Best Web Hosting Provider In India 2024
Brahmamudi April 3rd Episode: రాజ్ ఎండీ పదవికి రాజీనామా చేయడంతో ఆ సీట్‌లో ఎవరు కూర్చోవాలనే విషయంలో దుగ్గిరాల ఫ్యామిలీలో రచ్చ మొదలవుతుంది. తన భర్త కళ్యాణ్ ఎండీ కావాలని అనామిక పట్టుపడుతుంది. ధాన్యలక్ష్మి కూడా తన కొడుకునే సపోర్ట్ చేస్తుంది. కళ్యాణ్‌కు సపోర్ట్ చేస్తున్నట్లుగా నాటకం ఆడిన రుద్రాణి…చివరి నిమిషంలో ప్లేట్ ఫిరాయిస్తుంది.
ధాన్యలక్ష్మితో రుద్రాణి గొడవ…
స్వప్నను రెచ్చగొట్టిన రుద్రాణి ఎండీ సీట్ రాహుల్‌కు ఇవ్వాలని గొడవకు దిగుతుంది. నీకొడుకుకు అమ్మాయిలతో తిరగడం తప్ప బిజినెస్ చూసుకోవడంపై ఇంట్రెస్ట్ ఉందా అని రుద్రాణికిపై ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. ఇంట్లో ఎవరూ సక్రమంగా లేరని రుద్రాణి బదులిస్తుంది.
అనామికతో పెళ్లైనా కళ్యాణ్ అప్పుతో తిరగడం లేదా…కావ్య ఉండగానే రాజ్ మరో అమ్మాయితో సంబంధం పెట్టుకొని బిడ్డను కనలేదా అంటూ ధాన్యలక్ష్మికి ధీటుగా బదులిస్తుంది రుద్రాణి. తన కొడుకును మాత్రమే చెడ్డవాడిగా చిత్రీకరించడం కరెక్ట్ కాదని అంటుంది.
రాహుల్ వారసుడే కాదు…
అసలు రాహుల్ దుగ్గిరాల వారసుడే కాదని అనామిక బాంబు పేల్చుతుంది. రాజ్ స్థానంలో ఎండీ కావాలంటే వారసత్వం ఉండాలి. కళ్యాణ్ మాత్రమే ఆ స్థానానికి అర్హుడని అనామిక అంటుంది. స్వప్న అందుకు ఒప్పుకోదు. మా అత్తయ్య పెంపకంలో రాహుల్ జులాయిగా తిరిగినా ఇప్పుడు మారిపోయాడని అంటుంది. ఎక్స్‌పీరియన్స్ ఉన్నా రాహుల్‌ను కాదని కళ్యాణ్‌ను కంపెనీకి ఎండీని ఎలా చేస్తారని అనామికకు మాటకు మాట సమాధానమిస్తుంది.
లీగల్‌గా కళ్యాణ్ వారసుడు…
లీగల్‌గా కళ్యాణ్ మాత్రమే వారసుడు, ఎవరూ పోటీకి వచ్చిన ఊరుకునేది లేదని అనామిక అంటుంది. ఎండీ పదవి చేపట్టడం తనకు ఇష్టం లేదని కళ్యాణ్ తేల్చిచెబుతాడు. అన్నయ్య స్థానంలో తాను కూర్చోనని అంటాడు. ఓ సమస్య వచ్చిందని అన్నయ్యను ఆ పదవి నుంచి దించడమే బాగాలేదని అందరికి కళ్యాణ్ క్లాస్ ఇస్తాడు.
అన్నయ్య ఎండీ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి ఇంటికి పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చాడని చెబుతాడు. కళ్యాణ్ కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి అనామిక ఒప్పుకోదు. కళ్యాణ్‌కు ఇష్టం లేని బాధ్యతల్ని అతడికి ఎలా అప్పగిస్తారని స్వప్న గొడవకు దిగుతుంది. రాహుల్‌కే ఎండీ సీట్ అప్పగించాలని పట్టుపడుతుంది.
