Aha OTT: ఓటీటీలో ఆహా అనిపించే 3 సినిమాలు.. అన్ని ఒకేదాంట్లో ఒకే రోజు నుంచి స్ట్రీమింగ్.. మీరు చూశారా?

Best Web Hosting Provider In India 2024

OTT Movies In Aha: ఇండియావ్యాప్తంగా ఎన్నో రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. వాటిలో కేవలం తెలుగులో ఉన్న డిజిటల్ స్ట్రీమింగ్ వేదికలు చాలా అరుదు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఓటీటీ వేదికగా బాగా పాపులర్ అయిన డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహా. విభిన్నమైన కంటెంట్‌ను తెలుగులోనే అందిస్తూ అనేక సబ్‌స్క్రైబర్స్‌ను పొందింది ఆహా ఓటీటీ.

ప్రతివారం అనే కాకుండా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో ఉన్న సినిమాలను తెలుగు భాషలో స్ట్రీమింగ్‌కు తెస్తోంది. అలా మే 3న ఒకే రోజు ఆహా అనిపించే మూడు క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో రెండు బోల్డ్ కంటెంట్‌తో ఉంటే మూడోది క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో ఉంది. మరి అవేంటో చూడండి.

సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ

బాల నటుడుగా సినీ కెరీర్ మొదలు పెట్టి హీరోగా మారిన దీపక్ సరోజ్ నటించిన సినిమా సిద్ధార్థ్ రాయ్. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా తరహాలో వచ్చిన ఈ మూవీకి సూపర్ బజ్ క్రియేట్ అయింది. ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది.

టాప్ 4లో ట్రెండింగ్

ఆహా ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్ మూవీ మే 3 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఇష్టపడని ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో వీక్షించేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అందుకే ఈ సినిమా స్పెషల్‌గా మారింది. అలాగే ఈ సినిమా ఆహా ఓటీటీలో టాప్ 4 స్థానంలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. దీనికి ఐమ్‌డీబీ రేటింగ్‌ పదికి 9.3 ఉండటం విశేషం.

అసుర గురు ఓటీటీ

అసుర గురు మూవీ 2020లో తమిళంలో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్. రాజ్ దీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దొంగతనాల నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు, మహిమా నంబియార్ హీరో హీరోయిన్లుగా నటించగా.. సుబ్బరాజు, యోగి బాబు, నాగినీడు కీలక పాత్రలు పోషించారు. మార్చి 13 2020లో విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది.

ఆరో స్థానంలో ట్రెండింగ్

ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత తెలుగులో ఓటీటీలోకి వచ్చేసింది అసుర గురు మూవీ. మే 3 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న అసుర గురు సినిమా ట్రెండింగ్ జాబితాలో ఆరో స్థానంలో ఉంది. దొంగతనం, లవ్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

హ్యాపీ ఎండింగ్ ఓటీటీ

యంగ్ హీరో యష్ పూరి నటించిన బోల్డ్ కంటెంట్ సినిమా హ్యాపీ ఎండింగ్. అపూర్వ రావ్ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాకు కౌశిక్ భీమిడి డైరెక్షన్ చేశారు. ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పురణాల్లో ప్రాముఖ్యత పొందిన శాపాలు ఒక కుర్రాడికి వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది.

అడల్ట్ కామెడీ జోనర్‌

యూనిక్ కాన్సెప్ట్‌తో అడల్ట్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ హ్యాపీ ఎండింగ్ సినిమా ఆహాలో మే 3 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ప్రేక్షకాదరణకు నోచుకోని ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఆహా టాప్ ట్రెండింగ్ సినిమా జాబితాలో ఏడో స్థానంలో దూసుకుపోతోంది.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024