Best Web Hosting Provider In India 2024
వైయస్ఆర్‌సీపీ ఎన్ఆర్ఐ వింగ్ స్టేట్ కో-ఆర్డినేటర్ యార్లగడ్డ వెంకటరమణ
తాడేపల్లి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంగ్లీష్ మీడియం వలన తెలుగు నష్ట పోతుంది అన్నట్టు మాట్లాడారని వైయస్ఆర్‌సీపీ ఎన్ఆర్ఐ వింగ్ స్టేట్ కో-ఆర్డినేటర్ యార్లగడ్డ వెంకటరమణ తప్పుపట్టారు. ప్రతిపక్షనేతలు,విమర్శలు చేస్తున్నవారు ఇంగ్లీష్ మీడియంలోనే వారి పిల్లలను చదివిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తు బాగుంటుందని, కూటమిలో ఉన్న నాయకుల మాట విని తెలుగు బాష గురించి మాట్లాడటం బాధగా ఉంది. చంద్రబాబు కొడుకు ఎక్కడ చదివాడు ఏం మీడియంలో చదివాడు.మనవడు ఏ మీడియంలో చదువుతున్నాడు. పేద ప్రజల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివితే తప్పేంటి..
విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన నాయకుడు వైయస్ జగన్. పేదపిల్లలను ప్రపంచస్దాయి విద్యార్దులుగా తీర్చిదిద్దుతున్న ఘనత వైయస్ జగన్ గారిదే. ఓటుకి ఇంగ్లీష్ మీడియానికి ఏంటి సంబంధం.ఇంగ్లీష్ మీడియం తీసుకురాను అని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా..అని ప్రశ్నించారు.
2014 కూటమి మ్యానిఫెస్టో లో నరేంద్ర మోడీ ఫోటో ఉంది ఇప్పుడు ఎందుకు ఫోటో లేదు..ఆ ఫోటో పెట్టేందుకు బిజేపినేతలు ఎందుకు ఒప్పుకోలేదో చంద్రబాబు బహిరంగంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా..మోడీ సభలో ల్యాండ్ టైటిల్ గురించి చంద్రబాబు మాట్లాడగలడా.ఆ దమ్ము ఉందా? సవాలు చేశారు.
పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో సపోర్ట్ చేసి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మంచిదని చెప్పిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థ తప్పని అన్నచంద్రబాబు, ఈ రోజు ఎలా సమర్దిస్తున్నాడో..అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ చంద్రబాబు భవిష్యత్తు లో సపోర్ట్ చేయక తప్పదు.
కేంద్రంలో బీజేపీ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి కూటమిలో ఉన్న చంద్రబాబు,పవన్ వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారు…వాళ్ళు చేస్తున్న మోసం ప్రజలు గ్రహించాలి.