Best Web Hosting Provider In India 2024

అన్నమయ్య జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ఏడో రోజు అట్టహాసంగా ప్రారంభమైంది. అమ్మగారిపల్లె నైట్ హాల్ట్ నుంచి బుధవారం ఉదయం సీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర బయల్దేరింది. సీఎం వైయస్ జగన్‌కు అమ్మగారిపల్లి ప్రజానీకం ఘన స్వాగతం పలికారు. అమ్మగారిపల్లె మీదుగా సదుం, కల్లూరు మీదుగా దామలచెరువు, తలుపులపల్లి మీదుగా సాగనుంది. తలుపులపల్లి నుంచి తేనెపల్లి చేరుకున్న అనంతరం సీఎం వైయస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం తేనెపల్లి, రంగంపేట క్రాస్ మీదుగా సాయంత్రం 3 గంటలకి పూతలపట్టు బైపాస్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పి.కొత్తకోట, పాకాల క్రాస్, గదంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్, రేణిగుంట మీదుగా గురువరాజుపల్లె రాత్రి బస చేసే ప్రాంతానికి చేరుకుంటారు.