Waterbell in School: ఆంధ్రా స్కూళ్లలో వాటర్‌ బెల్.. వేసవిలో రోజుకు మూడుసార్లు నీళ్లు తాగాల్సిందే, విద్యాశాఖ ఆదేశాలు

Best Web Hosting Provider In India 2024

Waterbell in School: ఆంధ్రప్రదేశ్‌లో Andhra pradesh వేసవి ఉష్ణోగ్రతలు Temperature పెరుగుతున్నాయి. సగటు ఉష్ణోగ్రత రాష్ట్ర వ్యాప్తంగా 40డిగ్రీలు దాటేస్తోంది. స్కూళ్లకు ఒంటిపూట బడులు Half Day Schools నిర్వహిస్తున్నా విద్యార్ధులకు డీ హైడ్రేషన్ Dehydration ముప్పు వెంటాడుతోంది. ఉదయం ఏడున్నరకే బడులు ప్రారంభం అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

వేసవి Summer ఉష్ణోగ్రతలతో బడి పిల్లలకు ముప్పు తలెత్తకుండా పాఠశాలల్లో Schools తప్పకుండా ‘వాటర్ బెల్’ కార్యక్రమం అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు (డీఈవో DEO)లకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేశాకె,

విద్యార్థులు, ఉపాధ్యాయులు వేసవి తాపం నుండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ మోగాల్సిందేనని అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ అయ్యాయి.

రాష్ట్రంలోని పలు చోట్ల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విద్యార్థులు డీహైడ్రేషన్ కు గురికాకుండా పాఠశాలల్లో ‘వాటర్ బెల్’ Water bell కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ జిల్లా విద్యాశాఖాధికారులకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

ఏపీలో రానున్న రెండు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ (APSDMA) అందించిన సమాచారంతో పాఠశాలలకు అలర్ట్‌ పంపారు. తరగతి గదుల్లో విద్యార్ధులు ఉక్కపోతకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సూర్యతాపం నుంచి అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు.

పాఠశాలలంలో తరగతులు జరిగే సమయంలో విద్యార్థుల్లో మానసిక, శారీరక ఆరోగ్యం కాపాడటంతో పాటు వారిలో హైడ్రేషన్‌ను ప్రోత్సహించడమే ‘వాటర్ బెల్’ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో రోజుకు మూడు సార్లు వాటర్‌ బెల్ మోగనుంది. బుధవారం నుంచి ఉదయం 8:45, 10:05, 11:50 గంటలకు వాటర్ బెల్ కచ్చితంగా మోగించాలని ఆదేశించారు.

తరగతుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పకుండా నీరు తాగేలా చూడాల్సిందిగా ప్రధానోపాధ్యాయులకు సూచించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశించారు.

ఏప్రిల్ 24 నుంచి సెలవులు..

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు Summer Holidays మొదలు కానున్నాయి. ఏప్రిల్ 23వ తేదీతో last working day విద్యా సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

2024 జూన్ 12న June 12 స్కూళ్లు పున:ప్రారంభం అవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 18 నుంచి ఒంటి బడులు half day schools ప్రారంభం అయ్యాయి. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది తరహాలోనే ఈసారి వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయనే హెచ్చరికల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ముందే ఒంటిపూట బడులు ప్రారంభించారు.

వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యాశాఖ school Education అధికారులు పాఠశాలల్ని ముందుగానే సెల‌వులు ఇస్తారని ప్రచారం జరిగినా షెడ్యూల్ ప్రకారమే సెలవుల్ని ప్రకటించారు. ఏటా విద్యా సంవత్సరం క్యాలెండర్ ఏప్రిల్ 23వ తేదీతో ముగుస్తుంది.

ఏప్రిల్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్‌ పాఠశాలలకు వేస‌వి సెల‌వులు(AP Summer Holidays) వర్తించనున్నాయి. జూన్ 13వ తేదీ వ‌రకు 50 రోజులు పాటు స్కూళ్లకు వేస‌వి సెల‌వులుగా ప్రకటించారు. మార్చి 18 నుంచి మార్చి 30వ తేదీ వరకు ఏపీలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. ప్రస్తుతం స్పాట్ వాల్యూయేషన్ జరుగుతోంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

SchoolsSummerAndhra Pradesh Assembly Elections 2024Government Of Andhra PradeshEducation
Source / Credits

Best Web Hosting Provider In India 2024