
Best Web Hosting Provider In India 2024

OTT Hit Movies: గతేడాది పలు బాలీవుడ్ సినిమాలు థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ సినిమాలు విమర్శకుల నుంచి మిక్స్‌డ్ రివ్యూస్ తెచ్చుకున్నాయి. అలాగే బాక్సాఫీస్ వద్ద తగినంత కలెక్షన్స్ రాబట్టడంలో విఫలం అయ్యాయి. దాంతో మేకర్స్‌కు కొంతమేర నష్టాలు తీసుకొచ్చాయి. అయితే, ఇలా థియేటరల్లో ఫెయిల్ అయిన సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి వచ్చాక ఓటీటీ సక్సెస్ సినిమాలుగా అవతరించాయి.
మెర్రీ క్రిస్మస్ ఓటీటీ
బాలీవుడ్ క్రేజీ బ్యూటి కత్రీనా కైఫ్ నటించిన రీసెంట్ మూవీ మెర్రీ క్రిస్మస్. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్, తమిళ అగ్ర హీరో విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించాడు. అయితే, విజయ్, కత్రీనా మొదటిసారి జోడీ కట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ వదద్ ఊహించని ఫలితాన్ని చవిచూసింది. కానీ, ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో విడుదలయ్యాకా మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. శ్రీరామ్ రాఘవన్ తెరకెకక్కించి ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
మెయిన్ అటల్ హూన్
బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన సినిమా మెయిన్ అటల్ హూన్. ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించలేకపోయింది. భారత మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పేలవంగా ఆడడం షాక్‌కు గురి చేసింది. కానీ, వెంటనే ఓటీటీలో వచ్చిన ఈ చిత్రంపై నెటిజన్లు అమితమైన ఆసక్తి చూపారు. సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకున్న ఈ సినిమా జీ5లో ప్రసారం అవుతోంది.
తేజస్ (2023)
బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తన సినీ కెరీర్‌లో ఎన్నో ఫ్లాప్స్ చూసింది. వాటిలో తేజస్ ఒకటి. హిందీ బాక్సాఫీస్‌లో అత్యంత బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా ఈ మూవీ నిలిచింది. అయితే, రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చిన ఈ మూవీపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కథ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉంటే మరింత బాగుండేదని మెజారిటీ అభిమానులు భావించారు. కంగనా తన అద్భుతమైన నటనతో ప్రశంసలు పొందుతున్న ఈ సినిమా కూడా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
త్రీ ఆఫ్ అస్ (2023)
షెఫాలీ షా, జైదీప్ అహ్లావత్ నటించిన త్రీ ఆఫ్ అస్ సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు మంచి ప్రశంసలు పొందినప్పటికీ, అది కమర్షియల్‌గా మాత్రం విఫలమైంది. అయితే, నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చాక దీనికి మరింత మంచి రెస్పాన్స్ వచ్చింది. షెఫాలీ షా మరోసారి తెరపై తన నటనతో మ్యాజిక్ క్రియేట్ చేయగా, అహ్లావత్ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
సుఖీ (2023)
బాలీవుడ్ సొగసరి శిల్పా శెట్టి హంగామా 2, నికమ్మ సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చిందని అన్నారు. కానీ, నిజానికి శిల్పాశెట్టికి అసలైన కమ్ బ్యాక్ మూవీ సుఖీ. సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపిచింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ ఓటీటీలో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
షెహజాదా (2023)
వీటితోపాటు అల వైకుంఠపురములో సినిమా హిందీ రీమేక్‌గా వచ్చిన కార్తీక్ ఆర్యన్ షెహజాదా సైతం థియేటర్లలో ప్లాప్‌గా నిలిచింది. అయితే, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకు హిందీ ఆడియెన్స్ ఇంప్రెస్ అయ్యారు. కాగా ఈ మూవీలో కృతీ సనన్ హీరోయిన్‌గా చేసింది.
సెల్ఫీ (2023):
అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ వంటి ఊహించని కాంబినేషన్‌లో వచ్చిన సెల్ఫీ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. మలయాళ బ్లాక్ బస్టర్ డ్రైవింగ్ లైసెన్స్‌కు రీమేక్‌గా వచ్చిన ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.