Best Web Hosting Provider In India 2024
Kannappa Prabhas: కన్నప్ప.. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మరో పాన్ ఇండియా మూవీ. మంచు విష్ణు కన్నప్పగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ అతిథి పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అతడు నందీశ్వరుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్
మరి ప్రభాస్ ఈ కన్నప్ప షూటింగ్ లో చేరేది ఎప్పుడు? ఈ ఏడాది వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రెబల్ స్టార్.. ఈ కన్నప్ప మూవీ కోసం కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఇచ్చాడట. అంతేకాదు మే రెండో వారంలోనే ఈ మూవీ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొననున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే.
ఈ మధ్యే ఓఎంజీ2 మూవీలో అదే శివుడి పాత్రలో నటించిన అక్షయ్.. ఇప్పుడు మరోసారి అదే లుక్ లో కనువిందు చేయనున్నాడు. ఈ మధ్యే హైదరాబాద్ వచ్చి మంచు మోహన్ బాబు, విష్ణులను కూడా కలిశాడు. ఆ సందర్భంలోనే అక్షయ్ తమ కన్నప్ప మూవీలో నటించబోతున్నట్లు మంచు విష్ణు అధికారికంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
తాజాగా అక్షయ్ కుమార్ తన సీన్లకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ మేరకు అక్షయ్ కుమార్‌తో పని చేసిన ఎక్స్‌పీరియెన్స్ గురించి విష్ణు మంచు తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పంచుకున్నారు.
“అక్షయ్‌కుమార్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైంది. ఇంకా ఇలా ఎన్నో సార్లు కలవాలని కోరుకుంటున్నాను” అని మంచు విష్ణు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ప్రభాస్ కోసం..
నిజానికి మూవీలో శివుడి పాత్రలో ప్రభాస్ ను నటింపజేయాలనుకున్నా.. అక్షయ్ ఎంటరవడంతో ఇప్పుడు ప్రభాస్ నందీశ్వరుడి పాత్ర పోషించనున్నాడు. అతడు కేవలం మూడు రోజుల సమయమే ఇవ్వడంతో శరవేగంగా షూటింగ్ పూర్తి చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసమే ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేసినట్లు తాజా వార్తల ప్రకారం స్పష్టమవుతోంది.
ఈ మధ్యే న్యూజిలాండ్ లోనూ కన్నప్ప షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ మధ్యే కన్నప్ప కథను మంచు విష్ణు ఓ పుస్తకంగా కూడా అచ్చేయించాడు. మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా దానిని రిలీజ్ చేశాడు. ముకేశ్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. షెల్డన్ చౌ కెమెరా పని చూసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విష్ణు లుక్స్ కూడా వచ్చిన విషయం తెలిసిందే.
కన్నప్పగా చాలా ఇంటెన్స్ లుక్ లో విష్ణు ఈ పోస్టర్లలో కనిపించాడు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. మోహన్ బాబు, మోహన్ లాల్ కూడా ఈ మూవీలో రెండు కీలకపాత్రలు పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో పార్వతిగా అనుష్క శెట్టి నటిస్తోంది. తన కలల ప్రాజెక్టును అత్యంతి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని మంచు విష్ణు ప్లాన్ చేస్తున్నాడు.