EC on AP Pensions : ఏపీలో రేపట్నుంచి పింఛన్ల పంపిణీ, ఈసీ మార్గదర్శకాలు జారీ

Best Web Hosting Provider In India 2024

EC on AP Pensions : ఏపీలో పింఛన్ల పంపిణీ రాజకీయ మలుపులు తిరుగుతోంది. వాలంటీర్లతో(Volunteers) పింఛన్ల పంపిణీ వద్దని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈసీ ఆదేశాలకు (EC Orders)టీడీపీ నాయకులే కారణమని వైసీపీ ఆరోపిస్తుంది. వైసీపీ ఆరోపణలను తిప్పుకొడుతూ టీడీపీ నేతలు ఇంటింటీ వెళ్లి పింఛన్ల ఆలస్యానికి వైసీపీ కారణమని ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పింఛన్ల పంపిణీపై నెలకొన్న గందరగోళానికి ఈసీ ఫుల్ స్టాప్ పెట్టింది. ఏపీలో పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.

 

ట్రెండింగ్ వార్తలు

పింఛన్ల పంపిణీపై ఈసీ మార్గదర్శకాలు

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సీఈఓ ఆదేశాలను సవరించిన ఈసీ… పెన్షన్ల పంపిణీపై(AP Pensions Distribution) మార్గదర్శకాలు జారీచేసింది. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్‌ 6 వరకు వివిధ కేటగిరీల వారీగా పెన్షన్లు(Pension) పంపిణీ చేయాలని ఈసీ మార్గదర్శకాల్లో పేర్కొంది. కొంత మందికి ఇంటి వద్దే పింఛన్ల పంపిణీతో పాటు మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద అందజేయాలని ఆదేశించింది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారు, అస్వస్థతకు గురైన‌వారు, వితంతువుల‌కు ఇంటి వ‌ద్దే పింఛన్‌ అందించాలని ఈసీ ఆదేశించింది. దీంతో గ్రామ, స‌చివాల‌యాల‌కు దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల పింఛన్ దారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా కలెక్టర్లను ఈసీ ఆదేశించింది.

సచివాలయాల పనిసమయాలు పొడిగింపు

ఈ నెల 3న పింఛన్ల పంపిణీ(AP Pensions) ప్రారంభించి, 6వ తేదీ నాటికి ముగించాలని ఈసీ(EC on Pensions) మార్గదర్శకాల్లో పేర్కొంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల సిబ్బంది మాత్రమే ఉండడంతో రెండు కేటగిరీలుగా పింఛన్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో… ఈ నాలుగు రోజులు ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలను(AP Sachivalayas) పనిచేయాలని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది.

 
 
WhatsApp channel
 

సంబంధిత కథనం

టాపిక్

 
 
Andhra Pradesh Assembly Elections 2024Andhra Pradesh NewsTrending ApElection Commission Of IndiaState Election CommissionElection CodeAp Govt
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024