Thalapathy Vijay: కెరీర్‌లో చివ‌రి మూవీ కోసం ద‌ళ‌ప‌తి విజ‌య్ రెమ్యున‌రేష‌న్ 250 కోట్లు – డైరెక్ట‌ర్ ఫిక్స్‌

Best Web Hosting Provider In India 2024

Thalapathy Vijay: ప్ర‌స్తుతం గోట్ ( ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ) మూవీతో బిజీగా ఉన్నాడు ద‌ళ‌ప‌తి విజ‌య్‌. గోట్ త‌ర్వాత మ‌రో మూవీ మాత్ర‌మే చేసి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు విజ‌య్ ఇటీవ‌లే ప్ర‌క‌టించాడు. త‌న కెరీర్‌లో దాదాపు ఇదే చివ‌రి మూవీ అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపాడు. అంతే కాకుండా త‌మిళ‌గ వెట్ర క‌ళ‌గం పేరుతో పొలిటిక‌ల్ పార్టీని కూడా అనౌన్స్‌చేశాడు.

డైరెక్ట‌ర్ ఎవరంటే…

విజ‌య్ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు న‌టించ‌నున్న‌ చివ‌రి మూవీకి ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది కోలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించ‌నున్న 69వ సినిమాకు హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్లు కోలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి.

విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీకి త‌గ్గ‌ట్లుగా ఈ మూవీ ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ద‌ర్శ‌కుడు హెచ్ వినోథ్‌ ఈ మూవీ క‌థ‌ను సిద్ధంచేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో విజ‌య్ యంగ్ పొలిటిక‌ల్ లీడ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

250 కోట్ల రెమ్యున‌రేష‌న్‌…

ఈ చివ‌రి సినిమా కోసం విజ‌య్ ఏకంగా 250 కోట్ల రెమ్యున‌రేష‌న్ స్వీక‌రించ‌బోతున్న‌ట్లు కోలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. విజ‌య్ లాస్ట్ మూవీ అంటూ వార్త‌లు వినిపిస్తోండ‌టంతో క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఈ మూవీ రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

ఈజీగా వెయ్యి కోట్లు వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌వ‌చ్చున‌ని చెబుతోన్నారు. అందుకే ద‌ళ‌ప‌వి విజ‌య్‌కి భారీ రెమ్యున‌రేష‌న్ ఇచ్చేందుకు నిర్మాణ సంస్థ‌లు పోటీప‌డుతోన్న‌ట్లు చెబుతోన్నారు. ఈ సినిమాతో ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలోనే అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకోనున్న హీరోగా విజ‌య్ నిలువ‌నున్న‌ట్లు చెబుతోన్నారు.

ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూస‌ర్‌…

ద‌ళ‌ప‌తి విజ‌య్ 69వ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత‌, ఆర్ ఆర్ ఆర్ ప్రొడ్యూస‌ర్ డీవీవీ దాన‌య్య నిర్మించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తో పాటు స‌న్ పిక్చ‌ర్స్ పేరు కూడా ప్ర‌చారంలో ఉంది. ఈ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ల‌లో ఏది ద‌ళ‌ప‌తి విజ‌య్ 69వ సినిమాను నిర్మించ‌నుంద‌న్న‌ది త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో గ్రాండియ‌ర్‌గా ద‌ళ‌ప‌వి విజ‌య్ 69 మూవీని నిర్మించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

డ్యూయ‌ల్ రోల్‌…

గోట్ మూవీలో విజ‌య్ డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఎయిర్ ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు ఈ మూవీని తెర‌కెక్కిస్తోన్నాడు. ఇందులో ప్ర‌భుదేవా, ప్ర‌శాంత్‌, వైభ‌వ్‌, ఎస్‌జే సూర్య కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. గోట్ సినిమాలో గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా గ‌త ఏడాది రిలీజైన లియో మూవీ 690 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన టాప్ టెన్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.లియో సినిమాకు లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త్రిష, సంజ‌య్‌ద‌త్‌, అర్జున్ కీల‌క పాత్ర‌లు పోషించారు. తెలుగులో అదే పేరుతో డ‌బ్ అయిన లియో నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024