Best Web Hosting Provider In India 2024
మదనపల్లె సభలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు
పేదల పక్షాన ఉన్న మనకు గొప్ప గెలుపు రాబోతోంది
ఇంటింటి అభివృద్ధిని, ప్రతీ ఊరు అభివృద్ధిని, సామాజిక వర్గాల అభ్యున్నతిని, అక్క చెల్లెమ్మల సాధికారితను, అవ్వా తాతల
సంక్షేమాన్ని, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకునేందుకు, కొనసాగించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా ?
చేసిన మంచిని ప్రతీ గడపకు వివరించి 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు గెలించేందుకు, డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా
2019లో దేవుడు, మీరు ఇచ్చిన చారిత్రక తీర్పు తర్వాత మ్యానిఫెస్టోలో ఇచ్చి న ప్రతీ హామీని నెరవేర్చాం
మ్యానిఫెస్టోలో ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చిన ప్రభుత్వం..
ప్రతిపక్షంలో ఉన్నవారంతా విడివిడిగా రాలేకపోతున్నారు.. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయలేకపోతున్నారు
అధికారం కోసం గుంపులుగా, తోడేళ్లుగా జెండాలు జత కట్టి అబద్ధాలతో వస్తా ఉన్నారు.
జెండాలు జత కట్టడమే వారి పని.. జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ పని అని సగర్వంగా చెప్పగలుగుతున్నాను
ఇవాళ ఒక్కడి మీద ఎంత మంది దాడి చేస్తున్నారో చూడండి
ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ-5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రులు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్.. వీళ్లందరికీ తోడు కుట్రలు-కుతంత్రాలు
ఒక్కడి మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారంటే మిమ్మల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా
విలువులు, విశ్వసనీయతలు లేని ఇలాంటి వారితో ముఫ్పై పార్టీలు కలిసి వచ్చినా భయపడతామా?
వైయస్ జగన్ సీఎంగా ఉంటేనే పథకాలన్నీ కొనసాగుతాయి
జగన్ పేరు చెబితేనే సంక్షేమం, అభివృద్ధి గుర్తుకువస్తాయి
2 లక్షల 31 వేల ఉద్యోగాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్
చంద్రబాబు జిత్తులమారి, పొత్తుల మారి
అధికారం కోసం చంద్రబాబు పసుపుపతిగా మారాడు
మోసాలే అలవాటుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న వ్యక్తి బాబు
2014లో పసుపుపతిగా మూడు పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నాడు
రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?
ఎన్నికలు అయిపోగానే మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారు
ఇదే పొత్తు.. ఇదే పార్టీలు.. ఇదే కూటమి.. మరోసారి రంగు రంగుల మ్యానిఫెస్టోలు తయారు చేసి డ్రామకు తెర
ఇలాంటి కూటమికి బుద్ధి చెప్పాలా.. వద్దా
నిమ్మగడ్డతో చంద్రబాబు ఫిర్యాదు చేయించి పెన్షన్లను అడ్డుకున్నాడు
ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. గతంలో కోర్టులకెళ్లి అడ్డుకున్నాడు
బాబుకు ఓటు వేశామంటే వాలంటీర్ వ్యవస్థను సైతం, స్కీములను సైతం, పెన్షన్లను సైతం అన్నింటికీ రద్దు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని ప్రతీ ఒక్కరూ ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి
పేదవాళ్ల కోసం, నా అక్క చెల్లెమ్మల భవిష్యత్ కోసం మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కాడు..
