Gam Gam Ganesha: ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే మంచి క్రైమ్ కామెడీ మూవీ: డైరెక్టర్

Best Web Hosting Provider In India 2024

Anand Devarakonda Gam Gam Ganesha: బేబి సినిమాతో మంచి విజయం అందుకున్న ఆనంద్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గం గం గణేశా. ఈ సినిమాతో దర్శకుడిగా ఉదయ్ శెట్టి టాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. మే 31న గం గం గణేశా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగానే మల్లారెడ్డి కాలేజీలో సినిమాలోని పిచ్చిగా నచ్చేశావే పాటను విద్యార్థుల మధ్య రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్‌లో పాల్గొన్న ఆనంద్ దేవరకొండ, నయన్ సారిక, వంశీ కారుమంచి, ఉదయ్ శెట్టి, చేతన్ భరద్వాజ్, కృష్ణ చైతన్య, జబర్దస్త్ ఇమ్మాన్యూయేల్, సురేష్ బనిశెట్టి, అనురాగ్ కులకర్ణి తదితరులు పాల్గొని స్పీచ్ ఇచ్చారు.

“మీ అందరి ఎనర్జీ చూస్తుంటే ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్‌లో చేయబోయే సందడి కనిపిస్తోంది. మా గం గం గణేశా మూవీ నుంచి పిచ్చిగా నచ్చేశావే సాంగ్‌ను మీ అందరి మధ్య రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. మా టీమ్‌పై మీరు చూపిస్తున్న లవ్‌కు థ్యాంక్స్” అని నటుడు కృష్ణ చైతన్య అన్నారు.

“మిమ్మల్ని చూస్తుంటే నా కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి. గం గం గణేశా సినిమాకు మంచి మ్యూజిక్ చేశాం. హిట్ సాంగ్స్ కోసం కష్టపడి పనిచేశాం. సినిమా మీద మేమంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మీ అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది” అని సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ తెలిపారు.

“గం గం గణేశా ఒక మంచి క్రైమ్ కామెడీ మూవీ. మీరు మీ ఫ్యామిలీస్‌తో కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. మా మూవీని మిస్ కాకండి” అని డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్న ఉదయ్ శెట్టి చెప్పుకొచ్చారు. “పిచ్చిగా నచ్చేశావే పాట నచ్చిందా. మీకు మా పాట నచ్చితే రీల్స్ చేయండి. సోషల్ మీడియా ద్వారా మాకు ట్యాగ్ చేయండి. గం గం గణేశా సినిమా లవ్, రొమాన్స్, యాక్షన్, హార్ట్ బ్రేక్ అన్నీ ఉంటాయి. మీరంతా థియేటర్స్‌కు వెళ్లి మా మూవీని చూడాలని కోరుతున్నా” అని హీరోయిన్ నయన్ సారిక తెలిపింది.

కాగా “పిచ్చిగా నచ్చేశావే” పాటను హీరో హీరోయిన్లు ఆనంద్ దేవరకొండ,‌ నయన్ సారిక మధ్య రొమాంటిక్ లవ్ సాంగ్‌గా రూపొందించారు. ఈ పాటకు చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించగా సురేష్ బనిశెట్టి సాహిత్యాన్ని అందించారు. అనురాగ్ కులకర్ణి పాడారు.

పిచ్చిగా నచ్చేశావే రంగు తూనీగా, కళ్లల్లో జల్లేశావే రంగులన్నీ భలేగా, పిచ్చిగా నచ్చేశావే రంగు తూనీగా జంటగా వచ్చేశానే అందుకనేగా, మనసే పట్టి పట్టి మాయలోకి నెట్టేశావే, ప్రేమ గట్టి గట్టి కంకణంలా కట్టేశావే, నీ మువ్వల పట్టి గుండెకు కట్టి మోగించేశావే, ఆ కాటుక పెట్టి కవితలిట్టే రాయించేశావే.. అంటూ మంచి బీట్‌తో సాగుతుందీ పాట.

పాట పిక్చరైజేషన్, పాటలో ఆనంద్ డ్యాన్స్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. సరికొత్త స్క్రీన్ ప్రెజెంటేషన్‌తో థియేటర్స్‌లోకి వస్తోంది గం గం గణేశా సినిమా. ఈ సినిమా కామెడీ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కినట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024