Best Web Hosting Provider In India 2024
Krishna mukunda murari serial today may 6th episode: మురారి పరిమళ ద్వారా తన బిడ్డని మోసే సరోగేట్ మథర్ ఎవరో తెలుసుకోవాలని అనుకుంటాడు. డాక్టర్ తో మాట్లాడతాడు. మధుని వెంటనే తన రూమ్ ఖాళీ చేసి కృష్ణ వాళ్ళకి ఇవ్వమని అంటాడు. అప్పుడే కృష్ణ వస్తే డాక్టర్స్ ఏమన్నారని భవానీ అడుగుతుంది.
మురారికి చీవాట్లు
మురారి ఎక్కడ ఉన్నాడని అంటే వేరే పని ఉంటే ఆగిపోయాడని క్యాబ్ లో వచ్చేశానని చెప్తుంది. కడుపుతో ఉన్న నిన్ను ఎలా ఒంటరిగా వదిలేస్తాడని వెంటనే మురారికి ఫోన్ చేసి చెడామడా తిట్టేస్తుంది. భవానీ కృష్ణ కడుపుతో ఉందని తెగ హడావుడి చేస్తుంది.
మూడో నెల అయినా తొమ్మిదో నెల అయినా ఒకటే అని కృష్ణకి తెలుసు కానీ కృష్ణకి చెప్పలేదని ముకుంద మనసులో అనుకుంటుంది. పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఉండాలని ఏదైనా పూజ చేయిద్దామని కృష్ణ అంటుంది. కృష్ణ మీద భవానీ చూపిస్తున్న ప్రేమ చూసి ఆదర్శ్ ఫేస్ చిరాకుగా మొహం పెడతాడు.
రజిని టెన్షన్ గా ఆలోచిస్తుంటే కృష్ణ వచ్చి ఏమైందని అడుగుతుంది. సమస్య ఏంటో చెప్పమని కృష్ణ అంటుంది. రజిని మాత్రం ఏదేదో వాగేస్తుంది. నా కూతురికి పెళ్లి చేయాలని అదే తన బాధ అంటుంది. మంచి సంబంధం వస్తుందని కృష్ణ అంటుంది.
మీరా డబుల్ గేమ్ ఆడుతుంది
మంచి సంబంధం కాదు నీలాగా నా కూతురు ఈ ఇంటి కోడలు కావాలి. అప్పుడే ఆదర్శ్ తో పెళ్లి జరగాల్సింది వదిన వాళ్ళకు కూడా ఇష్టమే కానీ ముకుందని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఒక్క రోజైన సంతోషంగా ఉన్నాడా అంటే పెళ్ళైన రెండో రోజే సన్యాసం తీసుకున్నట్టు హిమాలయాలకు వెళ్ళిపోయాడు.
ఇప్పుడైనా నా కూతురితో పెళ్లి జరిపిస్తారని ఆశతో వస్తే అది జరగడం లేదని అంటుంది. పెద్దత్తయ్యతో మాట్లాడా కదా ఆలోచిస్తానని అన్నారు అంటుంది. ఆదర్శ్ నా కూతురు మొహం కూడా చూడటం లేదు మీరా ఉంది కదా దాని చుట్టూ తిరుగుతున్నాడని అంటుంది.
తనకు ఇష్టమైన ముకుంద పేరు మీరాకి పెట్టాడు కదా. ఇక మీరా అంటే ఇష్టం అనేందుకు ఇంతకంటే రుజువు ఇంకేం కావాలని రజిని అనేస్తుంది. అది కూడా ఆదర్శ్ చుట్టూ తిరుగుతుందని అంటే నువ్వు పొరపాటు పడుతున్నావ్ అందరితో అలాగే ఉంటుందని కృష్ణ చెప్తుంది.
ఆదర్శ్ తో నా కూతురు పెళ్లి చేస్తావా?
మీరా కూడా ఇదే చెప్పింది నా కూతురికి ఆదర్శ్ తో పెళ్లి చేయాలని అనుకుంటున్నా నువ్వేమైన ఆదర్శ్ వెంట పడుతున్నావా అని అడిగాను. నీ కూతురికి, ఆదర్శ్ కి పెళ్లి చేసే బాధ్యత నాది అని మాట కూడ ఇచ్చిందని చెప్తుంది. కృష్ణ ఆశ్చర్యపోతూ ఇదెప్పుడు జరిగిందని అంటుంది.
మేము వచ్చినప్పుడే జరిగిందిలే. కానీ అది మాత్రం ఆదర్శ్ తో రాసుకుపూసుకుని తిరుగుతుంది. డబుల్ గేమ్ ఆడుతుందని రజిని అనేస్తుంది. కృష్ణ తన మాటలకు షాక్ అయిపోతుంది. మీరా ఇలా చేస్తుందని అసలు ఊహించలేదని కృష్ణ అంటుంది. నేను తనని నమ్మి మోసపోయాను.
