Best Web Hosting Provider In India 2024
చాలా మంది పిల్లలు ఉదయంపూట బిస్కెట్లు తినడానికి ఇష్టపడుతారు. టీలో వీటిని తింటూ ఉంటారు. అయితే ఎప్పుడై ట్రై చేయని విధంగా కొత్తగా బిస్కెట్లతో బోండా తయారుచేయండి. ఇది మీకు కొత్త రుచిని అందిస్తుంది. ఇంట్లో ఖాళీ సమయం ఉన్నప్పుడు మొబైల్, టీవీలు చూసే బదులుగా ఇలాంటి కొత్తరకం రెసిపీ ప్రయత్నించండి. ఈ బిస్కెట్ బోండాను చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
మీరు ఖాళీ సమయంలో కాఫీ-టీలతో ఆస్వాదించడానికి ఏదైనా స్నాక్‌గా కొత్తగా తయారు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే బిస్కెట్ బోండా బాగుంటుంది. ఉదయంపూట పిల్లలు అల్పాహారంలాగా కూడా తీసుకుంటారు. కొంతమంది టీ-కాఫీతో పాటు రుచిగా కొన్ని స్నాక్స్ తయారుచేస్తారు. వాటిలో ఈ బిస్కెట్ బోండా ఒకటి. ఈ రెసిపీని తయారు చేయడం చాలా సులభం, చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కచ్చితంగా ఒకట్రెండు ఎక్కువే లాగించేస్తారు. ఇంతకీ ఈ బోండాను ఇంట్లోనే బిస్కెట్లు ఉపయోగించి ఎలా తయారు చేసుకోవాలి? దాని తయారీకి కావలసిన పదార్థాలు ఏమిటి? పద్ధతి ఏమిటి? దీనికి ఎంత సమయం పడుతుందో పూర్తి సమాచారం కోసం ఇక్కడ చూడండి.
బిస్కెట్ బోండాకు కావలసిన పదార్థాలు
శనగ పిండి – 1 కప్పు, బిస్కెట్ – 1 ప్యాకెట్, కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు, కారం పొడి – 1 tsp, పసుపు పొడి – 1/4 tsp, కరివేపాకు – 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా – 1/4 tsp, వంట నునె, రుచికి ఉప్పు
బిస్కెట్ బోండా తయారీ విధానం
ఒక గిన్నెలో శెనగపిండి తీసుకుని అందులో సోడా పొడి, కొత్తిమీర తరుగు, పసుపు, కారపు పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
నీరు కలపకుండా కలపండి. తర్వాత కొద్దిగా నీరు, కలపాలి. ఈ పిండి కాస్త చిక్కగా ఉండాలి. అలాగే ఈ పిండిని దోసె పిండిలా సిద్ధం చేసుకోండి.
తర్వాత ఒక పాత్రలో నూనె వేసి స్టవ్‌పై ఉంచాలి. తర్వాత బిస్కెట్లకు పిండిని రెండు వైపులా బాగా పూసి నూనెలో వేయాలి.
బిస్కెట్‌ను రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు బాగా వేడి చేయండి. రెండు నిమిషాలు వేడి చేస్తే సరిపోతుంది. మీకు నచ్చే బిస్కెట్ బోండా మీ ముందు రెడీగా ఉంది. ఇది టీ-కాఫీతో చాలా రుచిగా ఉంటుంది.
ఈ బిస్కెట్ బోండా చేయడానికి మీకు సాల్ట్ బిస్కెట్ కావాలి. తీపి బిస్కెట్‌లో దీన్ని చేయవద్దు. రుచి బాగుండదు. అయితే సాల్ట్ బిస్కెట్‌తో చేస్తాం కాబట్టి ఉప్పును కూడా సరైన మోతాదులో వేసుకోవాలి. ఎక్కువగా వేయకూడదు