
Best Web Hosting Provider In India 2024

AP Schools Water Bell : ఏపీలో ఎండల తీవ్రత(AP Heat Wave) పెరుగుతోంది. పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో బడి పిల్లల ఆరోగ్యంపై ఏపీ సర్కార్ శ్రద్ధ పెట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఒంటి పూట తరగతులు(Half Day Schools) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎండల తీవ్రత కారణంగా పాఠశాల విద్యాశాఖ కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో క్రమం తప్పకుండా “వాటర్ బెల్” (AP Schools Water Bell)మోగించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఎండ వేడిమికి విద్యార్థుల్లో డీహైడ్రేషన్(Dehydration) ముప్పును నివారించేందుకు రోజులో మూడు సార్లు వాటర్ బెల్ మోగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం గం8.45 లకు, గం.10.50 లకు, గం.11.50 లకు వాటర్ బెల్ కొట్టాలని పాఠశాలకు(Schools) ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు 5 నిమిషాల పాటు వాటర్ బ్రేక్ ఇస్తారు. ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో విద్యార్థులు డీహైడ్రేషన్ సమస్యలతో బాధపడుకుండా వాటర్ బెల్ మోగించి ఉపాధ్యాయులు వారితో మంచినీళ్లు తాగించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో మంచినీళ్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.
ట్రెండింగ్ వార్తలు
ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ హాలీడేస్
ఏపీ పాఠశాలలకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు(Summer Holidays) మొదలు కానున్నాయి. ఏప్రిల్ 23వ తేదీతో(last working day) విద్యా సంవత్సరం ముగుస్తుందని విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు సమ్మర్ హాలీడేస్ ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి జూన్ 12న స్కూళ్ల పున:ప్రారంభం అవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీలో మార్చి 18 నుంచి ఒంటి పూట బడులు(half day schools) ప్రారంభం అయ్యాయి. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటి పూట తరగతులు నిర్వహిస్తున్నారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో పాఠశాల విద్యాశాఖ ముందుగానే ఒంటిపూట బడులు ప్రారంభించింది.
50 రోజులు సెలవులు
వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు స్కూళ్లకు ముందుగానే సెలవులు ఇస్తారని ప్రచారం జరిగినా షెడ్యూల్ ప్రకారమే సెలవులు ప్రకటించారు. ఏటా విద్యా సంవత్సరం క్యాలెండర్ ఏప్రిల్ 23వ తేదీతో ముగుస్తుంది. ఏప్రిల్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ స్కూళ్లకు వేసవి సెలవులు(AP Summer Holidays) ఇస్తారు. జూన్ 13వ తేదీ వరకు 50 రోజులు పాటు స్కూళ్లకు వేసవి సెలవులుగా ప్రకటించారు. మార్చి 18 నుంచి మార్చి 30వ తేదీ వరకు ఏపీలో పదో తరగతి పరీక్షలు జరిగగా… ప్రస్తుతం స్పాట్ వాల్యూయేషన్ జరుగుతోంది.
టాపిక్