Ruhani Sharma sex scene: రుహానీ శర్మ బోల్డ్ సెక్స్ సీన్ వైరల్.. ఆ మూవీ రిలీజ్ డేట్ ఇదే

Best Web Hosting Provider In India 2024

Ruhani Sharma sex scene: తెలుగులో చిలసౌ, హిట్, డర్టీ హరి అనే సినిమాల ద్వారా ప్రేక్షకులకు చేరువైన నటి రుహానీ శర్మ. తరచూ ఇన్‌స్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడో బోల్డ్ సెక్స్ సీన్లో నటించి షాక్‌కు గురి చేసింది. ఈ మూవీ ట్రైలర్ ఈ మధ్యే రిలీజ్ కాగా.. అందులోని ఆ సీన్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రుహానీ శర్మ సెక్స్ సీన్

రుహానీ శర్మ తన బోల్డ్ ఫొటోలతోనే కాదు.. బోల్డ్ సీన్లతోనూ వార్తల్లో నిలుస్తోంది. ఎప్పుడో 2019లో చిలసౌ అనే మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. తెలుగులో ఒక్క డర్టీ హరి తప్ప చాలా వరకూ కాస్త పద్ధతైన పాత్రలే చేసింది. కానీ తాజాగా ఆమె నటించిన ఓ హిందీ మూవీ సంచలనం రేపుతోంది. ఈ సినిమా పేరు ఆగ్రా. 2023లోనే ఈ సినిమా రూపొందింది.

కానీ ఇంత వరకూ థియేటర్లలో రిలీజ్ కాలేదు. అయితే బుధవారం (ఏప్రిల్ 3) ఫ్రాన్స్ లో రిలీజ్ కాబోతోంది. గతేడాది మే 24న కేన్స్ లో తొలిసారి ఆగ్రా మూవీని ప్రదర్శించారు. ఆ తర్వాత ఆగస్ట్ లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ లో, అక్టోబర్ లో బూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ మూవీ స్క్రీనింగ్ జరిగింది. అయితే ఇండియాలో మాత్రం ఇంత వరకూ సినిమా రిలీజ్ కాలేదు.

తాజాగా ఫ్రాన్స్ లో రిలీజ్ కానుండటంతో మరోసారి ఆగ్రా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో రుహానీ శర్మ రెచ్చిపోయి ఓ సెక్స్ సీన్లో నటించింది. మోహిత్ అగర్వాల్, రాహుల్ రాయ్, ప్రియాంకా బోస్ లాంటి వాళ్లు కూడా నటించిన ఈ సినిమా ట్రైలర్ మొత్తం చాలా బోల్డ్ గానే ఉంది. మోస్ట్ షాకింగ్ ఇండియన్ ఫిల్మ్ ఎవర్ మేడ్ అంటూ బీబీసీ ఇచ్చిన రివ్యూను ట్రైలర్ లో చూపించారు.

ఆగ్రా మూవీ స్టోరీ ఏంటి?

కను బెహల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అమ్మాయిలు, మహిళలను లైంగికంగా అనుభవిస్తూ పైశాచికానందం పొందే ఓ కాల్ సెంటర్ యువకుడి చుట్టూ తిరుగుతుంది. మూవీ ట్రైలర్ మొత్తం కొన్ని బోల్డ్ సీన్స్ చూడొచ్చు. అయితే రుహానీ శర్మ మరీ ఇంతటి బోల్డ్ సీన్స్ లో నటించడం మాత్రం అభిమానులను షాక్ కు గురి చేస్తోంది.

నిజానికి 2019లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. 2020లో కొవిడ్ కారణంగా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయి. ఐదేళ్ల కిందట సినిమా కావడంతో ఇందులో రుహానీ చాలా యంగ్ గా కనిపిస్తోంది. కేవలం ఆగ్రా నగరంలోనే మూవీ షూటింగ్ మొత్తం జరిగింది. అయితే ఈ సినిమా ఇండియా రిలీజ్ డేట్ ను మాత్రం మేకర్స్ అనౌన్స్ చేయలేదు.

నిజానికి రుహాని ఇలాంటి ఒక సినిమాలో నటించిన విషయం ఈ మధ్య ఆగ్రా ట్రైలర్ రిలీజైతే కానీ చాలా మందికి తెలియలేదు. రుహాని ఈ మధ్యే సైంధవ్, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. శ్రీరంగ నీతులు మూవీ కూడా చేస్తోంది.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024