Best Web Hosting Provider In India 2024
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించండి..!
కనగానపల్లి మండలం తగరకుంట గ్రామంలో భారీ జన సందోహం మధ్య తోపుదుర్తి శైలజా రెడ్డి , గంగులు భానుమతి ఎన్నికల ప్రచారం..
అనంతపురం: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి పార్టీకి ఓటు వేసి ఆదరించాలని తోపుదుర్తి శైలజా రెడ్డి కోరారు. కనగానపల్లి మండల కేంద్రంలో స్థానిక నాయకులు, మహిళాలతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరిగి ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధికి సంబందించిన కర పత్రాలను ప్రజలకు అందించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తు వారి బాగోగులు గురించి ఆలోచించే వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్య మంత్రిగా చేసుకోవాలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. టిడిపి అధికారంలో ఉన్న సమయంలో రైతులు, ప్రజలు ఎంత ఇబ్బందిపడ్డారో ఒకసారి ఆలోచన చేసుకోవాలన్నారు. గతంలో ప్రభుత్వ పథకాలు రావాలంటే ఎంత మంది వద్దకు పోయేవారో గుర్తు చేసుకోవాలన్నారు. అదే వైఎస్ జగన్ సిఎం అయిన తరువాత పార్టీలకు, మతలాలకు, కులలాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరిగందని కావున సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మారోమారు ముఖ్యమంత్రి చేసుకుంటేనే పేద ప్రజలు మరింత అభివృద్ధి చెందుతారన్నారు. మీరంత ఎంపి అభ్యర్థి బోయ శాంతమ్మ, ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఇద్దరికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలను కోరారు.