Best Web Hosting Provider In India 2024
Asuraguru Review: విక్రమ్ ప్రభు, మహిమా నంబియార్ హీరోహీరోయిన్లుగా నటించిన అసురగురు మూవీ ఇటీవల ఆహా ఓటీటీలో రిలీజైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి రాజ్‌దీప్ దర్శకత్వం వహించాడు. తమిళంలో కమర్షియల్‌గా హిట్టైన ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా? అంటే?
డబ్బును కొట్టేయాలనే మానసిక సమస్య…
శక్తి (విక్రమ్ ప్రభు)ఓ దొంగ. ట్రైన్‌లో ఫుల్ సెక్యూరిటీ మధ్య వస్తోన్న కోట్ల రూపాయల ఆర్‌బీఐ డబ్బును దోచేస్తాడు. అలాగే జమాలుద్దీన్ (నాగినీడు) అనే హవాలా వ్యాపారి డబ్బును టెక్నాలజీ సహాయంతో తెలివిగా ప్లాన్ చేసి కొట్టేస్తాడు. వేర్వేరు చోట్ల నుంచి కోట్ల కొద్ది డబ్బు దోచుకున్న శివ వాటిలో నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయకుండా అంత తన రూమ్‌లోనే సీక్రెట్‌గా దాచేస్తుంటాడు.
ఆర్‌బీఐ నుంచి డబ్బు దోచుకున్న శివను పట్టుకునే బాధ్యతను మాణిక్యాల రావు (సుబ్బరాజు) అనే స్పెషల్ ఆఫీసర్‌కు అప్పగిస్తాడు కమీషనర్. తన డబ్బు కొట్టేసిన శివను పట్టుకోవడానికి దియా (మహిమా నంబియార్) అనే డిటెక్టివ్‌ను ఆశ్రయిస్తాడు జమాలుద్దీన్. శివను పట్టుకోవడానికి ఓ వైపు మాణిక్యాలరావు, మరోవైపు దియా ప్రయత్నాలు చేస్తుంటారు. వారిలో శివ ఎవరికి దొరికాడు?
అసలు ఆ డబ్బును శివ ఎందుకు దోచుకుంటున్నాడు? శివకు ఉన్న మానసిక సమస్య ఏమిటి? శివను ప్రేమించిన దియా అతడిని కాపాడటానికి ఏం చేసింది? శివను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయల డబ్బుతో పాటు ప్రమోషన్ కొట్టేయడానికి మాణిక్యాలరావు ఎలాంటి ప్లాన్ వేశాడు? అతడు వేసిన ట్రాప్ నుంచి శివ ఎలా బయటపడ్డాడు? అన్నదే అసుర గురు కథ.
జెంటిల్‌మన్, కిక్…
పోలీసులను బోల్తా కొట్టిస్తూ హీరో తన తెలివితేటలతో దొంగతనాలు చేయడం, అతడికో గతం అనే కాన్సెప్ట్‌తో శంకర్ జెంటిల్‌మన్ , రవితేజ కిక్ తో పాటు దక్షిణాదిలో ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి.
కమర్షియల్ హంగులు, హీరోయిజం కలగలిసిన ఈ పాయింట్‌ను ఒక్కో దర్శకుడు ఒక్కోలా స్క్రీన్‌పై ఆవిష్కరించారు. అసుర గురు మెయిన్ కాన్సెప్ట్ ఇదే. ఈ పాయింట్‌కు డబ్బును మాత్రమే దొంగతనం చేయాలనే మానసిక సమస్యతో హీరో బాధపడటం అనే అంశాన్ని జోడించి కొత్తగా తెరపై చెప్పేందుకు దర్శకుడు రాజ్‌దీప్ ప్రయత్నించారు.
మానసిక సమస్య కారణంగా హీరో దొంగగా మారడం, అతడిని పట్టుకోవడానికి ఓ పోలీస్ ఆఫీసర్‌తో పాటు మరో లేడీ డిటెక్టివ్ ప్రయత్నించడం …ఈ మెయిన్ లైన్ సెటప్ బాగా కుదిరింది. ఈ పాయింట్‌ను ఎగ్జైటింగ్‌గా చెప్పడంలో మాత్రం దర్శకుడు తడబడ్డాడు.
ఈజీగా దొంగతనాలు…
హీరో ఈజీగా దొంగతనాలు చేయడం, అతడిని పట్టుకోవడానికి మాణిక్యాలరావు వేసే ఎత్తుల్లో ఉత్కంఠ మిస్సయింది. విలన్స్ బ్యాచ్ నుంచి హీరో సింపుల్‌గా డబ్బులు కొట్టేసే సీన్స్ సిల్లీగా అనిపిస్తాయి. హీరోయిన్ ఇన్వేస్టిగేషన్‌లో పసలేదు. హీరోకు మానసిక సమస్య రావడానికి బలమైన కారణం అంటూ కనిపించదు. లవ్‌స్టోరీ సినిమా నిడివి పెంచడానికే ఉపయోగపడింది. క్లైమాక్స్ కూడా ఏదో ముగించేయాలి కాబట్టి తీశాం అన్నట్లుగానే ఉంటుంది.
డిటెక్టివ్ గా హీరోయిన్….
శక్తి అనే దొంగగా విక్రమ్ ప్రభు యాక్టింగ్ ఒకే అనిపిస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో మాత్రం తేలిపోయాడు. ఇంటిలిజెంట్ డిటెక్టివ్‌గా హీరోయిన్‌ను పరిచయం చేశాడు డైరెక్టర్. కానీ ఆమె తెలివితేటలకు తగ్గ ఒక్క సీన్ సినిమాలో కనిపించదు.
హీరో గురించి అతడి ఫ్రెండ్ చెప్పగానే హీరోయిన్ వెంటనే నమ్మేసి అతడితో ప్రేమలో పడి డ్యూయెట్ సాంగ్ వేసుకోవడం లాజిక్‌లకు అందదు. పోలీస్ ఆఫీసర్‌గా సుబ్బరాజు తెలుగులో ఇదివరకు ఇలాంటి పాత్రలు చాలానే చేశాడు. చివరలో అతడిలోని నెగెటివ్ షేడ్‌ను చూపించారు. యోగిబాబు అరవ కామెడీ భరించడం కష్టమే, నాగినీడు విలనిజం సరిగ్గా కుదరలేదు.
క్రియేటివిటీ మిస్…
అసురగురు పేరులో ఉన్న క్రియేటివిటీ సినిమాలో లేదు. పాయింట్ కొత్తగా ఉన్నా దానిని స్క్రీన్‌పై ప్రజెంట్ చేసిన విధానంలో మాత్రం పాత సినిమాల ఛాయలే కనిపిస్తాయి.
టాపిక్