Best Web Hosting Provider In India 2024
Kamakshi Bhaskarla: హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన మా ఊరి పొలిమేర 2 కమర్షియల్‌గా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో లచ్చిమిగా డీ గ్లామర్ పాత్రలో యాక్టింగ్‌తో మెప్పించింది కామాక్షి భాస్కర్ల. మా ఊరి పొలిమేర తో పాటు సీక్వెల్ నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
దూత దెబ్ సిరీస్…
తాజాగా తెలుగులో కామాక్షి భాస్కర్ల మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నాగచైతన్య లీడ్ రోల్‌లో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన దూత వెబ్‌సిరీస్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌ను పంచింది. ఓ జర్నలిస్ట్ జీవితంలో అదృశ్య శక్తి క్రియేట్ చేసిన అలజడిని ఉత్కంఠభరితంగా ఈ సిరీస్‌లో ఆవిష్కరించారు డైరెక్టర్. ఓటీటీలో దూత హిట్టయింది.
మిస్టరీ థ్రిల్లర్…
దూత రిజల్ట్ నేపథ్యంలో మరో వెబ్‌సిరీస్ చేసేందుకు నాగచైతన్య, డైరెక్టర్ విక్రమ్ కుమార్ సన్నాహాలు చేస్తోన్నట్లు సమాచారం. ఇది దూతకు కొనసాగింపే అయినా కంప్లీట్‌గా స్టోరీ, బ్యాక్‌డ్రాప్ కొత్తగా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ను విక్రమ్ కే కుమార్ తెరకెక్కించబోతున్నట్లు చెబుతోన్నారు.
ఇంపార్టెంట్ రోల్…
నాగచైతన్య, విక్రమ్ కే కుమార్ వెబ్‌సిరీస్‌లో కామాక్షి భాస్కర్ల ఓ ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్లు సమాచారం. దూతలో కామాక్షి భాస్కర్ల నటించింది. కథను ముందుకు నడిపించే ఓ చిన్న రోల్‌లో మెరిసింది. నాగచైతన్య, విక్రమ్ కే కుమార్ కొత్త వెబ్‌సిరీస్‌లో కామాక్షి భాస్కర్ల కనిపించబోతున్నట్లు సమాచారం. దూతకు మంచి ఆమె క్యారెక్టర్‌కు మరింత ప్రాధాన్యత ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. లెంగ్త్ కూడా ఎక్కువే ఉంటుందని అంటున్నారు. ఈ ఏడాది ఈ సిరీస్ సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
మా ఊరి పొలిమేర 2కు అవార్డ్…
కాగా మా ఊరి పొలిమేర 2 సినిమాకుగాను ఇటీవల ప్రకటించిన దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటిగా కామాక్షి భాస్కర్ల అవార్డును అందుకున్నది. ఈ అవార్డు రావడంపై కామాక్షి భాస్కర్ల ఆనందం వ్యక్తం చేసింది. పొలిమేర 2 చేస్తున్నప్పుడే సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే అనుకున్నానని, అయితే నటిగా నాకు అవార్డులు తెచ్చిపెడుతుందని ఊహించలేదని కామాక్షి భాస్కర్ల అన్నది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు తన మనసులోప్రత్యేకంగా నిలిచిపోతుందని అన్నది.
ప్రియురాలుతో టాలీవుడ్ ఎంట్రీ…
ప్రియురాలు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కామాక్షి భాస్కర్ల, విరూపాక్ష, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్, రౌడీ బాయ్స్ తో పాటు ఇటీవల రిలీజైన ఓం భీమ్ బుష్‌లో ఇంపార్టెంట్ రోల్స్ చేసింది.
దూతతో పాటు ఝాన్సీ, సైతాన్ వెబ్‌సిరీస్‌లలో నటించింది. గ్లామర్ కంటే యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలే ఎక్కువగా చేస్తోంది. మా ఊరి పొలిమేర 3లో కూడా కామాక్షి భాస్కర్లనే హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. స్వతహాగా డాక్టర్ అయిన కామాక్షి భాస్కర్ల యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో సినిమాల్లోకి అడుగుపెట్టింది.
టాపిక్