వారంతా ఏకమై రెండే రెండు బటన్లు నొక్కాలి.. ఫ్యాన్ గుర్తు మీద నొక్కాలి
మన వేసే ఈ ఓటు ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడమే కాదు.. మీ భవిష్యత్, మీ పిల్లల భవిష్యత్, మీ ఇంట్లో ఆడపడుచుల భవిష్యత్, మీ ఇంట్లో అవ్వా తాతల భవిష్యత్ అంతా కూడా మీ ఓటు మీద ఆధారపడి ఉంది
మదనపల్లె: మళ్లీ జగనన్నే రావాలని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. జగనన్నను మళ్లీ తెచ్చుకుందా.. అన్న మళ్లీ భారీ మెజార్టీతో వస్తే ఈ మంచి అంతా కొనసాగుతుందని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి అంటూ సూచించారు. ఎన్నికల సంగ్రామంలో ఇంతమంది జతకట్టి వచ్చినా వాళ్లకు తెలియని విషయం ఏంటంటే.. 99 మార్కులు తెచ్చుకున్న విద్యార్ధి పరీక్షలకు భయపడుతాడా?. అటు వైపు గతంలో పరీక్షలు రాసి 10 మార్కులు కూడా తెచ్చుకొని వారు ఉన్నారు. ఇటు ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి 99 శాతం హామీలు నెరవేర్చిన మీ జగన్ ఉన్నారు. విలువలు, విశ్వసనీయత లేని వారు 30 పార్టీలు కలిసి వచ్చినా భయపడతామా అని ప్రశ్నించారు. మేము మంచి చేయకపోతే ఇంతమంది కలిసి మాపై పోటీ చేస్తారా?. 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేని చంద్రబాబు మా ముందు నిలబడగలరా. విపక్షాల పొత్తులు చూసి ఎవరూ భయపడటం లేదు. మనకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించాం. ఇంటింటికి వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు మనకు మాత్రమే ఉందని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు.
వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏమన్నారంటే..
మదనపల్లిలో అన్నమయ్య జిల్లాలో ఈ రోజు..ఇక్కడ కనిపిస్తున్న అభిమానం ఒక జనసముద్రాన్ని తలపిస్తోంది. మనందరి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఇంటింటికి చేసిన మంచికి మద్దతు పలుకుతూ..మళ్లీ మనందరి ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షతో పేదల వ్యతిరేకులను, పెత్తందార్లను, ప్రతిపక్ష కూటమిని ఓడించాలనే సంకల్పంతో తరలివచ్చిన సమరయోదుల సముద్రం ఇదీ..
ఇంటì ంటి నుంచి తరలి మదనపల్లెకు వచ్చిన నా ఆత్మబంధువుల జన సముద్రం ఇది. నా ఆత్మబంధువులైన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, నా అవ్వాతాతలకు..మీ అందరికీ కూడా మీ జగన్ ..మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఈ చిరునవ్వుల మధ్య, మీ ఆత్మ విశ్వాసం చూస్తుంటే గుండె నిండ సంతోషంగా ఉంది. మీ ఉత్సాహం చూస్తుంటే మరో ఆరు వారాల్లోపే జరుగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో పేదల పక్షాన పేదల భవిష్యత్ కోసం ఒక గొప్ప గెలుపు కళ్లెదుటే కనిపిస్తుంది మీ అందరి ఉత్సాహం మధ్య.
పేదల భవిష్యత్ కోసం జరుగబోయే ఈ యుద్ధంలో గెలుపు కోసం నేను సిద్ధం..మీరంతా కూడా సిద్ధమా? అని అడుగుతున్నాను. ఇంటింటి అభివృద్ధిని, ప్రతి ఊరి అభివృద్ధిని, సామాజిక వర్గాల అభ్యున్నతిని, అక్కచెల్లెమ్మల సాధికారతను, అవ్వాతాతల సంక్షేమం, మన పిల్లల భవిష్యత్‌ను కా పాడుకునేందుకు, కొనసాగించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా?
ఇంటింటికి మంచి చేశాం..ప్రతి గ్రామానికి మంచి చేశాం. చేసిన ఆ మంచిని ప్రతి గడపకు వివరించి 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 స్థానాలు గెలవాలి. ఎక్కడా ఒక్క సీటు కూడా తగ్గేదే లేదు. డబుల్ సెంచరీ 200 కొట్టేందుకు మీరంతా కూడా సిద్ధమేనా ?
2019లో దేవుడు, మీరు ఇచ్చిన చారిత్రక తీర్పు తరువాత, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలు నెరవేర్చిన తరువాత మళ్లీ ఓటు అడిగేందుకు వచ్చిన ప్రభుత్వం. విశ్వసనీయతకు ఇది అర్థమని చెబుతూ అడుగులు వేశాం.
