YSRCP Nandigama : కంచికచర్ల పట్టణంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో నిర్వహించిన ఎమ్మెల్యే గారు ..

 

YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల టౌన్ :
ది.06-01-2023(శుక్రవారం) ..

అన్ని వర్గాల సంతోషం – సంక్షేమమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం ..

కంచికచర్ల పట్టణంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

కంచికచర్ల పట్టణంలోని 2 వ సిగ్మెంట్ పరిధిలో శుక్రవారం ఉదయం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు -లబ్ధిదారులకు అందుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని, అధికారంలోకి వచ్చిన వెంటనే పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ దేశ చరిత్రలోనే ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చిన ఏకైక సీఎంగా జగన్ నిలిచారని చెప్పారు, సంక్షేమ పథకాలను రాజకీయాలకి అతీతంగా అమలు చేస్తూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి లబ్ధించే కోరుచున్న ఘనత మన ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు, అన్ని వర్గాల సంతోషం సంక్షేమమే వైయస్ జగన్ మోహన్ రెడ్డి థ్యేయమన్నారు, గ్రామ సచివాలయాలు- వాలంటీర్ వ్యవస్థ, ఆర్బికేలు, మనబడి నాడు నేడు, లక్షల సంఖ్యలో ఇళ్లపట్టాల పంపిణీ, వైయస్సార్ సున్న వడ్డీ పథకం, జగనన్న మోడల్ కాలనీలు, అమ్మఒడి, విద్యాదీవెన, ఉన్నత కులాల్లోని నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించటం, ఒకటో తేదీ నే పింఛన్ల పంపిణీ .. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అన్నారు ..

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేల్పుల సునీత శ్రీనివాసరావు, ఉపసర్పంచ్ వేమ సురేష్ బాబు, ఎంపీపీ మలక్ బషీర్, జడ్పిటిసి వేల్పుల ప్రశాంతి, నాయకులు కాలవ వాసుదేవరావు, ఈవో రవికుమార్, నంబూరు పెదబాబు, మాడుగుల శంకర్, నారిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *