Karimnagar SSC: పది ఫలితాల్లో సత్తా చాటిన కరీంనగర్ విద్యార్థులు..600మందికి 10/10 జిపిఏ, 457 బడుల్లో నూరు శాతం ఉత్తీర్ణత

Best Web Hosting Provider In India 2024

Karimnagar SSC: కరీంనగర్‌ జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో 600 మందికి 10కి 10 జీపిఏ సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 457 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా 600 మంది విద్యార్ధులు 10/10 జీపిఏ సాధించారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 38121 మంది విద్యార్దులు పదో తరగతి పరీక్షలు రాయగా అందులో 36822 మంది విద్యార్ధులు Results ఉత్తీర్ణులై 96.60శాతం ఉత్తీర్ణత సాధించారు. కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ 172 పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించగా 454 మంది విద్యార్ధులు 10 జీపిఏ సాధించారు.

జగిత్యాల జిల్లాలో 101 పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించగా 25 మంది 10 జీపిఏ సాధించారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 135 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించగా 111 మంది 10జీపిఏ సాధించారు. పెద్దపల్లి జిల్లాలో 49 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించగా పది మంది విద్యార్దులు 10 జీపిఏ సాధించారు.

పదో తరగతి ఫలితాల్లో కరీంనగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలవగా, ఈసారి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా గతఏడాది ఏడోస్థానంలో నిలువగా ఈసారి మూడో స్థానం దక్కించుకుంది. జగిత్యాల జిల్లా గత ఏడాది 84శాతం ఉత్తీర్ణత సాధించగా ఈసారి 95.76శాతం ఉత్తీర్ణతతో 11స్థానం దక్కించుకుంది. పెద్దపల్లి జిల్లా పోయిన సారి 9వస్థానం పొందగా ఈసారి 8వ స్థానం పొందాయి.

కరీంనగర్ జిల్లాలో 454 మంది విద్యార్ధులు 10జీఎపి సాధించగా అందులో ప్రైవేట్ పాఠశాల విద్యార్ధులు 374 మంది ఉన్నారు. ఆల్పోర్ విద్యాసంస్థకు చెందిన 135 మంది 10 జీపిఏ సాధించి ఉమ్మడి జిల్లాలో అగ్రస్థానంలో నిలిచింది.

గత ఏడాది పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్ధులు తిరిగి పరీక్షలకు హాజరు కానివారిని ఈ ఏడాది పరీక్షలు రాయించేలా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేసిన కృషి ఫలించింది. ఫెయిల్ అయిన చాలా మంది కొన్నేళ్లుగా తిరిగి పరీక్ష రుసుంలు చెల్లించడంలేదు.

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధుల వివరాలను ప్రధానోపాద్యాయుల ద్వారా సేకరించి వారు పరీక్షలు రాసేలా ప్రోత్సహించారు. కొందరు నిరాకరించినా కలెక్టర్ వారితో ప్రత్యేకంగా మాట్లాడి పరీక్షలు రాయించారు. అలాంటి విద్యార్ధుల పరీక్ష ఫీజు సైతం కలెక్టర్ చెల్లించారు.

మొత్తం పరీక్షలకు దూరంగా ఉంటున్న వారు జిల్లాలో 124 మంది గుర్తించగా, వారిలో 29 మంది పరీక్ష లకు గైర్హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన 95 మంది అభ్యర్థుల్లో 72 మంది ఉత్తీర్ణులుకావడం విశేషం. వారిని కలెక్టర్ పమేలా సత్పతి వారిని ప్రత్యేకంగా అభినందించారు.

IPL_Entry_Point

టాపిక్

Telangana SscExam ResultsKarimnagarEducationTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024