Papikondalu Tour Package : 3 రోజుల ‘పాపికొండల’ ట్రిప్ – గోదావరిలో బోట్ జర్నీ, ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ చూడండి

Best Web Hosting Provider In India 2024

Hyderabad – Papikondalu Tour 2024: ప్రకృతి అందాలకు కేరాఫ్ అయిన పాపికొండలను(Papikondalu) చూడాలని అనుకుంటున్నారా..? గోదావరిలో బోట్ రైడింగ్ చేస్తూ…. ప్రకృతి అందాలను అస్వాదించాలనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం(Telangana Tourism) స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. అతి తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి పాపికొండలు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ప్రతి శుక్రవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. మొత్తం మూడు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. బస్సులో రోడ్డు మార్గం ద్వారా జర్నీ ఉంటుంది. అదనంగా గోదావరిలో బోటింగ్ ఉంటుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి….

ట్రెండింగ్ వార్తలు

  • పాపికొండల చూసేందుకు తెలంగాణ టూరిజం “PAPIKONDALU ROAD CUM RIVER CRUISE PACKAGE TOUR ” పేరుతో ఓ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
  • హైదరాబాద్ నుంచి ప్రతి శుక్రవారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
  • DAY 1: రాత్రి 07.30 గంటలకు హైదరాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి బస్సు బయల్దేరుతుంది. రాత్రి 8 గంటలక బషీర్ బాగ్ వద్దకు వస్తుంది. రాత్రి భద్రాచలం వెళ్తారు. మార్గ మధ్యలో భోజనం ఉంటుంది.
  • DAY 2 : ఉదయం 6 గంటలకు భద్రాచలంలోని హారిత హోటల్ కు చేరుకుంటారు. 8 గంటలకు పోచారం బోటింగ్ పాయింట్ కు చేరుకొని.. పాపికొండలతో పాటు పెరంటాలపల్లికి వెళ్తారు. పొచారానికి బోట్ లో జర్నీ ఉంటుంది. లంచ్ తో పాటు స్నాక్స్ ఇస్తారు. రాత్రి భద్రాచలంలోని హారిత హోటల్ లో బస చేస్తారు.
  • DAY 3 : బ్రేక్ ఫాస్ చేసిన తర్వాత… పర్ణశాలకు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత… హైదరాబాద్ కు బయల్దేరుతారు. రాత్రి 10గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు.

పాపికొండలు టూర్ ప్యాకేజీ ధరలు:

Hyderabad – Papikondalu Tour Prices 2024: హైదరాబాద్ – పాపికొండలు టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు 6999గా నిర్ణయించారు. పిల్లలకు 5599గా ఉంది . నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది. బోట్ లో భోజనం ఇస్తారు. ఏమైనా సందేహాలు ఉంటే 1800-425-46464 నెంబర్ కు కాల్ చేయవచ్చు. info@tstdc.in మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.

సోమశిల టూర్ ప్యాకేజీ….

మరోవైపు Srisailam – Somasila Road cum River Cruise Tour పేరుతో ఆ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది తెలంగాణ టూరిజం. ప్రతి వీకెండ్ శనివారం తేదీల్లో ఈ ట్రిప్ అందుబాటులో ఉంటుంది.

  • హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.
  • ప్రతి శనివారం తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
  • రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
  • నాన్ ఏసీ కోచ్ బస్సులో జర్నీ ఉంటుంది. ఉదయం 9 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది.
  • శ్రీశైలం చేరుకొని… రాత్రి అక్కడే బస చేస్తారు.
  • ఇక రెండో రోజు శ్రీశైలం నుంచి బయల్దేరి.. సోమశిల చేరుకుంటారు. ఇక్కడ క్రూజ్ బోట్ ద్వారా జర్నీ ఉంటుంది. బోట్ లో మీల్స్ ఇస్తారు.
  • సాయంత్రం 5 గంటలకు సోమశిల నుంచి హైదరాబాద్ కు బయల్దేరుతారు.
  • రాత్రి 9 గంటల వరకు హైదరాబాద్ చేరుకుంటారు.

సోమశిల టూర్ ప్యాకేజీ ధరలు….

Srisailam Somasila Tour Package Prices 2024: హైదరాబాద్ – శ్రీశైలం – సోమశిల టూరిజం ప్యాకేజీ ధరలు చూస్తే… పెద్దలకు రూ. 4999గా నిర్ణయించారు. పిల్లలకు రూ. 3600గా ఉంది. ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. https://tourism.telangana.gov.in / వెబ్ సైట్ లోకి వెళ్లి డైరెక్ట్ గా టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.

 

WhatsApp channel

టాపిక్

Irctc PackagesIrctcAp TourismTourismTourist PlacesTravelKhammam Lok Sabha ConstituencyKhammamKhammam Assembly ConstituencyEast Godavari
Source / Credits

Best Web Hosting Provider In India 2024