Best Web Hosting Provider In India 2024
SIT Telugu OTT: అరవింద్ కృష్ణ , రజత్ రాఘవ్ హీరోలుగా నటించిన తెలుగు మూవీ ఎస్. ఐ. టి. (S.I.T ) థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. మే 10 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఎస్. ఐ. టి మూవీ రిలీజ్ డేట్‌ను జీ5 ఓటీటీ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో పోలీస్ ఆఫీసర్ గా సీరియల్ ఇంటెన్స్ లుక్‌లో అరవింద్ కృష్ణ కనిపిస్తోన్నాడు. క్రైమ్ సీన్ డు నాట్ క్రాస్ అనే ఎల్లో కలర్ స్టిక్కర్స్ ఆసక్తిని పంచుతోన్నాయి.
ఇద్దరు హీరోయిన్లు…
ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నటాషాదోషి, రుచితా సాదినేని హీరోయిన్లుగా నటిస్తోన్నారు. ఎస్. ఐ. టి. (S.I.T ) మూవీకి వీబీఆర్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీమ్…
ఎస్ఐటీ అంటే స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీమ్ అని అర్థం. ఓ క్రైమ్‌ను సాల్వ్ చేయడంలో ఓ పోలీస్ ఆఫీసర్ బృందానికి ఎలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి? సంచలనంగా మారిన క్రైమ్‌ను తన తెలివితేటలతో ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా సాల్వ్ చేశాడు అన్నది థ్రిల్లింగ్‌గా ఈ మూవీలో చూపించబోతున్నట్లు సమాచారం.
పోలీస్ ఆఫీసర్ గా….
స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీమ్ ఆఫీసర్ రోల్లో అరవింద్ కృష్ణ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఎస్. ఐ. టి. (S.I.T ) మూవీలో కౌశిక్ మేకల, అనిల్ రాథోడ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. గత ఏడాది ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. అనివార్య కారణాల వల్ల థియేటర్లలో రిలీజ్ ఆలస్యం కావడంతో ఓటీటీలో ఈ మూవీని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
హీరో…ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్…
యంగ్ ఇండియా మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అరవింద్ కృష్ణ. ఆ తర్వాత హీరోగా ఇట్స్ మై లవ్ స్టోరీ, రుషి, అడవి కాచిన వెన్నెల, బిస్కెట్‌తో పాటు పలు సినిమాలు చేశాడు. కథల్లో కొత్తదనం లేకపోవడం, సరిగ్గా ప్రమోట్ చేయలేకపోవడంతో ఈ సినిమాలు ఆనుకున్న స్థాయిలో ఆడలేకపోయాయి.
ప్రేమలు మూవీలో…
ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన అరవింద్ కృష్ణ…ప్రేమమ్, రామారావు ఆన్ డ్యూటీతో పాటు మరికొన్ని సినిమా ల్లో కనిపించాడు. ఓ వైపు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూనే హీరోగా కూడా చిన్న సినిమాలు చేస్తున్నాడు అరవింద్ కృష్ణ. ప్రస్తుతం ఏ మాస్టర్ పీస్ సినిమాలో హీరోగా నటిస్తోన్నాడు అరవింద్ కృష్ణ. ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. రజత్ రాఘవ్ కూడా తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోగా, విలన్‌గా నటించాడు.