Best Web Hosting Provider In India 2024
Hyderabad Crime News : హైదరాబాద్ లో(Hyderabad) విషాధ ఘటన చోటు చేసుకుంది.రోడ్డు ప్రమాదానికి కారణమయ్యానని భయాందోళనకు గురైన ఓ వ్యక్తి ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యకు(suicide) పాల్పడిన ఘటన ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ట్రెండింగ్ వార్తలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం……వనస్థలిపురం FCI కాలనీకి చెందిన గుమ్మడి రితీష్ రెడ్డి (30) వృత్తిరీత్యా వ్యాపారి. నగరంలో ఓ పని నిమిత్తం కారులో ఎల్ బి నగర్ నుంచి బయల్దేరిన రితీష్…..మూసారంబాగ్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి రితీష్ కారణమయ్యాడు.ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రంగా గాయాలు అయినట్లు సమాచారం.దీంతో రితీష్ రెడ్డి ప్రమాదం తరువాత కారు ఆపకుండా అలానే వచ్చాడు.ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు రితీష్ రెడ్డి కారును బైక్ పై వెంబడించాడు.దీంతో రితీష్ రెడ్డి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.కొద్ది దూరం వెళ్లినాక…..ఎన్టీఆర్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చి అక్కడ కారు పార్క్ చేశాడు.
ఆస్పత్రి నాలుగో అంతస్తు పైనుంచి దూకి…..
అక్కడి నుంచి నేరుగా ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తుకు చేరుకొని అక్కడి నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.రోడ్డు ప్రమాదానికి కారణమైన తనపై పోలీసులు కేసు పెడితే….జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే రితీష్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.కాగా మృతుడు గుమ్మడి రితీష్ రెడ్డికి 8 నెలల క్రితమే వివాహం జరిగిందని,ఇంతలోనే ఈ విషాదం జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు ఎల్ బి నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.రితీష్ రెడ్డిని వెంబడించిన ఇద్దరు వ్యక్తులు కోసం పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.
అదనపు కట్నం కోసం వేధింపులు….వివాహిత ఆత్మహత్య
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య (suicide)చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సునుగల అనుబంధ గ్రామం జలపతి తండాలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం……. చండుర్తి మండలం జలపాతి తండాకు చెందిన గుగులోత్ శుభ (25) అనే వివాహిత మంగళవారం పురుగుల మంది తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
వీర్ణపల్ల మండలం గర్జన గ్రామానికి చెందిన శోభను జలపటి తండాకు చెందిన జలంధర్ కు ఇచ్చి వివాహం చేశారు.వివాహ సమయంలో కట్న కానుకలు ఇచ్చినప్పటికీ…..అదనపు కట్నం తీసుకురావాలని భర్త జలంధర్ శోభను తరుచూ వేధించేవాడు. దీంతో ఎవరు లేని సమయంలో ఆమె పొలానికి చల్లే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.సంఘటన స్థలాన్ని పరిశీలించిన సిఐ వెంకటేశ్వరరావు…..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతురాలికి మూడున్నర సంవత్సరాల కుమారుడు ఉన్నారని కుటుంబ సభ్యులు,జలంధర్ తల్లి,తండ్రి వేదింపులు వల్లే శుభ ఆత్మహత్య చేసుకుందని శుభ బంధువులు ఆరోపించారు.దీంతో వారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టింగ్ – కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా, HT తెలుగు ప్రతినిధి
టాపిక్