Tollywood: నాగ‌చైత‌న్య మూవీతో తెలుగులో హీరోయిన్‌గా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కెరీర్ ప్రారంభం కావాల్సింది…కానీ

Best Web Hosting Provider In India 2024

Varalakshmi Sarathkumar: తెలుగు, త‌మిళ భాష‌ల్లో వెర్స‌టైల్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న‌ది వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌. లేడీ విల‌న్ రోల్స్ అన‌గానే తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్ర‌స్తుతం వ‌ర‌ల‌క్ష్మి పేరు ఫ‌స్ట్ ఛాయిస్‌గా వినిపిస్తోంది. నెగెటివ్ షేడ్ రోల్స్‌లో ప‌తాక స్థాయిలో విల‌నిజాన్ని పండిస్తూ ప్ర‌తిభ‌ను చాటుకుంటోంది. విల‌న్‌గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో లీడ్ రోల్స్ చేస్తోంది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన శ‌బ‌రి మూవీ ఇటీవ‌లే థియేట‌ర్ల‌లో రిలీజై డీసెంట్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది.

సందీప్‌కిష‌న్ మూవీతో…

కాగా 2019లో సందీప్‌కిష‌న్ హీరోగా న‌టించిన తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్ మూవీతో విల‌న్‌గా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాకు ఏడేళ్ల ముందే వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌ కుమార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాల్సింది. నాగ‌చైత‌న్య‌కు జోడీగా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసిన ఆ త‌ర్వాత ఈ కాంబో సెట్‌కాక‌పోవ‌డంతో మ‌రో హీరోహీరోయిన్ల‌తో ఆ మూవీ తెర‌కెక్కింది. అదే గౌర‌వం మూవీ.

నాగార్జున ప్రొడ్యూస‌ర్‌గా…

అల్లు శిరీష్‌, యామిగౌత‌మ్ జంట‌గా ప్ర‌కాష్ రాజ్ ప్రొడ్యూస్ చేసిన గౌర‌వం మూవీ క్రిటిక్స్‌ ప్ర‌శంస‌లు అందుకున్నా క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది. ఈ సినిమాలో తొలుత నాగ‌చైత‌న్య‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ హీరోహీరోయిన్లుగా సెలెక్ట్ అయ్యారు. వీరిద్ద‌రితో సినిమాను నిర్మించాల‌ని నాగార్జున ప్లాన్ చేశారు. నాగ‌చైత‌న్య‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌ల‌పై ఫొటోషూట్ కూడా పూర్తిచేశారు. తెలుగుతో పాటు త‌మిళంలో ఈ సినిమాను ఒకేసారి నిర్మించాల‌ని అనుకున్నారు.

మెసేజ్ ఓరియెంటెడ్ మూవీతో…

మెసేజ్ ఓరియెంటెడ్ మూవీతోనే కెరీర్ మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు అప్ప‌ట్లో గౌర‌వం మూవీ గురించి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కొన్ని ఇంట‌ర్వ్యూల‌లో చెప్పింది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ మూవీ ఆగిపోయింది. గౌర‌వం మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాల్సిన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ చివ‌ర‌కు విల‌న్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

ఆ త‌ర్వాత అల్లు శిరీష్‌తో ప్ర‌కాష్ రాజ్ గౌర‌వం మూవీని నిర్మించాడు. ఇందులో అల్లు శిరీష్‌కు జోడీగా త‌మ‌న్నా, నిత్యామీన‌న్‌, అమ‌లాపాల్‌తో పాటు చాలా మంది హీరోయిన్ల పేర్ల‌ను ప‌రిశీలించారు. కానీ ఎవ‌రి డేట్స్ సెట్స్ కాక‌పోవ‌డంతో యామీగౌత‌మ్‌ను తీసుకున్నారు.

తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌దిసినిమాలు…

కోలీవుడ్ సినిమాల‌తోనే వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కెరీర్ ప్రారంభ‌మైంది. హీరోయిన్‌గా ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేక‌పోయిన ఆమె క్యారెక్ట‌ర్స్ ఆర్టిస్ట్‌గా మాత్రం తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతుంది. క్రాక్‌, య‌శోద‌ సినిమాల్లో చేసిన‌ నెగెటివ్ పాత్ర‌లు తెలుగులో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కోట బొమ్మాళి పీఎస్‌లో ప్ర‌భుత్వానికి లోబ‌డి ప‌నిచేసే పోలీస్ ఆఫీస‌ర్‌గా అస‌మాన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది. వీర‌సింహారెడ్డిలో బాల‌కృష్ణ‌కు, హ‌నుమాన్‌లో హీరో తేజా స‌జ్జాకు సోద‌రిగా వ‌ర‌ల‌క్ష్మి క‌నిపించింది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌దికిపైగా సినిమాలు చేస్తోంది వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌.

త్వ‌ర‌లో పెళ్లి…

వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ త్వ‌ర‌లోనే వివాహ బంధంలోకి అడుగుపెట్ట‌బోతుంది. నికోలాయ్ స‌చ్‌దేవ్‌తో ఇటీవ‌ల వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. త్వ‌ర‌లోనే త‌మ పెళ్లి డేట్‌ను ఈ జంట అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేయ‌బోతుంది.

IPL_Entry_Point

టాపిక్

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024