Egg Butter Masala: ఒక్కసారి ఎగ్ బట్టర్ మసాలా చేసుకొని చూడండి, చపాతీలోకి ఈ కర్రీ అదిరిపోతుంది

Best Web Hosting Provider In India 2024

Egg Butter Masala: పనీర్ బటర్ మసాలా అందరికీ తెలిసిన కూరే. అలాగే ఎగ్ బటర్ మసాలా కూడా వండుకుని చూడండి. దీని రుచి మామూలుగా ఉండదు. ఒక్కసారి వండారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ముఖ్యంగా రోటీ, చపాతి, వెజ్ బిర్యానీకి జతగా ఇది బాగుంటుంది. దీని చేయడం చాలా సులువు. ఎగ్ బటర్ మసాలా కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఎగ్ బటర్ మసాలా రెసిపీకి కావలసిన పదార్థాలు

గుడ్లు – నాలుగు

ఉల్లిపాయలు – రెండు

టమోటాలు – మూడు

వెల్లుల్లి రెబ్బలు – ఆరు

అల్లం – చిన్న ముక్క

ఉప్పు – రుచికి సరిపడా

నూనె సరిపడినంత

జీడిపప్పు – 20

నీరు – తగినంత

బిర్యానీ ఆకులు – రెండు

కారం – ఒక స్పూను

గరం మసాలా – అరస్పూను

కసూరి మేథి – ఒక స్పూను

కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు

ఎగ్ బటర్ మసాలా రెసిపీ

1. ఎగ్ బటర్ మసాలాను చాలా సులువుగా చేసేయొచ్చు.

2. ముందుగా జీడిపప్పును వేడి నీటిలో అరగంట పాటు నానబెట్టండి.

3. తర్వాత గుడ్లను ఉడకబెట్టి పైన పొట్టు తీసి పక్కన పెట్టుకోండి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయండి.

5. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించండి.

6. అవి రంగు మారేవరకు వేయించి తర్వాత టమోటో తరుగును వేసి వేయించండి.

7. టమోటోలు బాగా మగ్గాక వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసి వేయించండి.

8. అందులోనే ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పును కూడా వేసి వేయించండి.

9. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. సరిపడేంత నీటిని కూడా వేయండి.

10. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి మళ్ళీ నూనె వేయండి.

11. నూనెలో బిర్యానీ ఆకు వేసి వేయించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించండి.

12. ముందుగా మిక్సీలో చేసి పెట్టుకున్న టమోటా, ఉల్లిపాయల తరుగు వేసి బాగా కలపండి.

13. అందులోనే కారం, గరం మసాలా, కసూరి మేతి వేసి చిన్న మంట మీద 20 నిమిషాల పాటు ఉడికించండి.

14. ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న గుడ్లను వేసి కలపండి. మళ్లీ మూత పెట్టి పది నిమిషాలు ఉడికించండి.

15. మూత తీసి కొత్తిమీరను పైన జల్లుకొని స్టవ్ కట్టేయండి.

16. అంతే ఎగ్ బటర్ మసాలా రెడీ అయినట్టే.

17. ఇది రోటీలోకి, చపాతీలోకి టేస్టీగా ఉంటుంది. బిర్యానీలో తిన్నా కూడా రుచిగా ఉంటుంది.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024