Spicy Chutney: మినప్పప్పు పచ్చడి… ఓసారి చేసి చూడండి, వేడి వేడి అన్నంలో స్పైసీగా అదిరిపోతుంది

Best Web Hosting Provider In India 2024

Spicy Chutney: మినప్పప్పు పచ్చడి ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా. మినప్పప్పు కేవలం ఇడ్లీలు, దోశలు, గారెలకే కాదు టేస్టీ చట్నీ కూడా చేయొచ్చు. వేడి వేడి అన్నంలో మినప్పప్పు పచ్చడి కలుపుకొని తింటే ఆ రుచి వేరు. ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మీకే నచ్చుతుంది. అలాగే ఇడ్లీలోకి కూడా ఈ మినప్పప్పు పచ్చడి టేస్టీగా ఉంటుంది. స్పైసీగా కావాలనుకునేవారు ఎండుమిర్చిని అధికంగా వేసుకుంటే సరి, ఇక మినప్పప్పు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం.

మినప్పప్పు పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

పొట్టు తీయని మినప్పప్పు – అర కప్పు

ఎండుమిర్చి – ఎనిమిది

మెంతులు – అర స్పూను

నూనె – ఒక స్పూను

జీలకర్ర – ఒక స్పూను

చింతపండు – నిమ్మకాయ సైజులో

ఉప్పు – రుచికి సరిపడా

ఆవాలు – అర స్పూను

వెల్లుల్లి రెబ్బలు – గుప్పెడు

కరివేపాకులు – గుప్పెడు

మినప్పప్పు పచ్చడి రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో మినప్పప్పు వేసి వేయించాలి.

2. ఒక పావు గంటసేపు వేయించాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఆ తర్వాత అదే కళాయిలో జీలకర్ర, ఎండు మిర్చి, మెంతులు, చింతపండు వేసి వేయించాలి.

4. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న దినుసులతో పాటు మినప్పప్పును వేసి, రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త నీళ్లు పోయాలి.

5. ఆ మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.

6. ఆ పచ్చడిని తీసి ఒక గిన్నెలో వేయాలి.

7. స్టవ్ మీద కళాయి పెట్టి మూడు స్పూన్ల నూనె వేసి అందులో ఆవాలు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకోవాలి.

8. ఈ మొత్తం మిశ్రమాన్ని మినప్పప్పు పచ్చడిపై వేయాలి.

9. అంతే టేస్టీ మినప్పప్పు పచ్చడి రెడీ అయినట్టే.

10. ఇది చాలా రుచిగా ఉంటుంది. అన్నంలో తిన్న ఇడ్లీ, దోశల్లో కూడా అదిరిపోతుంది.

మినప పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో గుండెను కాపాడే లక్షణాలు ఉంటాయి. మినప పప్పు తినడం వల్ల నాడీ వ్యవస్థ బలంగా మారుతుంది. ఇది బరువును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఎముకలను గట్టిగా మారుస్తుంది. ఆయుర్వేదంలో కూడా మినప పప్పు గొప్ప తనాన్ని వర్ణించారు.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024