![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/04/fire_accident_1712150531340_1712150538910.jpg)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/04/fire_accident_1712150531340_1712150538910.jpg)
Sangareddy Fire Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్ సమీపంలో ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు(Reactor Blast) సంభవించింది. ఈ ప్రమాదంలో పరిశ్రమలో మంటలు చెలరేగి(Sangareddy Fire Accident) ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఆ పరిశ్రమ డైరెక్టర్ రవి కూడా ఉన్నారు. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ట్రెండింగ్ వార్తలు
టాపిక్
SangareddyFire AccidentTrending TelanganaHyderabadCrime TelanganaAccidents