ఐదేళ్లు..మన ప్రభుత్వం మంచి పాలన అందించిన తరువాత ఇవాళ మళ్లీ ముందు నిలబడి ఇంత మంచి చేశామని సగర్వంగా, సవినయంగా చెప్పగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా కూడా నా దగ్గర నుంచి మన పార్టీ కార్యకర్తలు, నాయకులు, మన అభిమానులు, మన వాలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్లి గడిచిన ఈ 58 నెలల్లో ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే మీ జగన్‌కు, మీ బిడ్డకు, మన ప్రభుత్వానికి అండగా తోడుగా నిలబడండి అని ఆత్మవిశ్వాసంతో ప్రతి గడపకు వెళ్లి అడుగగలుతున్నారంటే దానికి కారణం దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఇంటింటికీ, ప్రతి గ్రామానికి మంచి చేయగలిగామని సగర్వంగా తెలియజేస్తున్నాను.
ఇవాళ ఎన్నికలు వస్తున్నాయంటే ప్రతిపక్షాలన్నీ కూడా విడివిడిగా రాలేకపోతున్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికీ లేదు. అధికారం కోసం గుంపులుగా తోడేళ్లుగా జెండాలు జత కట్టి అబద్ధాలతో వస్తున్నారు. జెండాలు జత కట్టడమే వారి పని, ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ చేశారని గర్వంగా చెబుతున్నాను.
ఇంత మంచి జరిగింది కాబట్టి, ప్రతి గుండెలో మీ బిడ్డ ఉన్నాడు, మన ప్రభుత్వం ఉంది. అందుకే ఈ రోజు ఒక్కడి మీద ఎంత మంది దాడి చేస్తున్నారో చూడండి. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్, వీరందరికీ తోడు కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు చేస్తున్నారు.
మీ జగన్ ప్రతి ఇంటికి మంచి చేయకపోయి ఉంటే, మేనిఫెస్టోను నెరవేర్చకపోతే ఇన్ని పార్టీలు కలిసివస్తున్నాయి. అందరికీ కూడా తెలియని విషయం ఒక్కటి ఉంది. ఇంత మంది జత కట్టి వచ్చినా కూడా ..99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడుతాడా?. అటువైపున గతంలో వాళ్లు పరీక్షలు రాసినప్పుడు 10 మార్కులు కూడా తెచ్చుకోలేని స్టూడెంట్ పరీక్ష పాస్ అవుతాడా?
ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావించి 99 శాతం వాగ్ధానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు, ఎప్పుడు 10 శాతం కూడా నెరవేర్చలేని చంద్రబాబు కూటమి నిలబడుతుందా?. లేదు. విలువలు, విశ్వసనీయత లేని ఇలాంటి వారితో 30 పార్టీలు కలిసి వచ్చినా, ఇలాంటి పొత్తులను చూసి మన అభిమానులు, మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు ఇంటింటా అభివృద్ధి అందుకున్న ఆ పేద వర్గాలు భయపడుతారా?. పైగా చెబుతున్న ఒకే ఒక సమాధానం..మేమంతా సిద్ధం అంటున్నారు.
ఐదేళ్ల తరువాత జరుగుతున్న ఈ యుద్ధానికి మనమంతా కూడా ఇంతగా ఎలా సిద్ధమయ్యామంటే..దానికి కారణం ఇంటింటికీ అందితేనే అది సంక్షేమం అని చూపించాం. గ్రామానికి మంచి చేయడం అంటే ఇదీ అని చేసి చూపించాం కాబట్టి. మంచి చేసే ప్రక్రియలో ఎక్కడా కూడా కులం చూడలేదు. మతం చూడలేదు. రాజకీయాలు చూడలేదు. గత ఎన్నికల్లో మనకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు. వారికి మంచి జరగాలని వారికి సైతంమంచి చేశాం కాబట్టి. అందుకే మనకు మాత్రమే ఇంటింటికి వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు వైయస్‌ఆర్‌సీపీకి మాత్రమే ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాను.
గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన వారిని కూడా గత ప్రభుత్వం మీకు ఏమీ చేసిందని అడిగి మనం ఏం మంచి చేశామో వారికి చూపించి, వారి గుండెను గెలిచి ఫ్యాన్‌కు ఓటు వేస్తేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయని చెప్పే నైతికత మనకు మాత్రమే ఉందని సగర్వంగా చెబుతున్నాను.
175కు 175 అసెంబ్లీలు, 25 ఎంపీ స్థానాలతో మనందరి ప్రభుత్వమే ఎందుకు రావాలంటే..మన అక్కచెల్లెమ్మలకు ఈ ఐదేళ్ల మాదిరిగానే వచ్చే ఐదేళ్లు ఆర్థికంగా బలోపేతం చేయడానికి మనందరి ప్రభుత్వమే రావాలి. కుటుంబానికి ఆ అక్కచెల్లెమ్మలు బలమైన శక్తిగా నిలబెట్టే ప్రక్రియ కోసం మళ్లీ అధికారం అడుగుతున్నాం. వివిధ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాలో జమచేశాం. ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అందించాం.
గడిచిన ఐదేళ్లలో వివిధ పథకాల కోసం నేరుగా బటన్ నొక్కి రూ.2.70 లక్షలు డీబీటీ ద్వారా అందించాం. నాన్ డీబీటీ ద్వారా దాదాపుగా లక్ష కోట్లు అందించాం. అక్షరాల రూ.3.75 లక్షల కోట్ల పైచిలుకు అందించాం. ఎక్కడా అవినీతి, లంచం, దోపిడీ లేదు. ఇదీ మనం చేసిన మన ట్రాక్ రికార్డు.
చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రాదు. ఏ స్కీమ్ గుర్తుకు రాదు. అదే మీ జగన్ పేరు చెబితే ఏం గుర్తుకు వస్తుందో మీరే చూడండి. మీ గ్రామాల్లోనే, మీ వార్డుల్లోనే సచివాలయాలు, అందులో 10 మంది శాశ్వత ఉద్యోగాలు, ఇంటికే వచ్చే వలంటీర్లు, వారు అందించే పింఛన్‌అంటే మీ జగన్ గుర్తుకు వస్తారు. లంచాలు, అవినీతి లేని పాలన అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. డీబీటీ ద్వారా నేరుగా డబ్బులు పంపించింది మీ జగన్. మీ ఊర్లోనే విలô జ్ క్లినిక్స్, ఉచితంగా మందులు, టెస్ట్‌లు, గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్‌లు, ప్రతి క్లాస్ రూమ్‌లో డిజిటల్‌బోధన అంటే జగన్ గుర్తుకువస్తారు. గ్రామంలోనే ఆర్‌బీకే, రైతులకు సున్నా వడ్డీ, పగటి పూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, సమయానికి ఇన్‌ఫుట్ సబ్సిడీ అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్.
30 లక్షల ఎకరాలపై శాశ్వత హక్కులు ఇచ్చింది ఎవరూ అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ బటన్ నొక్కి రూ.2.70 లక్షల కోట్లు బటన్ నొక్కి ఇచ్చింది ఎవరూ అంటే మీ జగన్. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా 2.31 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చింది మీ జగన్. ఇందులో 80 శాతం ఉద్యోగాలు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నాబీసీలు, నా మైనారిటీలే ఉన్నారు.
అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చింది మీ జగనే. అందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నది మీ జగన్ పాలనలోనే. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు జరగని విధంగా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు అండగా ఉంటూ ఓ అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, వైయస్‌ఆర్ ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, కళ్యాణమస్తు, షాదీతోపా అంటే గుర్తుకువచ్చేది మీ జగనే. ప్రతి గ్రామంలో మహిళా పోలీసు ఉన్నారంటే గుర్తుకు వచ్చేది మీ జగనే.
ఈ రోజు రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. నాలుగు సీ పోర్టులు కడుతున్నాం. 10 ఫిషింగ్ హార్బర్లు జరుగుతున్నాయి. పారిశ్రామిక కారిడార్లు వచ్చాంటే ఇవన్నీ కూడా వైయస్‌ఆర్ ప్రభుత్వంలోనే జరిగాయని గర్వంగా చెబుతున్నాను.
