YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.05-01-2023(గురువారం) ..
ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వైసీపీ ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం నూతన అధ్యక్షులు కొరివి చైతన్య ..
రాజకీయాల్లో యువతదే కీలక పాత్ర : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
నందిగామ పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగ అధ్యక్షులుగా నూతనంగా నియమింపబడిన కొరివి చైతన్య శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు .. అనంతరం కొరివి చైతన్యను ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని నియోజకవర్గాల్లో యువజన విభాగాన్ని బలోపేతం చేయాలని, యువకులు పార్టీకి ఆకర్షితులయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు, నేటి రాజకీయాల్లో యువతదే కీలక పాత్రని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ నామినేటెడ్ పదవుల్లోనూ – పార్టీ పదవుల్లోనూ – ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీకి కూడా అభ్యర్థులుగా యువతనే ఎంపిక చేసి అవకాశాలు ఇస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా యువత అంతా వైఎస్ జగన్ వెంటే నడుస్తున్నారని తెలిపారు, వైయస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని -అభివృద్ధిని మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా పనిచేయాలని సూచించారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు ..