Best Web Hosting Provider In India 2024
Aparna Das: దళపతి విజయ్ బీస్ట్ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అపర్ణదాస్. ఇందులో మినిస్టర్ కూతురి పాత్రలో కనిపించి మెప్పించింది. గత ఏడాది తమిళంలో రిలీజైన దాదాతో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్టును అందుకున్న అపర్ణదాస్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నది. మంజుమ్మెల్ బాయ్స్ హీరోతో ఏడడుగులు వేయబోతున్నది.
ఏప్రిల్ 24న పెళ్లి…
మంజుమ్మెల్ బాయ్స్ హీరోల్లో ఒకరిగా కనిపించిన దీపక్ పరంబోల్‌ను అపర్ణదాస్ పెళ్లాడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంజుమ్మెల్ బాయ్స్‌లో సుధి పాత్రలో దీపక్ నటించాడు. దీపక్, అపర్ణదాస్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. పెద్దల అంగీకారంతో ఏడడుగులు వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 24న కేరళలోని వడక్కచేరిలో అపర్ణదాస్, దీపక్ పెళ్లి జరుగనున్నట్లు సమాచారం.
తెలుగులో ఆదికేశవ…
అపర్ణదాస్ తెలుగులోనూ ఓ సినిమా చేసింది. మెగా హీరో వైష్ణవ్‌తేజ్ ఆదికేశవలో ఇంపార్టెంట్ రోల్ చేసింది. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఆపర్ణదాస్‌కు నిరాశను మిగిల్చింది. మలయాళంలో మనోహరంతో హీరోయిన్‌గా అసమాన నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నది అపర్ణదాస్. ప్రియన్ ఒట్టత్తిల్లాను, సీక్రెట్ హోమ్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేసింది.
బిడ్డకు తల్లిగా…
తమిళ మూవీ దాదా లో చదువుకునే వయసులోనే ఓ బిడ్డకు తల్లిగా మారిన యువతి పాత్రలో అపర్ణదాస్ సహజ నటనతో ఆకట్టుకున్నది. కేవలం నాలుగు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన దాదాపు మూవీ తమిళంలో ఇరవై ఐదు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు మూవీ తెలుగులో పా..పా పేరుతో డబ్ అవుతోంది. రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతోన్నారు. ప్రస్తుతం మలయాళంలో ఆనంద్ సెరెబెలా అనే సినిమా చేస్తోంది అపర్ణదాస్. దుబాయ్‌లో ఎంబీఏ పూర్తిచేసిన అపర్ణదాస్ టిక్‌టాక్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యింది. వాటి ద్వారానే తమిళం, మలయాళ సినిమాల్లో అవకశాల్ని దక్కించుకున్నది.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ…
దీపక్ పరంబోల్ మలయాళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు. 2010లో రిలీజైన మార్వాడీ ఆర్ట్స్ క్లబ్‌తో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన దీపక్ ఇప్పటివరకు వందకుపైగా సినిమాలు చేశాడు. గత ఏడాది మమ్ముట్టి హీరోగా నటించిన క్రిస్టోఫర్, కన్నూర్ స్వ్యాడ్‌లో దీపక్ సరోజ్ ఇంపార్టెంట్ రోల్స్ చేశాడు.
సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందిన మంజుమ్మెల్ బాయ్స్ మలయాళంలో రెండు వందల కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. కొచ్చికి చెందిన కొందరు స్నేహితులు కొడైకెనాల్ ట్రిప్ వెళ్తారు. ఆ ట్రిప్‌లో సుభాష్ అనే యువకుడు ఇరుకైన లోయలోకి జారిపడతాడు. సుభాష్‌ను తమ స్నేహితులు ఎలా కాపాడుకున్నారన్నదే మంజుమ్మెల్ బాయ్స్ మూవీ కథ. తెలుగులోనే డబ్ అవుతోన్న ఈ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది.