Best Web Hosting Provider In India 2024
The Wages of Fear Review: ది వేజెస్ ఆఫ్ ఫియర్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ఫ్రాంక్ గాస్టాంబైడ్, అల్బన్ లెనోయిర్ హీరోలుగా నటించారు. ఫ్రెంచ్‌లో కల్ల్ క్లాసిక్‌గా నిలిచిన ది వేజెస్ ఆఫ్ ఫియర్ ఆధారంగా అదే పేరుతో రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే?
అన్నదమ్ముల కథ…
ఫ్రెడ్, అలెక్స్ ఇద్దరు అన్నదమ్ములు. జీవనోపాధి కోసం అరబ్ కంట్రీస్‌కు వలస వచ్చిన ఫ్రెడ్, అలెక్స్ ధనవంతులకు ప్రైవేట్ బాడీగార్డ్స్‌గా పనిచేస్తుంటారు.ఓ బిజినెస్‌మెన్ ఇంట్లో డబ్బు కొట్టేసి తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఫ్రెడ్ ప్లాన్ చేస్తాడు. మోసం చేసి డబ్బు సంపాదించడం ఇష్టం లేకపోయినా ఫ్రెడ్ బలవంతంతో ఆ ప్లాన్ అమలు చేయడానికి అలెక్స్ ఒప్పుకుంటాడు. అనుకోకుండా అలెక్స్ పోలీసులకు పట్టుపడి జైలుకు వెళతాడు.
అలెక్స్ జైలు నుంచి విడుదలయ్యేవరకు అరబ్ కంట్రీలోనే ఉండిపోవాలని అతడి భార్యాపిల్లలు ఫిక్సవుతారు. ఎడారిలోని ఓ అయిల్ ఢ్రిల్లింగ్ కంపెనీలో అగ్నిప్రమాదం జరుగుతుంది. ఆ మంటలను ఆర్పకపోతే పెద్ద ప్రమాదం జరిగి చుట్టూ పక్కల ఉన్న ఊళ్లు మాత్రం నాశనమయ్యే పరిస్థితి తలెత్తుతుంది. మంటలను ఆర్పేందుకు పెద్దమొత్తంలో నైట్రో గ్లిజరిన్ కావాల్సివస్తుంది. ఆ నైట్రో గ్లిజరిన్‌ను రెండు ట్రక్కులలో అయిల్ కంపెనీ వద్దకు చేర్చే డీల్‌ను ఫ్రెడ్‌తో కుదుర్చుకుంటుంది కంపెనీ హెడ్. అలెక్స్‌ను ఈ మిషన్‌లో భాగం చేసేందుకు అతడిని జైలు నుంచి విడిపిస్తారు.
ఇరవై గంటల్లో ప్రమాదకరమైన ఏడారుల గుండా 800 కిలోమీటర్లు ప్రయాణిస్తూ నైట్రో గ్లిజర్‌ను అయిల్ కంపెనీ వద్దకు చేర్చడం వారి డీల్. ఈ డీల్‌లో ఫ్రెడ్‌కు సహాయంగా క్లారా, సోషియన్‌తో పాటు మరో ఇద్దరు వస్తారు? ఈ ప్రయాణంలో ఫ్రెడ్, అలెక్స్‌లకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ప్రాణాలకు తెగించి ప్రమాదకరమైన నైట్రో గ్లిజరిన్‌ను వారు అయిల్ కంపెనీ వద్దకు చేర్చారా? అలెక్స్‌ను జైలుకు పంపించి తాను చేసిన తప్పును ఫ్రెడ్ ఎలా సరిదిద్దుకున్నాడన్నదే ఈ మూవీ(The Wages of Fear Review) కథ.
ఫ్రెంచ్ కల్ట్ క్లాసిక్ మూవీ…
ది వేజెస్ ఆఫ్ ఫియర్ 1953లో ఫ్రెంచ్ భాషలో రిలీజై కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమాను అదే పేరుతో డైరెక్టర్ లెక్‌లార్క్ రీమేక్ చేశాడు. యాక్షన్ అంశాలతో పాటు ఈ క థలో ఫ్యామిలీ సెంటిమెంట్, నమ్మకద్రోహం, అత్యాశ లాంటి అంశాలను టచ్ చేశారు డైరెక్టర్. ఇద్దరు హీరోల ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌తో ది వేజెస్ ఆఫ్ ఫియర్(The Wages of Fear Review మూవీ మొదలవుతుంది.
ఫ్రెడ్ చేసిన ప్లాన్ ఫెయిలయ్యి అలెక్స్ ఎలా జైలుకు వెళ్లాడు? జైలులో అతడు ఎదుర్కొన్న సంఘర్షణ చుట్టూ ఆరంభ సన్నివేశాలు నడుస్తాయి. ఓ వైపు ఫ్లాష్‌బ్యాక్ చూపిస్తూనే మరోవైపు ఆయిల్ కంపెనీలో సెక్యూరిటీగా ఫ్రెడ్ పనిచేస్తున్నట్లుగా ప్రజెంట్‌ను చూపించారు డైరెక్టర్…
ఎడారుల గుండా…
నైట్రో గ్లిజరన్‌ను ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి అయిల్ కంపెనీ హెడ్‌తో ఫ్రెడ్, అలెక్స్ డీల్ కుదర్చుకునే సీన్ నుంచి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్న ఏడారిలో అన్నదమ్ములు కలిసి చేసిన జర్నీ ఉత్కంఠను పంచుతుంది.
అరబ్ సైన్యం దాడిని హీరోస్ గ్యాంగ్ తిప్పికొట్టే సీన్, శత్రువులు అమర్చిన ల్యాండ్‌మైన్స్‌ను హీరోలిద్దరు కలిసి డిస్పోజల్ చేసే ఎపిసోడ్ ఆకట్టుకుంటాయి. అలెక్స్ ఫ్యామిలీని కలపడంతో ఊరి ప్రజలను మంటల బారి నుంచి కాపాడటం కోసం ఫ్రెడ్ చేసే త్యాగంతో సినిమా ఎండ్ అవుతుంది. అత్యాశతో ఫ్రెడ్‌ను మోసం చేసిన సోషియాన్ జీవితం చివరకు ఏమైందన్నది చిన్న మెసేజ్‌తో చూపించినట్లుగా అనిపిస్తుంది.
యాక్షన్ తక్కువ…థ్రిల్లు ఎక్కువ…
ఎడారుల బ్యాక్‌డ్రాప్‌లోనే సినిమా మొత్తం సాగుతుంది. ఆ సీన్స్ కొత్తగా అనిపిస్తాయి. యాక్షన్ కంటే సస్పెన్స్, థ్రిల్‌తోనే దర్శకుడు ఆడియెన్స్‌ను ఎక్కువగా ఎంగేజ్ చేశాడు.
పోటాపోటీగా…
యాక్టింగ్ పరంగా ఈ సినిమాలో ఫ్రెడ్ పాత్రలో నటించిన ఫ్రాంక్ గాస్టాంబైడ్ ఎక్కువ మార్కులు పడతాయి. సీరియస్ లుక్, మేనరిజమ్స్‌తో చాలా చోట్ల ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌లో వీన్ డిజీల్‌ను గుర్తుచేశాడు గాస్టాంబైడ్. అలెక్స్ పాత్రలో అల్బన్ లెనోయిర్ యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించాడు. ఇద్దరి క్యారెక్టర్స్ పోటాపోటీగా ఉంటాయి. ఫ్రెడ్ లవర్ క్లారా పాత్రలో అన గిరోర్‌డాట్ కూడా చివరి వరకు సినిమాలో కనిపిస్తుంది. ప్రియుడి లక్ష్యానికి అండగా నిలిచే ప్రియురాలిగా కనిపించింది.
బెస్ట్ యాక్షన్ మూవీ…
ది వేజెస్ ఆఫ్ ఫియర్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ స్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా చూస్తే డిసపాయింట్ చేయదు.