Arya@20 Years: ఆర్య మూవీకి 20 ఏళ్లు.. జీవితాన్ని మార్చేసిన సినిమా అంటూ అల్లు అర్జున్ ఎమోషనల్

Best Web Hosting Provider In India 2024

Arya@20 Years: ఆర్య మూవీ టాలీవుడ్ లో ఓ సెన్సేషన్. తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించిన మూవీ ఇది. ఈ సినిమా మే 7, 2004లో రిలీజైంది. అంటే మంగళవారానికి (మే 7) సరిగ్గా 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తనను ఐకాన్ స్టార్ గా మార్చిన ఈ సినిమా గురించి అల్లు అర్జునే ట్వీట్ చేశాడు. తన జీవితాన్ని మార్చేసిన సినిమా అంటూ బన్నీచేసిన ఎమోషనల్ ట్వీట్ వైరల్ అవుతోంది.

ఆర్య మూవీపై అల్లు అర్జున్ ట్వీట్

ఆర్య మూవీని గుర్తు చేసుకుంటూ మంగళవారం (మే 7) ఉదయాన్నే అల్లు అర్జున్ తన ఎక్స్ అకౌంట్లో ఓ పోస్ట్ చేశాడు. “ఆర్య మూవీకి 20 ఏళ్లు. ఇది కేవలం ఓ సినిమా మాత్రమే కాదు. నా జీవిత గమనాన్ని మార్చేసిన ఓ సందర్భం. ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని అన్నాడు. ఈ సందర్భంగా ఆర్య మూవీకి 20 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా రిలీజ్ చేసిన పోస్టర్ షేర్ చేశాడు.

ఆర్య మూవీ టాలీవుడ్ లో అల్లు అర్జున్ కెరీర్ నే కాదు డైరెక్టర్ సుకుమార్ కెరీర్ నూ మలుపు తిప్పింది. బన్నీకి ఇది కెరీర్లో రెండో సినిమా కాగా.. సుకుమార్ కు ఇదే మొదటి మూవీ. ఈ సినిమాకు ముందు అల్లు అర్జున్ గంగోత్రి ద్వారా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. అయితే తన తొలి సినిమాకు, రెండో సినిమాకు గుర్తు పట్టలేనంతగా అతడు మారిపోయాడు.

అతనిలోని స్టైలిష్ స్టార్ ను పరిచయం చేసిన సినిమా ఈ ఆర్య. గంగోత్రిలో అమాయకుడైన ఓ అబ్బాయి పాత్రలో కనిపించిన బన్నీ.. ఆర్యలో మాత్రం డిఫరెంట్ లుక్ లో కనిపించడంతోపాటు తనలోని అసలైన యాక్టింగ్, డ్యాన్సింగ్ స్కిల్స్ ను బయటపెట్టాడు. యూత్ లో ఐకాన్ స్టార్ గా మారిపోవడానికి కారణం ఈ ఆర్య సినిమానే.

ఆర్య.. కెరీర్‌ను మార్చేసిన సినిమా

ఆర్య నిజంగానే అల్లు అర్జున్ కెరీర్, జీవితాన్ని మార్చేసిన సినిమాగా చెప్పొచ్చు. ఈ మూవీ 2004లో రిలీజై అప్పట్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్ల వసూళ్లు సాధించింది. ఓ కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది ఈ రొమాంటిక్ యాక్షన్ కామెడీ మూవీ. తొలి సినిమాతోనే సుకుమార్ ను ఓ రేంజ్ కు తీసుకెళ్లింది.

ఆ తర్వాత జగడం, ఆర్య 2లతో బోల్తా పడినా.. 100 పర్సెంట్ లవ్, వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్పలాంటి సినిమాలతో అతని రేంజ్ క్రమంగా పెరుగుతూ వెళ్లింది.

ఇక ఆర్య తర్వాత అల్లు అర్జున్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ 20 ఏళ్లలో అతడు టాలీవుడ్ లోని స్టార్ హీరోల్లో ఒకడిగా ఎదిగాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప మూవీతోనే నేషనల్ అవార్డు అందుకునే స్థాయికి బన్నీ చేరుకున్నాడు. ఇప్పుడు పుష్ప 2 మూవీతో మరోసారి దేశాన్ని ఊపేయడానికి అల్లు అర్జున్, సుకుమార్ జోడీ సిద్ధమవుతోంది.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024