Best Web Hosting Provider In India 2024
AP IIIT Admissions : ఆంధ్రప్రదేశ్ లోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్(AP RGUKT Notification 2024) విడుదలైంది. 2024-25 విద్యాసంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో (B.Tech Courses)ప్రవేశాలకు ఆర్జీయూకేటీ(AP RGUKT) అప్లికేషన్లు ఆహ్వానించింది. ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు https://www.rgukt.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏపీలోని నూజివీడు, ఇడుపుల పాయ, ఒంగోలు, శ్రీకాకుళంలో ట్రిఫుల్ ఐటీ క్యాంపస్ లు ఉన్నాయి. వీటిల్లో బీటెక్ ప్రవేశాలకు ఏపీ ఆన్ లైన్ సెంటర్లు(AP Online) లేదా యూనివర్సిటీ వెబ్ సైట్ www.rgukt.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రాధాన్యత
ఏపీలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ల(AP IIIT Campuses)లో ఉన్న 4,400 సీట్ల భర్తీకి ఆర్జీయూకేటీ నోటిఫికేషన్ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలతో నోటిఫికేషన్ ఆర్జీయూకేటీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనుంది. ట్రిపుల్ ఐటీల్లోని మొత్తం సీట్లలో ఏపీ విద్యార్థులకు 85 సీట్లు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు ఏపీతో పాటు తెలంగాణ విద్యార్థులు పోటీపడవచ్చు. ఓపెన్ మెరిట్ (Open Merit)జాబితాలో ఈ సీట్లను ఏపీ, తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రివేషన్ స్కోర్ తో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జులై నుంచి ట్రిపుల్ ఐటీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి.
రేపట్నుంచి ఏపీఈఏపీసెట్ హాల్ టికెట్లు
ఏపీ ఈఏపీసెట్-2024 హాల్ టికెట్లు(AP EAPCET Hall Tickets) మే 7న విడుదల కానున్నాయి. ఈఏపీసెట్ పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తుంది. మే 16 నుంచి 23 వరకు ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఈఏపీసెట్ ను జేఎన్టీయూ కాకినాడ(Jntu Kakinada) నిర్వహించనుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రైవేట్, అన్ ఎయిడెడ్ , అనుబంధ కాలేజీల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్-2024 నిర్వహిస్తున్నారు. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏపీలోని కాలేజీల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్(Agriculture), ఫార్మసీ(Pharmacy Courses) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్-2024కు 3,54,235 మంది అప్లై చేసుకున్నారు. ఈ ఏడాది నిర్ణీత గడువులోగా 3,54,235మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఈఏపీ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశపరీక్షకు 2,68,309 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు 84,791 మంది, రెండు విభాగాల్లో 1135 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈఏపీ సెట్(AP EAPCET Applications) దరఖాస్తుదారుల సంఖ్య పెరిగింది.
సంబంధిత కథనం
టాపిక్