Grapes in Pregnancy: గర్భిణీలు ద్రాక్ష పండ్లను తినకూడదా? తింటే ఏమవుతుంది?

Best Web Hosting Provider In India 2024


Grapes in Pregnancy: గర్భం ధరించాక తినే ప్రతి ఆహారం పైన దృష్టి పెట్టాలి. తల్లికీ బిడ్డకూ మేలు చేసే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా అన్ని రకాల పండ్లను తినమని చెబుతారు పోషకాహార నిపుణులు. అయితే గర్భం ధరించాక ద్రాక్ష పండ్లను దూరంగా పెట్టమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ద్రాక్ష పండ్లు నోరూరించేలా ఉంటాయి. తీపిగా, జ్యూసీగా ఉంటాయి. ఎక్కువ మంది గర్భిణిలు వీటిని తినేందుకు ఇష్టపడతారు. నిజానికి గర్భిణీలు ద్రాక్ష పండ్లను తినకపోవడమే మంచిది. సాధారణ వ్యక్తులు ద్రాక్ష పండ్లను తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. వీటిలో విటమిన్ సి, విటమిన్ కే, పొటాషియం, ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవడానికి ఉపయోగపడతాయి ఈ పండ్లు ఉపయోగపడతాయి. అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం ద్రాక్ష పండ్లకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఇది ఎదుగుతున్న పిండంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ద్రాక్షపండ్లు ఎందుకు తినకూడదు?

గర్భం ధరించాక ద్రాక్ష పండ్లను అధికంగా తినడం వల్ల మధుమేహం రావచ్చు. అలాగే దీనిలో ఉండే అధిక చక్కెర కంటెంట్ వల్ల బరువు కూడా పెరిగే అవకాశం ఉంది. ద్రాక్ష పండ్లు ఎరుపు, ఊదా రంగులో అధికంగా ఉంటాయి. ఈ ద్రాక్షలో రెస్వరాట్రాల్ అనే సమ్మేళనం ఉంటుంది. అధ్యయనాల ప్రకారం అధిక మోతాదులో ఈ రెస్వరాట్రాల్ తింటే పునరుత్పత్తి, పిండం అభివృద్ధిపై విషపూరిత ప్రభావాలు చూపించే అవకాశం ఉన్నట్టు తేలింది. అయితే మానవ గర్భధారణ పై ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కచ్చితంగా తెలియదు. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎందుకైనా మంచిది… ద్రాక్షను తినకపోవడమే మంచిది.

ద్రాక్షను పండించేటప్పుడు ఎక్కువ స్థాయిలో పురుగుమందులను కొడతారు. ఆ అవశేషాలు ఎంత కడిగినా కూడా ద్రాక్ష పండ్లలో ఉండవచ్చు. కాబట్టి గర్భధారణ సమయంలో ద్రాక్ష పండ్లను దూరంగా పెట్టడమే మంచిది. ఈ పురుగుమందుల అవశేషాలు శరీరంలో చేరితే పుట్టే పిల్లల్లో కొన్ని లోపాలు రావచ్చు. లేదా పిల్లల అభివృద్ధి మందగించవచ్చు. కాబట్టి మరీ తినాలనిపిస్తే కొన్ని సేంద్రియ పద్ధతిలో పండించిన ద్రాక్షను మాత్రమే ఎంచుకోవాలి. అవి కూడా చాలా తక్కువగా తినాలి.

డయాబెటిస్ వచ్చే అవకాశం

ద్రాక్షలో సహజంగానే చక్కెర నుండి ఉంటుంది. అది కూడా ఫ్రక్టోజ్ రూపంలో ఉంటుంది. గర్భం ధరించాక ద్రాక్ష పండ్లను అధికంగా తింటే జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. గర్భం ధరించాక సాధారణంగానే రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇక ద్రాక్ష పండ్లను తింటే అది జెస్టేషనల్ డయాబెటిస్‌కు దారితీస్తుంది. దీనివల్ల తల్లి బరువు పెరగడంతో పాటు బిడ్డ కూడా అధిక బరువుతో పుట్టే అవకాశం ఉంది.

ద్రాక్షపండ్లలో ఉండే సహజ చక్కెరలు, ఫైబర్ వంటివి గర్భిణీలలో కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా వంటి వాటికి కారణం అవ్వచ్చు. కాబట్టి గర్భం ధరించాక ద్రాక్ష తప్ప మిగతా పండ్లను అధికంగా తినడమే ఉత్తమం.

Source / Credits

Best Web Hosting Provider In India 2024