AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Best Web Hosting Provider In India 2024

AP Weather : ఏపీలో ఎండలు (Summer Heat)చాలా తీవ్రంగా ఉన్నాయి. పగటి పూట బయటకు వచ్చేందుకు జనం భయపడుతున్నారు. ఆదివారం 30 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 247 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. సోమవారం 15 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 69 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

మంగళవారం భారీ వర్షాలు

మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగుల(Thunderstorm)తో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడుతుందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండవదని సూచించారు.

తీవ్ర వడగాల్పులు వీచే మండలాలు

రేపు(మే 5) శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో 4 మండలాలు, విజయనగరం 12, పార్వతీపురంమన్యం 13, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

రేపు వడగాల్పులు(Heat Wave) వీచే అవకాశం ఉన్న మండలాలు (247) :

  • శ్రీకాకుళం 15,
  • విజయనగరం 12,
  • పార్వతీపురంమన్యం 2,
  • అల్లూరిసీతారామరాజు 5,
  • విశాఖ 1,
  • అనకాపల్లి 12,
  • కోనసీమ 1,
  • కాకినాడ 10,
  • తూర్పుగోదావరి 14,
  • ఏలూరు 7,
  • కృష్ణా 5,
  • ఎన్టీఆర్ 13,
  • గుంటూరు 14,
  • పల్నాడు 27,
  • బాపట్ల 3,
  • ప్రకాశం 23,
  • నెల్లూరు 24, కర్నూలు 10, అనంతపురం 1, శ్రీసత్యసాయి 1, వైయస్సార్ 19, అన్నమయ్య 10, తిరుపతి 17, చిత్తూరు విజయపురం ఒక మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

43°C కు పైగా ఉష్ణోగ్రతలు 14 జిల్లాలో నమోదు

శనివారం ప్రకాశం(Prakasam) జిల్లా దరిమడుగు(Darimadugu)లో 47.5°C, వైయస్సార్ జిల్లా కలసపాడులో 46.4°C, నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో 46.2°C, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో 46.1°C, కర్నూలు(Kurnool) జిల్లా వగరూరులో 45.7°C, పల్నాడు జిల్లా విజయపురిసౌత్ లో 45.4°C, అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో 44.9°C, తిరుపతి జిల్లా మంగనెల్లూరు, అనంతపురం జిల్లా హుస్సేన్ పురంలో 44.8°C, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో 44.7°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. 43°C కు పైగా ఉష్ణోగ్రతలు(Temperatures) 14 జిల్లాలో నమోదైనట్లు చెప్పారు. అలాగే 28 మండలాల్లో తీవ్రవడగాల్పులు(Severe Heat Wave),187 మండలాల్లో వడగాల్పులు(Heat Wave) వీచాయన్నారు.

ఈ సమయంలో బయటకు రావొద్దు

ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండదెబ్బ(Sun Stroke) తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించారు. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్

WeatherSummerAp RainsAndhra Pradesh NewsHeatwave NewsTrending Ap
Source / Credits

Best Web Hosting Provider In India 2024