కావ్య మాత్రమే అర్హురాలు…
అప్పుడే అక్కడికి సుభాష్ వస్తాడు. మీ గొడవ ఆపితే తాను మాట్లాడుతానని అంటాడు. రాజ్ ఇంకా ఎండీ పదవి నుంచి పూర్తిగా దిగిపోలేదని అంటాడు. ఆ పదవిలో కూర్చోవడానికి హక్కుతో పాటు అర్హత ఉండాలని అంటాడు. ఈ ఇంట్లో ఆ అర్హత ఒక్కరికే ఉందని, ఆ ఒక్కరు మరెవరో కాదు కావ్య అని అంటాడు సుభాష్. తన పేరును సభాష్ ప్రకటించడంతో కావ్య షాకవుతుంది. కావ్య పేరు విని రుద్రాణి, ధాన్యలక్ష్మితో పాటు మిగిలిన వారు ఒక్కసారిగా సైలెంట్ అవుతారు.
రాజ్ భార్యగా కాకుండా…
రాజ్ భార్యవి అని కాకుండా నీలోని సమయస్ఫూర్తి, నైపుణ్యం చూసే ఎండీ సీట్‌ను నీకు అప్పగించాలని ఫిక్సైనట్లు సుభాష్ చెబుతాడు. రాజ్ లేని సమయంలో నువ్వు క్లయింట్స్‌తో చేసిన డీల్స్, కాంట్రాక్ట్ మనకు దక్కేలా చేసిన సమర్థత నాకు నచ్చాయి. రాజ్ నిర్ణయం తీసుకునే వరకు ఎండీ బాధ్యతలను నీకే అప్పగించాలని అనుకున్నట్లు కావ్యతో చెబుతాడు సుభాష్.
సుభాష్ నిర్ణయాన్ని కళ్యాణ్ అంగీకరిస్తాడు. గొప్ప నిర్ణయం తీసుకున్నారని పెదనాన్నతో చెబుతాడు. తన భర్తకు ఎండీ సీట్ ఇవ్వాలని అప్పటివరకు గొడవ పడిన స్వప్న…కావ్య పేరు చెప్పగానే సంబరపడుతుంది. రాహుల్ కంటే కావ్యకే ఎండీ సీట్‌లో కూర్చొనే అర్హత ఉందని మాట మార్చేస్తుంది.
నో చెప్పిన కావ్య…
అందరూ అంగీకరించిన తాను మాత్రం ఎండీ సీట్‌లో కూర్చొనని చెప్పి అందరికి షాకిస్తుంది కావ్య. నా భర్త నిజంగా తప్పు చేశాడని రుజువు కాలేదని, అలాంటప్పుడు ఆయన్ని ఎండీ పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో నేను కూర్చుంటే మీతో పాటు రాజ్‌ను నేను కించపరిచినట్లే అవుతుందని కావ్య అంటుంది.
ఇంట్లో కోడలిగా నా స్థానం ఉంటుందో, లేదో అన్నదే తెలియడం లేదని, ఇంట్లో నా స్థానం ఏమిటో తెలిసిన తర్వాతే బయట నేనంటే ఏమిటో నిరూపించుకుంటానని అంటుంది. కళ్యాణ్‌ను ఎండీని చేయాలని తన నిర్ణయాన్ని వెల్లడిస్తుంది కావ్య.
కావ్యదారిలోనే కళ్యాణ్…
కానీ కళ్యాణ్ కూడా ఎండీ సీట్‌లో కూర్చోవడానికి అంగీకరించడు. అన్నయ్య తప్పు చేశాడని తేలే వరకు తాను ఆ సీట్‌లో కూర్చునేది లేదని చెబుతుంది. అప్పటివరకు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా మాత్రమే కొనసాగుతానని తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడు. కొడుకును ఎండీ సీట్‌లో కూర్చోబెట్టాలని తన ప్లాన్ రివర్స్ కావడంతో రుద్రాణి డిసపాయింట్ అవుతుంది.
రాజ్‌కు కావ్య క్లాస్…
గొడవ ముగియగానే రూమ్‌లోకి వచ్చిన రాజ్‌కు క్లాస్ పీకుతుంది కావ్య. మీరు ఏమైపోతే నాకేంటి అనుకోవాలి. మీ కన్నబిడ్డకు ఆకలేస్తే నాకేంటి, ఏడిస్తే నాకేంటి అనుకోవాలి. కానీ మంచి చెడు తెలిసినదానిని కాబట్టి అవన్నీ చేయలేకపోతున్నానని చెబుతుంది.