మరోసారి ఎన్నికల సమయం వచ్చింది. ఇలాంటి సమయంలో ఒక్కసారి ప్రతిపక్ష కూటమి గురించి మాట్లాడుకుందాం. ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరోతెలుసా..మోసాలే అలవాటుగా ఎత్తుల మారి, జిత్తుల మారి ముఠా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. మీరంతా అరుంధతి సినిమా చూశారా? సమాధిలో నుంచి లేచిన పశుపతి లాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు అనే పసుపుపతి ఐదేళ్ల తరువాత లేచి వచ్చి వదల బొమ్మాళి వదలా అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కూర్చీని చూసి కేకలు పెడుతున్నాడు ఈ పసుపుపతి. నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్నాడు. ఈ వదల బొమ్మాళి గురించి 2014లో ఏం జరిగిందో ఒక్కసారి ప్లస్‌బ్యాక్‌లోకి వెళ్లాదామా?
2014లో ఈ పసుపుపతి..ఇదే మాదిరిగా మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడు. ఈ మూడు పార్టీలు కలిసి ఇంటింటికీ తన ముఖ్యమైన హామీలు అంటూ కరపత్రాలు పంపించాడు. ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీ కలిసి..కింద చంద్రబాబు సంతకంతో ఇంటింటికీ కరపత్రం పంపించాడు. టీవీ ఆన్‌చేస్తే చాలు ఊదరగొట్టాడు.
రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం అన్నాడు. రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ చేశాడా?. మరో ముఖ్యమైన హామీ..పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు. రూ.14,250 కోట్లు రద్దు చేస్తామన్నారు. కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? లేదు. మరో ముఖ్యమైన హామీ..ఆడబిడ్డపుట్టిన వెంటనే మహాలక్ష్మీ పథకం కింద రూ.25 వేలు బ్యాంకు అకౌంట్‌లో డిపాజిట్ చేస్తామన్నారు. ఒక్కరూపాయి కూడా జిపాజిట్ చేయలేదు.
మరో ముఖ్యమైన హామీ..ఇంటింటీకి ఉద్యోగం ఇస్తాం..లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగభృతి ఇస్తామన్నారు. ఐదేళ్లు..60 నెలలు , ప్రతి నెల రూ.2 వేలు ఇవ్వాలి కదా?. రూ.1.20 లక్షలు ఎవరికైనా ముట్టిందా? లేదు. మరో ముఖ్యమైన హామీ అర్హులైన అందరికీ మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కనీసం ఒక్కరికైనా ఒక్క సెంట్ స్థలమైనా గానీ ఇచ్చాడా అని అడుగుతున్నాను. లేదు.
రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్‌లూమ్ రుణాలు మాఫీ అన్నాడు. చేయలేదు. ఉమెన్ ప్రోటెక్షన్ పోర్స్ అన్నాడు. రాష్ట్రాన్ని సింగపూర్‌మించి అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి నగరంలో ఐటెక్ సిటీ నిర్మిస్తామన్నారు. మదనపల్లెలో ఏమైనా ఐటెక్ సిటీ కనిపించిందా? లేదు. ఇవీ ముఖ్యమైన హామీలు..ఇవి కాకుండా 600 హామీలు కనిపిస్తాయి. ముఖ్యమైన హామీల పరిస్థితి ఇదైతే..ఎన్నికల మేనిఫెస్టో ఎక్కడ దాచారో తెలియదు. కరపత్రంలో చెప్పిన ముఖ్యమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు, దత్తపుత్రుడు, మోదీ..సంతకం చేసిన కరపత్రం ఇది. వీరు ముగ్గురు కలిసి, చంద్రబాబు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అంటూ ప్రతి ఇంటికి పంపించిన హామీల్లో కనీసం ఒక్కటైనా నెరవేర్చారా? పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? లేదు.
