Best Web Hosting Provider In India 2024
Rythu Bharosa Funds : తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. దీంతో రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ అవుతున్నాయి. ఐదు ఎకరాల పైబడిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. రైతు భరోసా కింద రూ.2 వేల కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
పంట నష్టం నిధులు విడుదల
తెలంగాణలో అకాల వర్షాలు, కరవు పరిస్థితులతో పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు పంట నష్టం నిధులును ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేసింది. పంట నష్టం నిధులు విడుదలకు ఈసీ అనుమతించడంతో ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. 15,246 మంది రైతులకు రూ. 15.81 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 10 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది.
సంబంధిత కథనం
టాపిక్