Best Web Hosting Provider In India 2024

పెరాలసిస్ బాధితుడికి సీఎం వైయస్ జగన్ భరోసా
చిత్తూరు జిల్లా: సదుం మండలం సదుం గ్రామానికి చెందిన 23 ఏళ్ల ముఖేష్ రెండేళ్ల క్రితం పెరాలసిస్‌కు గురయ్యాడు.
ఇప్పటికే స్తోమతకు మించి, అప్పుల చేసి మరీ వైద్యం చేయించింది ముఖేష్ కుటుంబం.
అంతంతమాత్రం ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకువస్తున్న వారికి ముఖేష్ వైద్య ఖర్చులు తలకు మించిన భారం అయ్యాయి.
అతని వైద్యానికి మరో 15 లక్షలు అవసరం అవుతాయని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
సీఎం వైయస్ జగన్‌ను కలిస్తే తప్పక తమకు సహాయం దొరుకుతుందని నమ్ముతున్నామని ముఖేష్ తల్లి ఆశాభావం వ్యక్తం చేశారు.
మేమంతా సిద్ధం యాత్రలో సదుం వద్ద ముఖేష్ కుటుంబం ముఖ్యమంత్రిని కలిసారు.
సీఎం వైయస్ జగన్ వారిని బస్సు వద్దకు పిలిపించుకుని అతడి ఆరోగ్య పరిస్థితిని గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు.
ముఖేష్ వివరాలను తీసుకోవాలని ఆరోగ్యశ్రీ అధికారులను సూచించారు.
ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసాతో తమ బిడ్డకు వైద్యం జరిగి మామూలు మనిషి అవుతాడనే నమ్మకం కలిగిందని ఆ కుటుంబం నమ్మకంగా ఉంది.