Ali Family: ఇఫ్తార్ విందు చేసిన అలీ.. అతియాస్ కిచెన్‌లో ఫ్యామిలీతో స్టార్ కమెడియన్

Best Web Hosting Provider In India 2024

Actor Ali Atiyas Kitchen: ఏప్రిల్ 5 శుక్రవారం గండిపేట మెయిన్ రోడ్, షాప్ నంబర్ 6లో అతియాస్ కిచెన్‌ని టాలీవుడ్ స్టార్ కమెడియన్, యాక్టర్ ఆలీ గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అలీ సతీమణి జుబెదా ఆలీ సైతం ముఖ్య అతిథిగా విచ్చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న ఆలీ కుటుంబం ఏప్రిల్ 5న ఇఫ్తార్ విందుని అతియాస్ కిచెన్‌లో చేశారు. సాయంత్రపు అల్లా ప్రార్థన అనంతరం హోటల్‌ను ప్రారంభించారు.

అరబిక్ రుచులు

“నాకు షేక్ యూసఫ్, అతియా ఇద్దరూ మలేసియాలో పరిచయం. అక్కడ కూడా వీరికి హోటల్స్ ఉన్నాయి. కానీ ఇండియాలో హైదరాబాద్‌లో కిచెన్ ఓపెన్ చెయ్యాలని ఎప్పుడో అన్నారు. 2023 డిసెంబర్‌లోనే ప్రారంభం అవ్వాలిసింది. కానీ ఇప్పుడు ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. వీరి దగ్గర ఇండో, అరబిక్ రుచులే కాకుండా ఢిల్లీ రుచులు, నెల్లూరు రుచులు కూడా అద్భుతంగా ఉంటాయి అని నటుడు అలీ తెలిపారు.

మెయిన్ సెంటర్‌లో

“మొన్న మా ఇంటికి నెల్లూరు స్టైల్‌లో వంటలు చేసి పంపారు. నిజంగా అద్భుతంగా ఉంది వాటి టేస్ట్” అని అలీ పేర్కొన్నారు. “భోజన ప్రియులకు అతియాస్ కిచెన్ అనేది మంచి వేదిక. నార్త్ ఇండియన్, అరబిక్, వెజ్, నాన్ వెజ్ అన్ని రకాల రుచులు వీరి దగ్గర ఉన్నాయి. మండీ కూడా ఇక్కడ చాలా స్పెషల్, కోకాపేటలో మెయిన్ సెంటర్ లో ఇంత పెద్ద కిచెన్ పెట్టడం నిజంగా హ్యాపీగా ఉంది” అని అలీ సతీమణి, యూట్యూబర్ జుబెదా అలీ అన్నారు.

చిన్న బ్రాండ్

“ఇండియాలో మొదటి సారి మా కిచెన్ లాంచ్ చేస్తున్నాం. మేము అంత పెద్ద బ్రాండ్ కాకపోయినా ఆలీ గారూ లాంటి వ్యక్తి మాకు సపోర్ట్‌గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. ఢిల్లీ ఫ్లేవర్స్‌తో కరీమ్స్ ముఘలై జయకా కూడా ప్రారంభించాం. అతియాస్ కిచెన్ నెల్లూరు ఫ్లేవర్స్ పేరుతో ఇంకో బ్రాంచ్ ఉంది. అందులో టిఫిన్స్, లంచ్, డిన్నర్ అన్ని ఉంటాయి. చిన్న బ్రాండ్ అయినప్పటికీ పెద్ద రెస్టారెంట్ లకి పోటీగా అంతకు మించి రుచిగా మా వంటలు ఉంటాయి” అని అతియాస్ కిచెన్ అధినేత షేక్ యూసఫ్ అహమద్ తెలిపారు.

కామెడీ టైమింగ్‌

“అల్లా దయ వల్ల ఇండియాలో కూడా ఈ కిచెన్‌ను ప్రారంభించాం. ఇక్కడ మన హైదరాబాద్‌లో ఓపెన్ చెయ్యడం చాలా స్పెషల్. ఇండో, అరబిక్ రుచుల కోసం మీరు మా దగ్గరకు రావొచ్చు” అని సంస్థ అధినేత్రి అతియా తమ బ్రాండ్‌ను ప్రచారం చేసుకున్నారు. కాగా అలీ ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

స్వచ్ఛంద సంస్థ

ఇదిలా ఉంటే, ఆలీ బాల నటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. సీతాకోకచిలుక చిత్రం ద్వారా చాలా పాపులర్ అయ్యాడు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు ఆలీకి గౌరవ డాక్టరేట్ ను ప్రకటించారు. ఆలీ తండ్రి పేరు మీదుగా మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024