Best Web Hosting Provider In India 2024
AP LAWCET 2024 Updates : ఏపీ లాసెట్ – 2024 దరఖాస్తుల గడువు దగ్గరపడింది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఇవాళ్టితో(మే 4)నే అప్లికేషన్ల సమయం ముగియనుంది. https://cets.apsche.ap.gov.in/LAWCET/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.
ఏపీ లాసెట్ – 2024(AP LAWCET ) ప్రవేశ పరీక్ష ద్వారా…. మూడేళ్లు, ఐదేళ్ల లా డిగ్రీలతో పాటు రెండేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఈ ఏడాదికి సంబంధించిన ప్రవేశ పరీక్షను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(Acharya Nagarjuna University) నిర్వహిస్తోంది.
జూన్ 09వ తేదీన ఏపీ లాసెట్ 2024 పరీక్ష జరగనుంది. ఇక రూ. 500 ఆలస్య రుసుంతో మే 5 నుంచి మే 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 30వ తేదీ నుంచి కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది. జూన్ 1వ తేదీ వరకు ఈ అవకాశం ఉంటుంది. జూన్ 3వ తేదీ నుంచి లాసెట్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
How to apply AP LAWCET 2024 : ఏపీ లాసెట్ అప్లికేషన్ ప్రాసెస్
- అర్హత గల అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/LAWCET/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే registration అనే లింక్ పై క్లిక్ చేయాలి.
- ముందుగా అప్లికేషన్ ఫీజును చెల్లించాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్ ఓపెన్ చేసి మీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- చివరగా సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
- దరఖాస్తు కాపీని ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి పొందవచ్చు.
- రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది.
ఏపీ లాసెట్ దరఖాస్తు ఫీజు వివరాలు :
- ఏపీ లాసెట్ – 2024లో భాగంగా మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల కోసం రిజిస్ట్రేషన్(AP Lawcet Registration) ఓసీ అభ్యర్థులు రూ.900 ఫీజును చెల్లించారి.
- బీసీ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీలు రూ.800 చెల్లించాలి.
- పీజీ కోర్సులకు(LLM) ఓసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. బీసీ అభ్యర్థులు రూ.950, ఎస్సీ, ఎస్టీలు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది.
- కేవలం ఆన్ లైన్ పేమెంట్ విధానంలో వీటిని చెల్లించాలి.
- రూ.1000 ఆలస్య రుసుముతో మే 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- రూ.2 వేల ఆలస్య రుసుముతో మే 25 వరకు, రూ.3 వేల ఆలస్య రుసుముతో మే 29 వరకు అభ్యర్థులు ఏపీ లాసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఏపీ లాసెట్ ప్రవేశ పరీక్షలు జూన్ 9వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.00 గంటల వరకు నిర్వహిస్తారు.
- అధికారిక వెబ్ సైట్ – https://cets.apsche.ap.gov.in/LAWCET/
Direct link to apply for AP LAWCET 2024: ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ లాసెట్ – 2024కు డైరెక్ట్ గా దరఖాస్తు చేసుకోవచ్చు.
టాపిక్