాడుతున్నావు. ఓ పక్క వాలంటీర్లను భయపెట్టి బెదిరిస్తున్నావు. పేదలకు సాయం చేసే అవకాశం లేకుండా చేసి బరితెగించావు. రాష్ట్రంలో ఒక గొప్ప వ్యవస్థను ప్రభుత్వం  నడుపుతుంది.  నువ్వు ఎంత బరితెగిస్తున్నావో అర్ధం అవుతుందా? ఎస్సీ, ఎస్టీలను అపహాస్యం చేశావ్‌..ఎస్సీల్లో పుట్టకూడదు అని చెప్పావు. బీసీల తోకలను కత్తిరిస్తానన్నావు..బీసీలు జడ్జిలుగా పనికిరానన్నావు. నువ్వు డబ్బులున్న వారి అడుగులకు మడుగులు వత్తుతున్నావు. నా పేదవాళ్లు, నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటూ పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి. 

టిప్పర్‌ డ్రైవర్లే నిన్ను పాతాళానికి తొక్కేస్తారు చూడు చంద్రబాబూ..
టిప్పర్‌ డ్రైవర్‌కి టికెట్‌ ఇచ్చారంటూ మాట్లాడతావా? ఎంత మదంతో ఉన్నావు.. మా పల్లెల్లోకి వచ్చి నువ్వు ఓట్లు అడుగుతావా? ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని నువ్వు అపహాస్యం చేస్తే పేదవారి స్థితిగతులను మార్చడానికి వైయ‌స్‌ జగన్‌ పనిచేస్తున్నారు. టిప్పర్‌ డ్రైవర్‌గా ఉన్న నా ఎస్సీ సోదరుడికి…అంబేద్కర్‌ కల్పించిన అవకాశాన్ని వైయ‌స్‌ జగన్‌ ఇంప్లిమెంట్‌ చేస్తున్నారు. మా డ్రైవర్లు అంటే నీకు అంత తేలిక. ఆటోలు, టిప్పర్లు, లారీలు నడుపుతున్న ప్రతి డ్రైవర్‌ చంద్రబాబు అంతాన్ని పంతంగా తీసుకోవాలి. 2.70 లక్షల కోట్ల రూపాయలు నేరుగా పేద ప్రజలకు అందించి రాష్ట్రంలో వారికి భరోసా కల్పించిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌. ఈ రాష్ట్రంలో పైసా అవినీతి జరిగిందని నువ్వు చెప్పగలుగుతావా? అంత గుండె ధైర్యం నీకు లేదు. నువ్వూ, నీ కుట్రలు, నీ కుతంత్రాలు నిలవవు. చివరికి మెసేజ్‌లు పెట్టేకాడికి దిగజారావు. పింఛన్లు పంచకుండా ఉండటానికి కారణం, ఆపడానికి కారణం చంద్రబాబు. కరోనా వస్తే చంద్రబాబు అండ్‌ కో పారిపోయి హైదరాబాద్‌లో ఉంటే ఈ వాలంటీర్లు అద్భుతమైన సేవ చేశారు.  

నువ్వు ఈ రోజు అలాంటి వారిని భక్షించడానికి సిద్ధంగా ఉన్నావా చంద్రబాబూ? నువ్వు వాలంటీర్లను ఎందుకు ఆపావో చెప్పగలవా? దొంగలా వారిని ఆపడం రాజకీయం అనుకుంటున్నావా? ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నారు. చరిత్ర పునరావృతం అవుతోంది. కాసుకో  చంద్రబాబూ..నీ కుట్రలు, కుతంత్రాలు వైయ‌స్‌ జగన్‌ ముందు చెల్లవు. మా పార్టీలో ఉన్నదంతా పేదలు. వారే వైయ‌స్‌ జగన్‌ని అక్కున చేర్చుకుంటున్నారు. ఏ బ్లేడో, ఏ కత్తో..ఎక్కడ జరిగిందో పవన్‌ కల్యాణే చెప్పాలి. విలువలు లేని మాటలు, విశ్వసనీయత లేని మాటలు పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతుంటే మేమెందుకు సమాధానం చెప్పాలి? వారెన్ని మాటలు మాట్లాడినా ప్రజలు వారిని తుంగలో తొక్కుతారు. 

Best Web Hosting Provider In India 2024