మరీ ఇదే పొత్తు, ఇదే ముగ్గురు, ఇవే పార్టీలు కూటమిగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇదే మాదిరిగా మీటింగ్‌లు పెట్టి ముగ్గురు ఫోటోలు పెట్టి మరోసారి ఇదే డ్రామాకు తెర లేపారు. ఇంకా ఎక్కువ హామీలు ఇస్తూ ఇంకో డ్రామాకు తెర లేపారు. ఇంటింటికి కేజీ బంగారం అంటున్నారు. ఇంటì ంటికీ బెంజి కారు అంటున్నారు. ఇదే ముగ్గురు కలిసి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటున్నారు.
వదల బొమ్మాలి అంటూ పేదల రక్తం పీల్చేందుకు పసుపుపతివస్తున్నారు. ఈ పసుపుపతిని ఎవరైనా నమ్మవచ్చా? నమ్మిన వారిని నట్టెట ముంచి అధికారం ఎలాగైనా దక్కించుకోవాలని, మరోసారి రాష్ట్రాన్ని దోచుకోవాలని చంద్రబాబు ప్లాన్. ఈ మనిషికి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేసేందుకు కాదు. దోచుకోవడం, పంచుకోవడం కోసమే వీరికి అధికారం కావాలి. ఇలాంటి కూటమికి బుద్ధి చెప్పాలా వద్దా?. గవర్నమెంట్‌బడుల్లో ఇంగ్లీష్ మీడియం వద్దన్న వారికి బుద్ధి చెప్పాలా వద్దా?
పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే సామాజిక సమతూల్యం దెబ్బతింటుందని కోర్టుల్లో కేసులు వేసిన ఇలాంటి వారికి రాజకీయ సమాధి కట్టాలి. ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారని హేళనగా మాట్లాడిన నేతలకు చరమగీతం పాడండి. బీసీల తోకలు కత్తరిస్తామన్న చంద్రబాబు తోకలు కత్తరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి.
నాన్నగారు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లతో మైనారిటీల మనోభావాలతో గత 30 ఏళ్లుగా చలగాటమాడుతున్న చంద్రబాబుకు ఈసారి ఎన్నికల్లో 30 చెరువుల నీళ్లు తాగించమని కోరుతున్నాను.
నిజమైన సామాజిక న్యాయానికి జై కొట్టండి. రాబోయే రోజుల్లో పేదలకు, పెత్తందార్లకు జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధంలో జరుగబోయేది ప్రజలకు మంచి చేసిన ఫ్యాన్ మీ ఇంట్లోనే ఉంటుంది. అధికారంలోనే ఉంటుంది. ప్రజలను పదే పదే మోసం చేసిన సైకిల్ ఇంటి బయటే ఉంటుంది. బాబు ప్యాకేజీని గటగటా తాగేసిన గ్లాస్ సింక్‌లోనే ఉంటుంది. ఇదీ ప్రజల మాట.
ఆ పొత్తులు, ఆ ఎత్తుల జిత్తుల ముఠా ఎన్ని చేసినా, ఏమీ చెప్పినా, ఎంత ప్రయత్నించా…మనం వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు..మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్‌ను, మన తలరాతలను మార్చేది. మళ్లీ అన్నను తెచ్చుకుందాం. అన్నే రావాలి. పేదవాడి భవిష్యత్ బాగుపడటానికి మళ్లీ అన్నే రావాలని ప్రతి గడపకు వెళ్లి చెప్పండి.
మూడు రోజుల క్రితం ఏం జరిగిందో మీరందరూ చూశారు కదా? లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు, దివ్యాంగులకు పెన్షన్ అందితే తప్ప జీవితం గడవని వారికి నెల నెల 1వ తారీఖున ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చే వాలంటీర్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పింఛన్ ఇవ్వడానికి వీల్లేదంటూ ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు తన మనుషుల చేత ఫిర్యాదు చేయించి ఆపేశారు.
పేదల పట్ల చంద్రబాబు మనోభావాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత తానే ఫిర్యాదు చేయించాడు. జగన్ మీద కాదు ఆయన చేయించిన ఫిర్యాదు. 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తూ ఇంకితజ్ఞానం లేకుండా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించిన వ్యక్తి చంద్రబాబు. ఇలాంటి మనిషిని ఏమనాలో ఆలోచన చేయండి.
