Best Web Hosting Provider In India 2024
సౌందర్య సంరక్షణ మీ చర్మాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. మీకు తరచుగా ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారం వెతుక్కోవడానికి శ్రద్ధ చూపలేం. ఎక్కువగా సమయం కేటాయించలేం. చాలా మంది అందం కోసం అనేక ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోతారు. అనేక చర్మ సమస్యల నుండి బయటపడటానికి, అందం కోసం మనం సహజ పద్ధతులను ఉపయోగించవచ్చు. ఇది స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దానికోసం కలబంద, వేపను ఉపయోగించండి.
కలబంద, వేప వాడడం వల్ల చర్మంలో వచ్చే మార్పులు తక్కువేమీ కాదు. గ్లోయింగ్ స్కిన్ పొందడానికి మనం ఎన్నో మార్గాలు వెతుకుతున్నా కలబంద, వేప మిశ్రమం దీనికి పరిష్కారం. ఇది చర్మానికి అనేక విధాలుగా సహాయపడుతుంది. దీని వల్ల చర్మంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం.
సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు
చర్మ సంరక్షణ విషయంలో కలబంద గొప్ప మార్పులను చేస్తుంది. ఇది మీ చర్మంలో చేసే మార్పు చిన్నది కాదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనేది వాస్తవం. కలబందను మీకు నచ్చినట్టుగా వాడుకోవచ్చు. మాయిశ్చరైజింగ్, పొడి చర్మాన్ని నయం చేయడం, మొటిమలను నియంత్రించడం, మొటిమల మచ్చలను తగ్గించడం కోసం కలబందను క్రమం తప్పకుండా ఉపయోగించవచ్చు. ఇది క్లెన్సర్లు, మాయిశ్చరైజర్లు, సీరమ్స్, జెల్, మాస్క్‌లలో ఉపయోగించబడుతుంది.
మెుటిమలు తొలగిస్తుంది
కలబందతోపాటుగా వేప మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది మొటిమల మచ్చలను పూర్తిగా తొలగిస్తుంది. దీనితో పాటు, ఇది అన్ని చర్మ సమస్యలను పరిష్కరించడంలో కూడా సహాయపడుతుంది. వేప, కలబంద మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల చర్మంపై వచ్చే మార్పు చిన్నదేమీ కాదు. ఈ మిశ్రమాన్ని చర్మానికి ఎలా ఉపయోగించాలో చూద్దాం.
కలబందను చర్మ సంరక్షణకు ఉపయోగించినప్పుడు, దాని వల్ల చర్మంలో ఎన్నో మార్పులు వస్తాయి. అయితే దీన్ని చర్మానికి ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోవాలి. అందుకు కొద్దిగా కలబంద, కొద్దిగా వేప ఆకుల పొడిని బాగా కలుపుకోవచ్చు. దీన్ని పేస్టులా చేసి ఫ్రిజ్‌లో పెట్టి తర్వాత ముఖానికి రాసుకోవచ్చు.
రాత్రిపూట వాడండి
రాత్రిపూట మీ ముఖాన్ని శుభ్రపరిచిన తర్వాత, మీ ముఖంపై కలబంద, వేప మిశ్రమాన్ని అప్లై చేయండి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేయవచ్చు. సాధారణ మాయిశ్చరైజర్ వాడండి. దీన్ని ఉపయోగించడం వల్ల చర్మంలో మంచి మార్పులు వస్తాయి. మీరు కనీసం వారానికి రెండుసార్లు ఈ మాస్క్‌ను ఉపయోగించవచ్చు.
ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగిస్తే మీరు మార్పును గమనించవచ్చు. మీ బుగ్గలు చూస్తే మార్పు కనిపిస్తుంది. చర్మం చాలా మృదువుగా మారుతుంది. అంతేకాదు చర్మంలో వచ్చే మార్పు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ మిశ్రమం మీ చర్మ రంద్రాల పరిమాణాన్ని తగ్గించడంలో, మీ చర్మాన్ని క్లియర్‌గా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
అయితే మీరు మార్కెట్లో దొరికే వేప పొడి కాకుండా.. ఇంట్లోనే తయారుచేసుకోవడం ఇంకా మంచిది. కొన్ని వేప ఆకులను తీసుకొచ్చి ఎండబెట్టండి. తర్వాత వాడిని గ్రైండ్ చేసుకోండి. ఇవి సహజంగా ఉంటాయి. ఇందులో కలబంద జెల్ కలిపి తర్వాత మిక్సీ పట్టాలి. సహజంగా తయారుచేసే ఈ మిశ్రమంతో మీ ముఖం మెరిసిపోతుంది. అందంగా కనిపిస్తారు. మీకు అలెర్జీలాంటి సమస్యలు ఉంటే మాత్రం నిపుణుల సలహా మేరకే ఈ ఫేస్ ప్యాక్ ప్రయత్నించండి.