నువ్వే ఎలాగైనా ఆదర్శ్ తో నా కూతురు పెళ్లి జరిగేలా చూడమని కృష్ణ చేతులు పట్టుకుని రజిని అడుగుతుంది. ఈ పెళ్లి జరగపోతే నేను నా కూతురు ఏమైపోతామో అంటుంది. మీరా చాలా మంచిదని అనుకున్నాను ఇలా ఎందుకు డబుల్ గేమ్ ఆడుతుందని కృష్ణ అనుమానిస్తుంది.
సరోగసి మథర్ మాకు దేవత
మురారి హాస్పిటల్ లో టెన్షన్ గా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఇటు ఇంట్లో కృష్ణ కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే మురారికి ఫోన్ చేస్తుంది. అసలు పని ఏమైంది ఆవిడ ఎవరో తెలిసిందా అని కృష్ణ ఆత్రంగా అడుగుతుంది. కాసేపటిలో తెలుస్తుందని ఓపిక పట్టమని అంటాడు.
ముకుంద హాస్పిటల్ కి వస్తే ఏంటి ఇక్కడ అని అడుగుతాడు. ఏదో కథ అల్లి చెప్తుంది. సరోగసి మథర్ గురించి తెలుసుకోవాలని కృష్ణ ఆశ తన కోరిక తీర్చడం కోసం పరిమళతో ఫోన్ చేయించి డీటైల్స్ తెలుసుకోవాలని ఉన్నాను. అటెండర్ ఇప్పుడే ఫైల్ తీసుకుని వచ్చాడు ఆమె ఎవరో తెలుసుకుని వస్తానని వెళ్లబోతుంటే ముకుంద ఆపుతుంది.
ఆవిడ ఎవరో తెలుసుకుని ఏం చేస్తారని ముకుంద అడుగుతుంది. ఆవిడ ఎవరో తెలిస్తే కృష్ణ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటుంది. మా బిడ్డని తొమ్మిది నెలలు మోయబోతున్న ఆవిడ మాకు దేవతతో సమానం నెత్తిన పెట్టుకుని చూసుకుంటామని అంటాడు.
నీ ప్రేమ కోసమే మురారి
మా బిడ్డని మోసేది అంటే మా ప్రాణం మోస్తున్నట్టే చాలా కేరింగ్ గా చూసుకుంటామని చెప్తాడు. వెంటనే ముకుంద మురారి తల మీద చెయ్యి పెట్టి మీ బిడ్డని మోసే ఆ సరోగసి మథర్ ని నేనే అంటుంది. మురారి ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటాడు.
అసలు నువ్వు ఎందుకు ఇంత పిచ్చి నిర్ణయం తీసుకున్నావని అడుగుతాడు. మీ ప్రేమని పొందటం కోసం ఏం చేసినా తక్కువే కదా అంటుంది. నువ్వు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావని అంటాడు. చెప్పాను కదా మీ ప్రేమ కోసమని అంటుంది. ఏంటి అంటే మీ కుటుంబం కోసమని మాట మార్చేస్తుంది.
ఇదేదో ఆశించి చేస్తుంది కాదు ఇది నా బాధ్యత. ఏ దిక్కు లేని నాకు మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి మీ ఇంటి మనిషిని చేసుకున్నారు. మీ రుణం కొంచెమైన తీర్చుకుందామని ఇలా చేశాను కాదనొద్దు అంటుంది. నా కంటే మీ బిడ్డని బాగా చూసుకునే అమ్మాయి మీకు దొరకదు కదా.
నిన్ను నా వాడిని చేసుకుంటా
నా కడుపులో పెరగడం అంటే కృష్ణ కడుపులో పెరగడమే. సరోగసి మథర్ ఎవరని ఎంతగా ఎదురుచూస్తుంది వెంటనే ఇంటికి వెళ్ళి తనకి చెప్పమని చెప్తుంది. ముకుందలా ఉన్నప్పుడు ఎప్పుడు మురారికి దగ్గర అవాలని ఎదురుచూశాను. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది.
నా కడుపులో పెరగబోయే బిడ్డ కోసం నాకు దగ్గర అవుతాడు. నా బిడ్డ మీద ప్రేమ చూపిస్తాడు. అది నా మీద ప్రేమగా మలుచుకుని మురారిని నా వాడిని చేసుకుంటానని ముకుంద తెగ ఆనందపడుతుంది. మురారి తనలో తానే తెగ మురిసిపోతాడు.
మురారి తనని కారులో పక్కన కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్తే బాగుండని ముకుంద అనుకుంటుంది. అప్పుడే మురారి మీరాని పిలుస్తాడు. తన పిలుపు విని తెగ మురిసిపోతుంది. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
తరువాయి భాగంలో..
సీరియల్ లోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. భవానీ స్నేహితురాలు అమృత ఇంటికి వస్తుంది. తను డాక్టర్ అమెరికాలో ఉంటుంది. ఇక్కడ తన పిల్లల్ని చూడటానికి వచ్చింది. నిన్ను ఇప్పుడు టెస్ట్ చేసి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చేపతుందని అనేసరికి కృష్ణ, మురారి షాక్ అవుతారు.