మీరు దేనికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటే నేను ఇవన్నీ ఎందుకు పట్టించుకోవాలని రాజ్‌కు క్లాస్ పీకుతుంది కావ్య. బిడ్డ ఆకలి అర్థం చేసుకున్నావు. నీ భర్తకు అవమానం జరిగినా తట్టుకోలేకపోయాయి. నా స్థానాన్ని తీసుకోమంటే తీసుకోనని అన్నావు. అలాంటి నీవు ఇప్పుడు నాకేంటి అని అంటున్నావు..అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలని కావ్యతో అంటాడు రాజ్.
వెన్నెల…
బిడ్డ విషయంలో మీరు దాస్తోన్న చిదంబరం రహస్యం ఏమిటో ఇప్పుడే బయటపెట్టాలని రాజ్‌తో అంటుంది కావ్య. అందరి నమ్మకాన్ని వమ్ము చేసి నాకు నేనే మీకు మీరే అంటూ ఒప్పుకోనని పట్టుపడుతుంది.. నాకు జవాబు కావాలని చెబుతుంది. ఎంత పట్టుపట్టిన తాను సమాధానం మాత్రం ఇవ్వనని అంటాడు రాజ్. ఈ బిడ్డకు తల్లి ఎవరన్నది మాత్రం బయటపెట్టనని అంటాడు. ఇప్పుడు నాలుగు గోడల మధ్య అడుగుతున్నాను.
మీరు సమాధానం చెప్పకపోతే ఇంట్లో అందరి ముందు మీ తప్పును నిలదీస్తానని రాజ్‌తో అంటుంది కావ్య. ఎంత చెప్పిన కావ్య తన పట్టువీడకపోవడంతో తన బిడ్డ కన్నతల్లి పేరు వెన్నెల అని చెబుతాడు రాజ్. ఆమె ఎక్కడుంటుంది ఏం చేస్తుందని రాజ్‌ను అడుగుతుంది కావ్య. పేరు మాత్రమే కావాలని అన్నావు. అందుకే అదొక్కటే మాత్రమే నీకు చెప్పానని అంటూ రాజ్ టాపిక్ డైవర్ట్ చేస్తాడు.
కళ్యాణ్‌కు కంగ్రాట్స్….
అప్పుకు ఫోన్ చేస్తాడు కళ్యాణ్. కానీ ఆమె ఫోన్ కట్ చేస్తుంది. అప్పు గురించిన ఆలోచనల్లో కళ్యాణ్ ఉండగా అక్కడికి కావ్య వస్తుంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎంపికైన కళ్యాణ్‌కు కంగ్రాట్స్ చెబుతుంది. తనకు ఇష్టంలేని పనిని అంటగట్టి ఇరికించేశారని కావ్యపై చిర్రుబుర్రులాడుతాడు కళ్యాణ్. కవిగారు అని నన్ను పిలవొద్దని చెబుతాడు. నాకు ఇష్టమైన కవిత్వానికి అందరూ కలిసి నన్ను దూరం చేశారని బాధపడతాడు.
చేతకానివాడిలా ఉండొద్దు…
మిమ్మల్ని డబ్బు సంపాదించడం రాని చేతకానివాడిగా అందరూ జమకడుతున్నారని, వారికి మీరంటే ఏమిటో ప్రూవ్ చేసుకోవాలని కళ్యాణ్‌కు చెబుతుంది కావ్య. మీ బిజినెస్ టాలెంట్‌ను నిరూపించుకున్న తర్వాతే మీ ఇష్టాలను అందరూ గౌరవిస్తారని కళ్యాణ్‌తో అంటుంది కావ్య. కొన్ని బంధాల కోసం కష్టపడక తప్పుదు. కుటుంబసభ్యులు మీపై పెట్టుకున్న నమ్మకానికి, ప్రేమకు సమాధానం చెప్పి తీరాలని అంటుంది.
కావ్య మాటలకు కళ్యాణ్ తన ఆలోచనను మార్చుకుంటాడు. బిజినెస్‌పై ఫోకస్ పెట్టాలంటే కావ్య సహయం కావాలని కోరుతాడు రాజ్. వదినలా కాదు అమ్మలా మీకు సపోర్ట్‌గా ఉంటానని కళ్యాణ్‌కు మాటిస్తుంది కావ్య. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.