Best Web Hosting Provider In India 2024

నెల్లూరు జిల్లా: సర్వేపల్లిలో టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీని వీడి టీడీపీ శ్రేణులు వైయస్ఆర్‌సీపీకి జై కొడుతున్నారు. పార్లపల్లి మాజీ సర్పంచ్ కాకులూరు శ్రీనివాసులు టీడీపీకి రాజీనామా చేసి వైయస్ఆర్‌సీపీలో చేరారు. సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, పార్లపల్లి గ్రామం మాజీ సర్పంచ్ కాకులూరు శ్రీనివాసులుతో పాటు కీలక నేతలు మంత్రి కాకాణి సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
“నీరు చెట్టు, రైతు రథం, నకిలీ ఎరువులు, విత్తనాలు,ధాన్యం కొనుగోళ్లలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి సోమిరెడ్డి తమకు అన్యాయం చేశాడంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సోమిరెడ్డి 10 తరాలకు సరిపడా దోచుకున్నాడని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని సర్వేపల్లిని లూటీ చేశాడని విమర్శించారు. సోమిరెడ్డికి అవినీతి తప్ప అభివృద్ధి చేతకాదని, సోమిరెడ్డి జన్మలో గెలవలేడని సొంత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జోస్యం చెబుతున్నారు.
మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని 50 వేల పైచిలుకు భారీ మెజారిటీతో 3వ సారి శాసనసభ్యునిగా చేసుకునేందుకు మేమంతా సిద్ధమని నియోజకవర్గ ప్రజలు నినదిస్తున్నారు.