అధికార పీఠానికి కొత్తభాష్యం చెప్పిన ఆదర్శమూర్తి సీఎం వైయస్ జగన్

Best Web Hosting Provider In India 2024

ఎమ్మెల్యే అభ్య‌ర్థి సునీల్‌కుమార్‌

పూత‌ల‌ప‌ట్టు: పాలకుడు అంటే ప్రజలను పరిపాలించే వాడు కాదు, ప్రజల సంక్షేమాన్ని చూసుకునే వ్యక్తి అని చెప్పి అధికార పీఠానికి కొత్తభాష్యం చెప్పిన ఆదర్శమూర్తిగా నిలిచిన నాయకుడు మన సీఎం వైయస్ జగన్ అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి సునీల్‌కుమార్ తెలిపారు. మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌లో భాగంగా పూతలపట్టు బహిరంగ సభలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ అభ్యర్ధి సునీల్ కుమార్ మాట్లాడారు.

సునీల్ కుమార్ ఏమ‌న్నారంటే..
పాలకుడు అంటే ప్రజలను పరిపాలించే వాడు కాదు, ప్రజల సంక్షేమాన్ని చూసుకునే వ్యక్తి అని చెప్పి అధికార పీఠానికి కొత్తభాష్యం చెప్పిన ఆదర్శమూర్తిగా నిలిచిన నాయకుడు మన సీఎం వైయస్ జగన్
వైఎస్సార్ ఆశయ సాధన ముద్దుబిడ్డ, సంక్షేమ సృష్టికర్త, సామాజిక న్యాయ రూపశిల్పి, మహిళా సాధికారతకు సాధనకర్త, రాజకీయానికే రాజసమైన మన పులివెందుల పులిబిడ్డ, మనందరి ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు స్వాగతం.. సుస్వాగతం. అందరికీ నమస్కారం. ఒక సాధారణ డాక్టర్ అయిన నాకు రాజకీయ అవకాశం కల్పించి నాపై నమ్మకం ఉంచి రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్ధిగా అవకాశం ఇచ్చినందుకు సభాముఖంగా సీఎం వైయస్ జగన్ కు నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. పాలకుడు అంటే ప్రజలను పరిపాలించే వాడు కాదు, ప్రజల సంక్షేమాన్ని చూసుకునే వ్యక్తి అని చెప్పి అధికార పీఠానికి కొత్తభాష్యం చెప్పిన ఆదర్శమూర్తిగా నిలిచిన నాయకుడు మన సీఎం వైయస్ జగన్. అన్నా.. పూతలపట్టు నియోజకవర్గం కరువు ప్రాంతం, వర్షాభావ ప్రాంతం కాబట్టి మిమ్మల్ని అభిమానించే ప్రజానీకం ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మళ్లీ మీరు ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి మా అందరి కోరిక. రామరాజ్యం ఎలా ఉంటుందో మేము చూడలేదు కానీ, రామరాజ్యంలాంటి రాజన్నబిడ్డ రాజ్యం ఎలా ఉంటుందో ఈ తరానికి చూపిస్తున్న నాయకుడు మన సీఎం వైయస్ జగన్ అని గర్వంగా చెప్పగలుగుతాను. నామీద నమ్మకంతో మీరు ఆశీర్వదించి నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మంచి పరిపాలన దిశగా ఐదు సంవత్సరాలు మంచి పరిపాలన చూశాం. మళ్లీ ముఖ్యమంత్రిగా అన్న రావాలి, మనందరికీ కూడా మంచి చేయాలని వేడుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

Best Web Hosting Provider In India 2024