ఇలాగే గతంలో పేదలు వెళ్లే ఇంగ్లీష్ మీడియంను చంద్రబాబు వ్యతిరేకించారు. పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఇదే మాదిరిగాకేసులు వేయించి వ్యతిరేకించారు. చివరికి ఇంటి వద్ద పింఛన్ అందకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నాడు. ఇలాంటి పెత్తందార్లను, పేదల వ్యతిరేకులకు ఏ ఒక్కరైనా ఓటు వేస్తే..దాని అర్థం ఏంటో తెలుసా? ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చే స్కీమ్‌లను సైతం, వలంటీర్లను సైతం రద్దు చేసేందుకు మనమే చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అవుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి.
పేదలకు అందాల్సిన ప్రతి రూపాయి బాబు ఆపినా, ఏదీ ఆగకూడదు. నేరుగా మీ ఇంటికే రావాలంటే, బాబు లాంటి సైంధవులు ఎప్పుడు కూడా అడ్డుపడే అవకాశం ఇవ్వకూడదు. పేదవాడు రెండు బటన్లు నొక్కాలి. మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కాడు. మీరు రెండే బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. అప్పుడే ఈ వదల బొమ్మాలి ముందుకు రాదు. మనం వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు. ఈ ఓటు వల్ల మీ భవిష్యత్, మీ పిల్లల భవిష్యత్, మీ ఆడబిడ్డల భవిష్యత్, మీ అవ్వాతాతల భవిష్యత్‌పై ఆధారపడి ఉంటుంది.
జగనన్నను మళ్లీ తెచ్చుకుందాం. అన్నా మళ్లీ భారీ మెజారిటీతో వస్తే జరుగుతున్న ఈ మంచి అంతా కూడా ఇలాగే కొనసాగుతుంది. వలంటీర్లు మీ ఇంటికే వచ్చి సంక్షేమాన్ని అందిస్తారని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి.
ఎన్నికల సంగ్రామంలో అబద్ధాలను మట్టి కరిపించడానికి, మోసాన్ని మట్టి కరిపించేందుకు నేను సిద్ధం..మీరంతా కూడా సిద్ధమేనా? జరుగబోయే ఎన్నికల సంగ్రామంలో అబద్ధాలకు, మోసాలకు వారు ప్రతినిధులు అయితే, విలువలు, విశ్వసనీయతకు మనం ప్రతినిధులం. విలువలను కాపాడుతూ, విశ్వసనీయతకు తోడుగా ఉండేందుకు మీరంతా సిద్ధమైతే జేబులో నుంచి అందరూ సెల్‌ఫోన్లు బయటకు తీసి టార్చ్‌లైట్ బటన్ ఆన్ చేసి పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మేమంతా సిద్ధం అని చెప్పండి.
మంచి జరిగిస్తున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు, ప్రజలందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడు ఉండాలని, మరో రెండు నెలల్లోనే మీ బిడ్డ మళ్లీ వచ్చి మళ్లీ మీకు మంచి చేసే పరిస్థితులు ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటూ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లకాలం నాపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ..
ఈ రోజు మీ జిల్లా నుంచి మన పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులపై మీ అందరి చల్లని దీవెనలు ఉంచాలని కోరుతున్నా..రాజంపేట ఎంపీ అభ్యర్థిగా మిథున్‌రెడ్డి, రైల్వే కోడురు నుంచి శ్రీనివాసులు, రాయచోటి నుంచి శ్రీకాంత్‌రెడ్డి, రాజంపేట నుంచి అమర్నాథ్‌రెడ్డి, తంబాలపల్లె నుంచి ద్వారకనాథ్‌రెడ్డి, మదనపల్లె నుంచి నిస్సార్‌అహ్మద్, పీలేరు నుంచి రామచంద్రారెడ్డి, పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మన పార్టీ నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచాలని సీఎం వైయస్ జగన్ విజ్ఞప్తి చేశారు. మన గుర్తు ఫ్యాన్..చాలా కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. వీటన్నింటిని అధిగమించి ఫ్యాన్ గుర్తుపై కచ్చితంగా రెండు బటన్లు నొక్కితేనే మన భవిష్యత్ బాగుంటుందని గుర్తు పెట్టుకోవాలని కోరుతూ సీఎం వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.