AP ECET 2024: రేపీ ఏపీ ఈసెట్‌ 2024, ఇప్పటికే హాల్‌ టిక్కెట్ల విడుదల చేసిన JNTU కాకినాడ

Best Web Hosting Provider In India 2024

AP ECET 2024: ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ ఈసెట్‌ 2024 మే8న జరుగనుంది. ఇప్పటికే ఈసెట్ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. మే 1 నుంచి ఆన్‌‌లైన్‌లో ఈసెట్‌ హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. మే 8వ తేదీన ఏపీ ఈసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. మే 10వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేస్తారు. మే 12వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.

హాల్‌ టిక్కెట్ల కోసం ఈ లింకును అనుసరించండి.

https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_GetPrintHallTicket.aspx

ఆంధ్రప్రదేశ్‌ లో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో రెండో ఏడాది ప్రవేశాల కోసం నిర్వహించే ఈసెట్‌ నోటిఫికేషన్ 2024 గత మార్చిలో విడుదలైంది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల కోసం ఏపీ ఉన్నత విద్యా మండలి మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేసింది.

మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల తర్వాత ఇంజనీరింగ్ కోర్సుల్లో రెండో ఏడాది ప్రవేశాల కోసం ఈసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్ధులు ప్రవేశాలు పొందవచ్చు.

2024-25 విద్యా సంవత్సరంలో రెండో ఏడాది ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 8వ తేదీన ఈసెట్‌ 2024 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12గంటల వరకు ఓ సెషన్, మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు మరో సెషన్‌లో పరీక్ష నిర్వహిస్తారు.

ఈసెట్‌ 2024 ప్రవేశాల కోసం మార్చి 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరించారు. రూ.5వేల ఆలస్య రుసుముతో మే 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు.

ఏపీ ఈసెట్‌ 2024 ఇన్ఫర్మేషన్ బ్రోచర్, విద్యార్హతలు, కోర్సుల వారీగా అర్హతలు, ఇంజనీరింగ్, టెక్నాలజీ డిప్లొమాల వారీగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతించే కోర్సుల వివరాలు, సీట్ల లభ్యత, యూనివర్శిటీల పరిధిలో కళాశాలల జాబితా వంటి వివరాలు నోటిఫికేషన్‌‌ బ్రోచర్‌లో అందుబాటులో ఉంటాయని కన్వీనర్ వెల్లడించారు.

ప్రవేశపరీక్ష ఇలా..

ఈసెట్ పరీక్షలో 200మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 50 మార్కులు మ్యాథ్స్‌ నుంచి ఉంటాయి. ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. మరో 100 మార్కులు సంబంధిత విభాగానికి సంబంధించినవి ఉంటాయి.

ఫార్మసీ విభాగంలో ఫార్మాస్యూటిక్స్‌లో 50 మార్కులు, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో 50, ఫార్మాకాగ్నసీలో 50, ఫార్మాకాలజీలో 50 మార్కలుకు ప్రశ్నలు ఉంటాయి. బిఎస్సీ విద్యార్హతతో దరఖాస్తు చేసేవారికి మ్యాథ్స్‌లో 100 మార్కులు, అనలిటికల్ ఎబిలిటీలో 50, కమ్యూనికేషన్ ఇంగ్లీష్‌లో 50 ప్రశ్నలు ఉంటాయి. అగ్రికల్చర్ బిఎస్సీ ప్రవేశాలకు డిప్లొమా కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్

EducationAp EcetEntrance TestsAndhra Pradesh News
Source / Credits

Best Web Hosting Provider In India 2024