YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / జుజ్జూరు :
ది.06-01-2023(శుక్రవారం) ..
సంక్షేమంలో వై.యస్.జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శం ..
నూతనంగా మంజూరైన పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
మండల పరిధిలోని జుజ్జూరు గ్రామంలో ఏర్పాటుచేసిన వైయస్సార్ పెన్షన్ వారోత్సవాల కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ లను అందజేశారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండగలా ఉందని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో సూర్యోదయానికి ముందే వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఆత్మీయంగా పలకరిస్తూ ఠంఛనుగా పింఛన్లు అందిస్తున్నారని తెలిపారు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ప్రజా సంక్షేమంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు, మండలంలో కొత్తగా 276 వివిధ రకాల పెన్షన్ లు మంజూరయ్యాయని, వీటితో మొత్తం 9121 మంది మండలంలో పెన్షన్ దారులు ఉన్నారన్నారు ..
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోటేరు లక్ష్మి ముత్తారెడ్డి, జడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం, మండల కన్వీనర్ ఆవుల రమేష్ బాబు, గ్రామ సర్పంచ్ రమావత్ కోటి, ఉప సర్పంచ్ పసుపులేటి సాయిబాబు, సొసైటీ అధ్యక్షులు పూల రాంబాబు, నాయకులు కోటేరు సూర్యనారాయణ రెడ్డి, బొమ్మిశెట్టి భాస్కరరావు, తోట నారాయణరావు మరియు ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు ..