Best Web Hosting Provider In India 2024
Taapsee Pannu Marriage Video: స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవల వివాహం చేసుకున్నారు. తన ప్రేమికుడు మథియాస్ బోయ్‍ను ఆమె మనువాడారు. ఉదయ్‍పూర్‌లో వీరి వివాహం జరిగింది. అయితే, ఈ పెళ్లిని ఆంతరంగికంగా చేసుకున్నారు ఆ జంట. వివాహం విషయం బయటికి రాకుండా సైలెంట్‍గా చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఎలాంటి ఫొటోలు, వీడియోలను వెల్లడించలేదు. అయితే, ఎట్టకేలకు వీరి వివాహం జరిగిన సుమారు పది రోజులకు ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బయటికి వచ్చింది.
డ్యాన్స్ చేస్తూ వేదికపైకి..
తాప్సీ పన్ను – మథియాస్ బోయ్ పెళ్లి వీడియో ఆకట్టుకునేలా ఉంది. రెడ్ కలర్ డ్రెస్.. బంగారు ఆభరణాలను పెళ్లికి ధరించారు తాప్సీ. బ్యాక్‍గ్రౌండ్‍లో సాంగ్ ప్లే అవుతుండగా.. డ్యాన్స్ చేస్తూ ఆమె పెళ్లి వేదికకు నడుచుకుంటూ వచ్చారు. మండపంపైకి రాగానే మథియాస్ బోయ్‍ను కౌగిలించుకున్నారు.
వేదికపై నృత్యం చేసిన జంట
వేదికపైకి వచ్చాక తాప్సీ పన్ను, మథియాస్ బోయ్ దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత అతిథులు వారిపై పూల వర్షం కురిపించారు. తాప్సికి బోయ్ ముద్దుపెట్టారు. అనంతం వేదికపైనే ఆనందంతో జంటగా డ్యాన్స్ చేశారు.
డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్ మథియాస్ బోయ్.. ఈ పెళ్లిలో సంప్రదాయ దుస్తులు ధరించారు. షేర్వాణీ, పగ్డి వేసుకున్నారు. తాప్సీ ఎరుపు రంగు దుస్తులు, బంగారు ఆభరణాలతో తళుక్కుమన్నారు.
తాప్సీ, మథియాస్ బోయ్ వివాహం ఉదయ్‍పూర్‌లోని ఓ ప్యాలెస్‍లో మార్చి 23వ తేదీన జరిగిందని సమాచారం బయటికి వచ్చింది. పెళ్లి జరిగిన మూడు రోజుల తర్వాత ఈ విషయం వెల్లడైంది. కావాలనే ఈ వివాహం గురించి బయటికి తెలియకుండా తాప్సీ, బోయ్ జాగ్రత్త పడ్డారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొందరు బాలీవుడ్ సెలెబ్రెటీలు హాజరయ్యారని తెలుస్తోంది. మార్చి 20వ తేదీన వీరి ప్రీ-వెడ్డింగ్ సెలెబ్రేషన్ మొదలయ్యాయని సమాచారం బయటికి వచ్చింది. హల్దీ, సంగీత్ లాంటి ఫంక్షన్ల తర్వాత మార్చి 23వ తేదీన వివాహ వేడుక జరిగిందని తెలిసింది.
పదేళ్ల ప్రేమ
మథియాస్ బోయ్‍తో తాప్సీ పన్ను పదేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. 2013లో ఛష్మీ బద్దూర్ చిత్రం చేసే సమయంలోనే మథియాస్‍ను తాప్సీ కలిశారు. అప్పటి నుంచే ప్రేమలో ఉన్నారు. అయితే, చాలా కాలం వీరి ప్రేమ వ్యవహారం బయటికి రాలేదు. చాలాకాలం తర్వాత స్వయంగా తాప్సీనే ఈ విషయాన్ని వెల్లడించారు. మథియాస్ బోయ్‍తో ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ప్రేమ విషయాన్ని చెప్పారు. మాథియస్‍తో రిలేషన్‍లో తాను ఆనందంగా ఉన్నానని అన్నారు. మొత్తంగా సుమారు పదేళ్ల ప్రేమ తర్వాత తాప్సీ – మథియాస్ పెళ్లి చేసుకున్నారు.
2010లో ఝుమ్మంది నాదం చిత్రంలో టాలీవుడ్ ద్వారానే తెరంగేట్రం చేశారు తాప్సీ. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేశారు. 2013 నుంచి బాలీవుడ్‍పై ఆమె ఎక్కువ ఫోకస్ పెట్టారు. అప్పటి నుంచి ఎక్కువగా హిందీ చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‍లో మూడు సినిమా తాప్సీ లైనప్‍లో ఉన్నాయి.